అమరావతిలో దొంగలు పడ్డారు... ఆ దొంగలు ఎత్తుకుపోతుంది నగలు, డబ్బులు కాదు...వాళ్లు ఏం ఎత్తుకుపోతున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఈ దొంగలు ఏ ఖరిదైన వస్తువులు ఎత్తుకుపోరు... అసలు ఇంట్లో దొంగతనాలే చెయ్యరు. ఇప్పుడు అమరావతిలో ఈ దొంగతనాలు హాట్ టాఫిక్ గా మారాయి. అసలు ఈ దొంగలు ఏం ఎత్తుకుపోతున్నారో తెలియాలంటే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే.! అమరావతి రాష్ట్ర విభజన తరువాత ఒక్కసారిగా ఆంద్రప్రజలకు చేరువైన పేరు... అప్పటి టీడీపీ ప్రభుత్వం ఇక్కడ రాజధాన్ని ప్రకటించినప్పటీ నుంచి ఈ పేరు నిత్యం ఏదో ఒక రూపంలో జనాల్లో నానుతూ ఉంది. అయితే రాజధానిగా ప్రకటించినప్పటి నుంచి అమరావతి నిఘా నీడలోనే ఉంది. అయినప్పటకి పోలీసుల కళ్లు కప్పి జరగాల్సిన దొంగతాలు జరిగిపోతూనే ఉన్నాయి. తాజా అమరావతిలో జరుగుతున్న దొంగతనాలు ఇటు ప్రజల్లోనే కాకుడా అటు పోలిటికల్ పార్టీలో కూడా చర్చకు దారితీస్తోన్నాయి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అమరావతి అభివృద్ది చేసే క్రమంలో కొన్ని రోడ్లలను వేశారు. అయితే ఇక్కడ వరకు బాగానే ఉన్న ఇప్పుడు ఆ రోడ్లు రాత్రికి రాత్రి మాయమవ్వడం ఇప్పుడు హాట్ టాఫిక్‌గా మారింది ఇక్కడ. అమరావతిలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రోడ్ల ను దొంగతనం చేస్తోన్నారు. ఏంటీ రోడ్లలను దొంగతనం చేయడం ఏంటీ అని ఆశ్చర్యపోతున్నారా.. అదే ఇక్కడ అసలు పొలిటికల్ రచ్చ ఉంది.
అమరావతిలో గత కొద్ది రోజులుగా అప్పటి టీడీపీ ప్రభుత్వం వేసిన రోడ్లు రాత్రికి రాత్రి తవ్వేసి కంకరా, ఇసుక మరియు మట్టి ఎత్తుకుపోతున్నారు కొందరు దుండగలు... అయితే ఈ పనులు అధికారపార్టీ నేతలే చేస్తోన్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష నేతలు... తొలి నుంచి అమరావతి రాజధానిగా చేయడం ఇష్టం లేని వైసీపీ నేతలే ఇలా రోడ్లు ద్వంసం చేస్తోన్నారని ఆరోపిస్తోన్నారు. మొన్నటికి మొన్న ఉద్దండురాయుడు పాలెంలో రొడ్డును కొందరు గుర్తులు తెలియని వ్యక్తులు తవ్వుతుంటే స్థానికులు ఆపే ప్రయత్నం చేసే లోపే పారిపోయారు. దీంతో పాటు సోషల్ మీడియాలో అర్ధరాత్రి జేసీబీలతో రొడ్డులను తవ్వు తున్న వీడియోలు వైరల్ కావడంతో ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే రోడ్లలను ఎవరు తవ్వుతున్నారో ఆ వ్యక్తులను గుర్తించామని త్వరలో అదుపులోకి తీసుకుంటామని పోలీసులు చెబుతుంటే అటు ప్రతిపక్షం మాత్రం అధికారపార్టీ నేతల అండ దండ లేకుండా అంత దైర్యంగా రోడ్లు ఎవరు తవ్వుతారాని ప్రశ్నిస్తున్నారు. అయితే గతంలో రాజధాని నిర్మాణం కోసం తీసుకొచ్చిన కొన్ని మిషన్లు దొంగలు పట్టుకుపోవడం అనే అంశం కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది. మొత్తానికి రాజధానిలో జరుగుతున్న ఈ వింత దొంగతలు ఇప్పుడు పోలిటికల్ గా హాట్ టాఫిక్ గా మారాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amaravati, Andhra Pradesh