Home /News /andhra-pradesh /

AP Welfare Schemes: రెండేళ్లలో లక్ష కోట్లు... ఏపీలో ఏ సంక్షేమ పథకానికి ఎంత ఇచ్చారంటే...!

AP Welfare Schemes: రెండేళ్లలో లక్ష కోట్లు... ఏపీలో ఏ సంక్షేమ పథకానికి ఎంత ఇచ్చారంటే...!

సీఎం వైఎస్ జగన్ (ఫైల్)

సీఎం వైఎస్ జగన్ (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాలే (Andhra Pradesh Welfare Schemes) అజెండాగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో మరో ఘనత సాధించింది.

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎశ్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో భాగంగా చేస్తున్న ప్రత్యక్ష నగదు బదిలీ ప్రక్రియ మరో మైలురాయిని దాటింది. రెండో ఏడాది చేయూత పథకం వర్తింపు ద్వారా వివిధ పథకాల లబ్ధిదారులకు రెండేళ్లకాలంలో ప్రభుత్వం రూ.1,00,116.36 కోట్లు నగదును నేరుగా వారి ఖాతాల్లోకి జమచేసింది. అర్హతే ప్రామాణికంగా రాష్ట్రవ్యాప్తంగా 6,53,12,534 పథకాలను లబ్ధిదారులకు అందించారు. ఇంత పెద్దమొత్తం సొమ్మును వివిధ పథకాల ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ చేయడం రికార్డుగా ప్రభుత్వం అభివర్ణించింది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందాలన్న సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో, దరఖాస్తు చేసుకున్న వారికి నిర్ణీత సమయంలోనే ఆయా పథకాలు చేరువ చేశారు. వలంటీర్లు, సచివాలయాల్లో అందచేసిన దరఖాస్తును నిర్థిష్టమైన కాలపరిమితిలో పరిష్కరించడం, లబ్ధిదారుల జాబితాలను సచివాలయాల్లో ప్రదర్శించడం ద్వారా సోషల్ ఆడిట్ చేస్తున్నారు. ఎక్కడైనా అర్హులు తమకు ప్రభుత్వ పథకాలు అందడం లేదని చెబితే, వారికి మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.

  రాష్ట్రంలో ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరి అర్హతలను పరిశీలించి, సంతృప్తస్థాయిలో పథకాలను అమలు చేయాలనే పనిచేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రతి పథకం ఎప్పుడు, ఏ నెలలో అమలు చేస్తున్నారో ముందుగానే స్పష్టంగా ప్రకటిస్తున్నారు. అంతేకాకుండా దరఖాస్తు చేసుకునే ప్రక్రియను నిరంతరం ఉండేలా చర్యలు తీసుకున్నారు.

  ఇది చదవండి: ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలపై క్లారిటీ.. షెడ్యూల్ ఎప్పుడంటే..!


  కోవిడ్ సంక్షోభంతో ప్రపంచమంతా ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నా.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో వెనకడుగు వేయలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. విద్యార్థులు, నిరుపేదలు, రైతులు, మహిళలు, వృద్ధులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమం, సమగ్ర పురోగతి ధ్యేయంగా పథకాలను అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. కోవిడ్ లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన తెల్లరేషన్ కార్డు కలిగిన పేదలను ఆదుకునేందుకు స్పెషల్ కోవిడ్ అసిస్టెన్స్‌ కింద రాష్ట్ర వ్యాప్తంగా 1,35,05,338 మందికి 1,350.53 కోట్ల రూపాయలు అందచేశారు.

  ఇది చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్... వినూత్న ఆలోచనకు సీఎం జగన్ శ్రీకారం..


  ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల్లో మహిళలకే ప్రాధాన్యత ఇచ్చారు. పిల్లలను పాఠశాలలకు పంపుతున్న 44,48,865 మంది తల్లుల ఖాతాల్లో డిబిటి ద్వారా రూ.13,022.93 కోట్లు జమ చేశారు. అలాగే విద్యార్ధుల కోసం అమలు చేస్తున్న జగనన్న వసతిదీవెన కింద 15,56,956 మంది తల్లుల ఖాతాలకు రూ.2,269.93 కోట్లు, విద్యాదీవెన కింద 18,80,934 మంది తల్లుల ఖాతాలకు రూ.4,879.30 కోట్లు జమ చేశారు. వైయస్‌ఆర్ సున్నావడ్డీ కింద స్వయం సహాయక బృందాల మహిళలు 98,00,626 మందికి రూ.2,354.22 కోట్లు, వైయస్‌ఆర్ చేయూత కింద 24,55,534 మంది మహిళలకు రూ.8943.52 కోట్లు, వైయస్‌ఆర్ ఆసరా కింద 77,75,681 మంది మహిళలకు రూ.6,310.68 కోట్లు, వైయస్ఆర్ కాపునేస్తం కింద 3,27,862 మంది మహిళలకు రూ.491.79 కోట్లు మహిళల ఖాతాలకే నేరుగా ప్రభుత్వం జమ చేసింది.

  ఇది చదవండి: మెగాస్టార్ కు థ్యాంక్స్ చెప్పిన సీఎం... ఆ ఘనత వారిదేనన్న జగన్


  వైయస్‌ఆర్ రైతుభరోసా కింద 52.38 లక్షల మందికి రూ.17,029.88 కోట్లు, వైయస్‌ఆర్ సున్నావడ్డీ పంట రుణాల కింద 58,96,994 మందికి రూ.1,105.89 కోట్లు, డాక్టర్ వైయస్ఆర్ ఉచిత పంటల బీమా కింద 31,06,641 మందికి రూ.3,788.25 కోట్లు, ఇన్‌పుట్ సబ్సిడీ కింద 13,70,881 మందికి రూ.1,055.19 కోట్లు, మత్స్యకార భరోసా కింద 1,19,875 మందికి రూ.331.58 కోట్లు, వైయస్‌ఆర్ పెన్షన్ కానుక కింద 61,72,964 మందికి రూ.32,469.40 కోట్లు, వైయస్‌ఆర్ బీమా కింద 1,03,171 మందికి 1,681.93 కోట్లు, వైయస్‌ఆర్ నేతన్న నేస్తం కింద 81,703 మందికి రూ.383.79 కోట్లు, జగనన్న చేదోడు కింద 2,98,428 మందికి రూ.298.43 కోట్లు, వైయస్‌ఆర్ లా నేస్తం కింద 2,012 మందికి రూ.13.08 కోట్లు, వైయస్‌ఆర్ వాహనమిత్ర కింద 2,74,015 మందికి రూ.762.42 కోట్లు, డాక్టర్ వైయస్‌ఆర్ ఆరోగ్య ఆసరా కింద 4,66,234 మందికి రూ.282.08 కోట్లు, ఎంఎస్ఎంసి రీస్టార్ట్ కింద 16,725 మందికి రూ.904.83 కోట్లు, అగ్రీగోల్డ్ కింద 3,34,160 మందికి రూ.236.53 కోట్లు, అర్చకులు, ఇమామ్‌, మౌజమ్, పాస్టర్లు మొత్తం 77,290 మందికి రూ.37.71 కోట్లు నేరుగా వారి ఖాతాలకే ప్రభుత్వం జమ చేసింది.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Ap welfare schemes

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు