Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH EXTRAMARITAL AFFAIR WITH BROTHER IN LAW WHEN ISSUE OUT SHE TAKE WRONG STEP IN WEST GODAVARI DISTRICT NGS

Extramarital Affair: మరిదిపై మనసు పడ్డ వదిన.. రోజూ అర్థరాత్రి వరకు అదేపని.. భర్తకు తెలియడంతో ఏం చేసిందంటే?

మరిదితో వదిన ఎఫైర్

మరిదితో వదిన ఎఫైర్

Extramarital Affair: ఆమె వయసు 35 సంవత్సరాలు.. చక్కటి భర్త.. ఇద్దరు పిల్లలు.. కానీ 27 మరిదికి దగ్గరైంది. ఆ పరిచయం వివాహేతర సంబందానికి దారి తీసింది.. కొంతకాలం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడింది.. కానీ ఓ రోజు భర్తకు ఆమె విషయం తెలియడంతో.. ఏం చేసిందంటే..?

ఇంకా చదవండి ...
  Extramarital Affair: వదిన అంటే తల్లితో సమానం అంటారు.. మరిదిని కన్న బిడ్డలా చూసుకోవాలి.. కానీ ఆమె మాత్రం మరిదిపై మోజు పడింది. వయసులో తనకన్నా చాలా చిన్నవాడైనా అతడంటే ఇష్టం పెంచుకుంది. ఆమె వయసు 35 సంవత్సరాలు, అతడి వయసు ఇంకా 27 సంవత్సారాలే.. అయితే ఆమెకు అతడు సమీప బంధువు.. వరకు మరిది అవుతాడు.. మంచి యవ్వనంలో ఉండడం.. నిత్యం నవ్వుతూ చురుగ్గా ఉండడంతో అతడితో బాగా క్లోజ్ అయ్యింది. రోజూ అతడితో మాట్లాడేది.. అలా చనువు పెంచుకున్న ఆమె.. అతడి మాటలకు ఫ్లాట్ అయ్యింది.. అతడిపై మోజు పెంచుకుంది. తనకు ఇద్దరు పిల్లలు.. చక్కగా చూసుకునే భర్త ఉన్నాడన్న సంగతి మరిచిపోయింది. నిత్యం అతడితో అర్థరాత్రి వరకు అతే పనిగా అతడితో చాటింగ్ చేసింది. ఇంట్లో ఏదో పని చేస్తున్నప్పుడు బిల్డప్ ఇస్తూ, పిల్లలను, భర్తను దూరం పెట్టేది. అర్థరాత్రి వరకు ఆమె ఫోన్లో బిజీగా ఉండడంతో మధ్య మధ్యలో ఆమె ఫోన్ తీసుకుని మెసేజ్ లు చెక్ చేస్తున్నా డిలీట్ చేసి ఉండేవి.. దీంతో భర్తకు అనుమానం రాలేదు. అయితే ప్రతి రోజూ అర్థరాత్రి వరకు నిద్రపోక పోవడం.. పిల్లలను తనను అస్సలు పట్టించుకోకపోవడంతో భర్తకు అనుమానం వచ్చి నిఘా పెడితే అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

  పోలీసులు, స్థానికులు చెప్పిన ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు కొత్తపేటకు చెందిన ఓ వివాహిత, రాజమండ్రికి చెందిన హేమూ ఇద్దరూ వరుసకు వదిన, మరిది అవుతారు. దూరపు బంధువులు కావడంతో పెద్దగా పరిచయం ఉండేది కాదు. అయితే ఇటీవల ఇద్దరూ ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయ్యారు. అలా ఇద్దరి మధ్య ఫేస్ బుక్ ద్వారా చాటింగ్ జరుగుతోంది. అర్థరాత్రి వరకు ఫేస్ బుక్ లో అతడితోనే చాటింగ్ చేస్తూ ఉండేది. ఆమె ప్రవర్తనలో మార్పు గమనించిన భర్త.. పలుమార్లు ఆరా తీసినా ఏం లేదో.. తన బంధువులతో మాట్లాడుతున్నాను అని చెప్పేది.. ఒకటి రెండు సార్లు ఫోన్ చెక్ చేసినా మేసేజ్ లు డిలీట్ అయ్యి ఉండడంతో భర్తకు మొదట అనుమానం రాలేదు..

  ఇదీ చదవండి : నిన్న ఒడిషా.. నేడు ఆంధ్రప్రదేశ్.. కలకలం రేపుతున్న చైనా పావురాలు.. !

  వారిద్దరి వ్యవహారం హద్దులు దాటింది. అతడితో చాటింగ్ లో మునిగి ఇంట్లో ఏం జరుగుతోంది అన్న విషయం పట్టించుకోవడం మానేసింది. పిల్లలు, భర్తను అస్సలు దగ్గరకు రానిచ్చేది కాదు.. అనుమానం వచ్చిన భర్త ఆమెపై నిఘా పెడితే.. అసలు విషయం బయట పడింది. దీంతో ఇంట్లో వివాదం మొదలైంది. ఇద్దరి మధ్య అది పెద్ద గొడవకు దారి తీసింది. ఇదేం పని పిల్లలు ఉన్నారు కదా.. బుద్ధిగా ఉండాలి.. లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని భర్త హెచ్చరించాడు.. భర్తతో జరిగిన గొడవను సైతం తన మరిదికి చేరవేసింది.

  ఇదీ చదవండి :తగ్గేదే లే అంటున్న డైరెక్టర్ వర్మ.. సంపూర్ణేష్ బాబు చిరంజీవి ఒక్కటేనా అంటూ మంత్రికి రివర్స్ కౌంటర్

  ఈ క్రమంలో మంగళవారం రాత్రి హేము రాజమండ్రి నుంచి ఏలూరు వచ్చాడు. మరోవైపు ఇంట్లో ఒక లెటర్ రాసి బయటకు వెళ్ళింది ఆ వివాహిత. ఇద్దరు కలిసి ఇవాళ ఉదయం ఏలూరు పవర్ పేట రైల్వే స్టేషన్ వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే మొదట ఆమె ఒక్క మృతదేహం కనిపిస్తే ఆమె మాత్రమే ఆత్మహత్య చేసుకుంది అనుకున్నారు.. కానీ కూతవేటు దూరంలో హేము మృత దేహం కూడ తరువాత బయట పడింది. దీంతో వీరిద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకున్నారని ప్రచారం జరుగుతుంది.ఇదీ చదవండి : ఏపీని భయపెడుతున్న ఒమిక్రాన్.. కొత్తగా ఎన్నికేసులంటే.. థర్డ్ వేవ్ అంటూ భయం

  అయితే వివాహిత మహిళ ఆత్మహత్యకు ముందు సూసైడ్ లెటర్ రాసింది. ఆ లెటర్ లో తన చావుకి ఎవరు బాధ్యులు కాదు, తన జీవితం నచ్చక అలా ఉన్నా, చనిపోతున్నా. రాజేష్ నితిన్‌ని బాగా చూసుకో, చదువు ఆపకు. రెండు సంవత్సరాల తరవాత మెరైన్ ఇంజనీర్ చదువుతా అన్నాడు. అవి వాడు లోన్ పెట్టుకొని చదువుకుంటాడు. చూస్తూ ఉండు జాగ్రత్త అని ఆ లెటర్ లో రాసింది. అయితే.. మహిళ, హేము వ్యవహారం ఇంట్లో తెలిసిందన్న భయంతోనే వారు ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

  ఇదీ చదవండి : ఆయన ఎయిడ్స్ లాంటోడు.. రాజకీయ వ్యభిచారం చేస్తారంటూ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు.

  కాగా, హేము అత్మహత్యకు ప్రేరేపించడం వల్లే ఇద్దరూ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని మహిళ భర్త రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Crime news, Extramarital affairs, West Godavari

  తదుపరి వార్తలు