Home /News /andhra-pradesh /

House Collapsed: భారీ వర్షాల ఎఫెక్ట్.. బాబోయ్ కళ్లముందే ఏం జరిగిందో చూడండి.. కడప జిల్లాలో బీభత్సం

House Collapsed: భారీ వర్షాల ఎఫెక్ట్.. బాబోయ్ కళ్లముందే ఏం జరిగిందో చూడండి.. కడప జిల్లాలో బీభత్సం

కళ్ల ముందే కూలిన ఇళ్లు

కళ్ల ముందే కూలిన ఇళ్లు

House Collapsed: ఆంధ్రప్రదేశ్ లో వానలు బీభత్సంగా భయపెడుతున్నాయి. ఇప్పటికే మూడు జిల్లాలను వర్షాలు అతలాకుతలం చేశాయి. రోడ్లు చెరువులు అయ్యాయి.. ఊళ్లకు ఊళ్లు నీట మునిగాయి.. ఇప్పుడు ఇళ్లు కళ్ల ముందే నేల కూలుతున్నాయి. తాజాగా రైల్వే కోడూరు శివారు ప్రాంతంలోని గుంజనేరు కాలువ తీరం వెంబడి ఓ ఇల్లు కుప్పకూలిపోయింది. అది అందరూ చూస్తుండగా కళ్లముందే దారుణం జరిగింది.

ఇంకా చదవండి ...
    House Collapsed: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ను భారీ వర్షాలు భయపెట్టాయి. ఇంకా భయపెడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కపడ జిల్లా (Kadapa District) పరిస్థితి దారుణంగా తయారైంది. జనజీవనం స్థంభించేలా చేశాయి. వానలు తెరిపిచ్చినా ఇంకా పలు ప్రాంతాలు జలదిగ్భందంలోనే ఉన్నాయి. ప్రజలు ఇంకా తేరుకోలేదు. వర్షాలు విరామం ఇచ్చాయి అనుకుంటున్న సమయంలో మరో అల్ప పీడనం భయపెడుతోంది. జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వానలు పడుతూనే ఉన్నాయి. రైల్వే కోడూరు నుంచి తిరుపతి (Tirupati) వెళ్లే మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటికే నిండిన చెరువులు, జలాశయాలు వరద ముప్పు ఎదుర్కొంటున్నాయి. ఇటీవలే జిల్లాలోని ఊటుకూరు చెరువుకు మరమ్మతులు చేశారు. ఇప్పుడా చెరువుకు ఏ క్షణాన అయినా గండి పడే అవకాశాలు ఉన్నాయనే హెచ్చరికలు భయపడుతున్నాయి. కడప జిల్లాలో వర్షాలకు ఇళ్లు నానిపోతున్నాయి. చాలా ఇళ్లు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. వర్షాలు ఇలాగే కొనసాగితే భారీ నష్టం తప్పదని ప్రజలు, అధికారులు భయపడుతూనే ఉన్నారు. ఇక కాస్త పురాతన ఇళ్లు.. చెరువులకు దగ్గరలో ఇళ్లు ఉన్నవాళ్లు బిక్కు బిక్కు మంటూ బతుకుతున్నారు.

    తాజాగా రైల్వే కోడూరు శివారు ప్రాంతంలోని గుంజనేరు కాలువ తీరం వెంబడి ఓ ఇల్లు కుప్పకూలిపోయింది. ఇల్లు వెనక్కి ఒరుగుతున్న విషయాన్ని ముందే గమనించిన ఆ ఇంట్లోని వారు బయటికి వచ్చేశారు. దీంతో ప్రమాదం తప్పింది. ఈ మధ్యాహ్నం ఆ ఇల్లు కాలువలోకి పడిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందరూ చూస్తుండగానే.. ఒక బొమ్మలా ఇళ్లు కూలిపోయింది.. ఇంకా ముందు ముందు ఇలాంటి పరిస్థితులు ఎన్ని చూడాలో అనే భయం పెరుగుతోంది.




    ఇదీ చదవండి : ఆ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు.. మరో రెండు రోజులు భారీ వానలు

    కొన్ని రోజుల క్రితం చిత్తూరు జిల్లా తిరుచానూరులోనూ ఇలాంటి ఘటనే జరిగింది. తిరుచానూరులోని వసుంధర నగర్‌లో ఓ ఇల్లు వరదలో కొట్టుకుపోయింది. ప్రాణాపాయం తప్పినప్పటికీ.. ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లు స్వర్ణముఖి నది ప్రవాహంలో కొట్టుకుపోవడంతో.. ఇంటి యజమాని, ఇతర కుటుంబ సభ్యులు భోరున విలపించారు.

    ఇదీ చదవండి : కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్.. కుప్పంలో అభిమానుల హంగామా..? వైరల్ అవుతున్న వీడియోలు

    భారీ వర్షాలతో రాయలసీమ ఇప్పటికే అతలాకుతలమైంది. వరద ముంపు నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఇంతలోనే మరో ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతోంది. దీని ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో అండమాన్‌ దీవులకు దక్షిణంగా నవంబర్ 29న అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. అది క్రమంగా బలపడి పశ్చిమ, వాయువ్య దిశగా కదిలే సూచలున్నాయి. ఇది మరింత బలపడి తుపాన్ గా మారే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది..
    ఇదీ చదవండి : టాలీవుడ్ విన్నపాలు వింటారా..? సీఎం జగన్ ను కలిసేందుకు పెద్దల ప్రయత్నం

    అయితే కరవు సీమలో ఈ వర్షాలు ఎవరూ ఊహించడం లేదు. ఒకప్పుడు చినుకు కోసం ఎదురుచూసిన రాయలసీమను ఇప్పుడు వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేని వానలు కలవరపెడుతున్నాయి. కుండపోత వర్షాలతో కడప, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాలు జల సంద్రంగా మారాయి. ఎటుచూసినా నీళ్లే. ఎక్కడ చూసినా జల విలయమే కనిపిస్తోంది. ఇది చాలదన్నట్టు ఇప్పుడు తాజాగా వచ్చిన వెదర్ అలర్ట్ మరింత భయపెడుతోంది.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP Floods, AP News, Heavy Rains, Kadapa

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు