ఏపీ అసెంబ్లీలో ఉల్లి లొల్లి...చంద్రబాబు సవాలుపై మంత్రి బుగ్గన కౌంటర్

ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి దీనిపై స్పందిస్తూ రిటైల్ విభాగంలోని హెరిటేజ్ ఫ్రెష్ ను ఫ్యూచర్ గ్రూప్‌నకు రూ.295 కోట్లకు విక్రయించినట్లు ప్రచురితమైన వార్తా కథనాలను సభలో చదివి వినిపించారు.

news18-telugu
Updated: December 10, 2019, 7:46 PM IST
ఏపీ అసెంబ్లీలో ఉల్లి లొల్లి...చంద్రబాబు సవాలుపై మంత్రి బుగ్గన కౌంటర్
చంద్రబాబు నాయుడు (ఫైల్)
  • Share this:
ఏపీ అసెంబ్లీలో ఉల్లి ధరల పెరుగుదల అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. చంద్రబాబు నాయుడు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థ సూపర్ మార్కెట్లో ఒక కేజీ ఉల్లిపాయ ధర రూ.200లకు అమ్ముతున్నారనే సీఎం జగన్ చేసిన విమర్శకు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు హెరిటేజ్ సూపర్ మార్కెట్స్ వ్యాపారం నుంచి తాము వైదొలిగామని, ఆ కంపెనీతో తనకు ఎలాంటి సంబంధం లేదని, సవాలుగా తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, తనదని నిరూపిస్తే సీఎం పదవికి రాజీనామా చేస్తానని సవాలు విసిరారు. అయితే దీంతో ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి దీనిపై స్పందిస్తూ రిటైల్ విభాగంలోని హెరిటేజ్ ఫ్రెష్ ను ఫ్యూచర్ గ్రూప్‌నకు రూ.295 కోట్లకు విక్రయించినట్లు ప్రచురితమైన వార్తా కథనాలను సభలో చదివి వినిపించారు.

అయితే ఈ విక్రయం ఒప్పందంలో హెరిటేజ్ గ్రూప్‌కు ఫ్యూచర్ గ్రూపులో 3.65 శాతం వాటా దక్కిందని సభలో తెలిపారు. మరోవైపు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి సైతం హెరిటేజ్ ఫ్రెష్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. హెరిటేజ్ తమ నియంత్రణలో లేదని, ఫ్యూచర్ గ్రూప్ నియంత్రణలో ఉందని వెల్లడించారు.

First published: December 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>