శ్రావణ శుక్రవారం ఆవుల మృతి అంటే రాష్ట్రానికి అరిష్టమే...శివస్వామి ఆవేదన...

శ్రావణమాస శుక్రవారం గోవుల మృతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అరిష్టమని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు ఇక ముందు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

news18-telugu
Updated: August 10, 2019, 9:10 PM IST
శ్రావణ శుక్రవారం ఆవుల మృతి అంటే రాష్ట్రానికి అరిష్టమే...శివస్వామి ఆవేదన...
శివస్వామి (Image: facebook)
  • Share this:
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శివస్వామి తాడేపల్లిలోని గోశాలలో గోవుల మృతిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న శివస్వామి, అక్కడి పరిసరాలను పరిశీలించారు. అనంతరం శివస్వామి మాట్లాడుతూ శ్రావణమాస శుక్రవారం గోవుల మృతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అరిష్టమని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు ఇక ముందు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఏకంగా వందకు పైగా ఆవులు చనిపోవడం అనేది హృదయ విదారకమని శివానంద ఆవేదన వ్యక్తం చేశారు. సామర్థ్యం లేని గోశాలలో 15 వందలకు పైగా గోవులను ఎందుకు ఉంచారని అన్నారు. ప్రభుత్వాలు గో రక్షణ పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆవులకు ఆధార్ అమలు చేయాలని శివస్వామి డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే తాడేపల్లి గోశాలలో 100కు పైగా ఆవులు మృతి చెందాయి. దీంతో అక్కడ గోవుల భద్రతపై సవాళ్లు ఎదురవుతున్నాయి. ఆవులకు పెట్టిన దాణాపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోస్టుమార్టం తర్వాతే ఆవుల మృతికి అసలు కారణాలు తెలుస్తాయని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
First published: August 10, 2019, 9:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading