Home /News /andhra-pradesh /

Heavy Rains: ఆ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు.. మరో రెండు రోజులు భారీ వానలు

Heavy Rains: ఆ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు.. మరో రెండు రోజులు భారీ వానలు

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Heavy rains to Andhra Pradesh: వర్షకాలం వెళ్లిపోయి చాలా రోజులైంది. కానీ వానలు మాత్రం వీడడం లేదు. ముఖ్యంగా కరవు సీమగా పేరొందిన రాయలసమీను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రేపు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు అధికారులు.

    Danger bells to Andhra pradesh:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పై వరుణుడు పగ బట్టాడా అని అంతా భయపడుతున్నారు. ముఖ్యంగా కరవు సీమగా గుర్తింపు పొందిన రాయలసీమ (Rayalaseema) పై  ప్రకృతి ప్రకోపానికి కారణం ఏంటో అర్థం కాలేదు అంటున్నారు.  గత కొన్ని రోజులుగా ఏపీలోని పలు జిల్లాలో వర్షాలు, వరదలు వణికిస్తున్నాయి.  ముఖ్యంగా రాయలసీమ జిల్లాతో పాటు నెల్లూరు (Nellore)లో కూడా గత 24  గంటల నుంచి భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. ఇప్పటికే వరదల కారణంగా సీమ జిల్లాలు అతలా కుతలం అవుతున్నాయి. ఇప్పుడు మరో నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్  ప్రకటించడం కలవరపెడుతోంది. ఈ వానలు ఇలాగే కొనసాగితే నదీ పరీవాహక ప్రాంతాల్లో ఉండే నిర్మాణాలు దెబ్బతినడం ఖాయం మనే భయం వెంటాడుతోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ జిల్లాలకు వచ్చిన వరదలు (AP Floods) పెద్ద విలయాన్నే సృష్టించాయి. చిన్నచిన్న ఇళ్లతో పాటు భారీ వంతెనలు కూడా నీటిలో కొట్టుకుపోయాయి.

    సోమవారం మరో అల్పపీడన భయపెడుతోంది. దీని కారణంగా ఏపీలోని పలు జిల్లాలో భారీవర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిత్తూరు, కడప జిల్లా అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. విద్యాశాఖ అధికారులు చిత్తూరు, కడప జిల్లాలోని స్కూళ్లకు రేపు (సోమవారం నవంబర్ 29వ తేదీ) సెలవు ప్రకటించారు. మరోవైపు ఇప్పటికే పలు జిల్లాలోని మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. ఇక రాబోయే రెండు రోజుల్లో ఈ వర్షాలు తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కడప, చిత్తూరు జిల్లాలకు భారీ వర్షాలు తప్పకపోవచ్చని తెలుస్తోంది. అందుకే విద్యాశాఖ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

    ఇదీ చదవండి: కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్.. కుప్పంలో అభిమానుల హంగామా..? వైరల్ అవుతున్న వీడియోలు

    సోమవారం అండమాన్ తీరంలో అల్పపీడనం ఏర్పడనుంది.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ ముందుగా హెచ్చరికలు జారీ చేసింది. ఈ అల్పపీడన ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు గుంటూరు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, డిసెంబర్ 1 వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

    ఇదీ చదవండి: టాలీవుడ్ విన్నపాలు వింటారా..? సీఎం జగన్ ను కలిసేందుకు పెద్దల ప్రయత్నం

    తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఈ అల్పపీడన ప్రభావంతో పుదుచ్చేరిలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ విద్యాశాఖ మంత్రి రెండో రోజులపాటు విద్యాసంస్థలకు సెలవులను ప్రకటించారు. పాండిలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు రెండు రోజులు సెలవు ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో సోమవారం నుంచి రెండు రోజుల పాటు సెలవు ప్రకటించామని విద్యాశాఖ మంత్రి ఎ నమశ్శివాయం తెలిపారు.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP Floods, AP News, Heavy Rains

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు