Dr. B.Prasada Rao passed away: సమైక్య ఆంధ్రప్రదేశ్ డీజీపీ, ఐపీఎస్ ఆఫీసర్ డాక్టర్ బి. ప్రసాదరావు అనారోగ్యంతో అమెరికాలో కన్నుమూశారు. గత రాత్రి ఆయనకు గుండెనొప్పి వచ్చింది. వెంటనే ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. కానీ... అంబులెన్స్ ఆస్పత్రికి తీసుకెళ్లేసరికే... మార్గమధ్యలోనే ఆయన చనిపోయారని తెలిసింది. అమెరికా టైమ్ ప్రకారం సోమవారం అర్థరాత్రి ఒంటి గంట సమయంలో ఇది జరిగింది. మన దేశ కాలమానం ప్రకారం ఈ ఉదయం ఈ విషాదం జరిగింది. ఈ విషయం తెలిసి... ప్రసాదరావు బంధువులు, స్నేహితులు, ఆయనతో పనిచేసిన ప్రముఖులు అందరూ షాక్ అవుతున్నారు. ఆయన చనిపోవడమేంటి... ఆశ్చర్యంగా ఉందే అంటున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నారు.
ప్రసాదరావుకు భార్య సౌమిని, కొడుకు వికాస్, కోడలు సౌమ్య ఉన్నారు. కొన్ని నెలల కిందటే ఆ ఇంట మనవడు కూడా పుట్టాడు. ఇలాంటి సమయంలో... ఆయన రొమ్ము నొప్పితో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం అందర్నీ విషాదంలో ముంచేసింది. ఏపీ డీజీపీగా ఉన్నప్పుడు ఆయన చాలా చురుగ్గా ఉండేవారనీ... ఏ కార్యక్రమమైనా ముందుండి నడిపించేవారనీ... చాలా మందికి ఇన్స్‌పిరేషన్‌గా ఉండేవారని సన్నిహితులు చెబుతున్నారు. ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
డాక్టర్ ప్రసాదరావు మృతిపై ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AP News, Breaking news