తెల్లని గడ్డం.. సాదాసీదా బట్టలు.. మామూలు మోటర్ సైకిల్.. ఈయనను గుర్తుపట్టారా ?

రఘువీరారెడ్డి

Andhra Pradesh: పోలింగ్ సెంటర్‌కు వచ్చిన ఓటు వేసిన రఘువీరారెడ్డి.. సాదాసీదాగానే వ్యవహరించారు. ఓటు వేసి మళ్లీ ఎప్పటిలాగే వెళ్లిపోయారు.

 • Share this:
  ఆయనో మాజీమంత్రి, అనేక సంవత్సరాలు మంత్రిగా పని చేసిన వ్యక్తి. అలాంటి నేతలు ఎలా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పదవులు లేకపోయినా.. ఆ హంగు ఆర్భాటం అలాగే ఉంటుంది. సాధారణంగా చాలామంది నాయకులు ఇలాగే ఉంటారు. కానీ ఈ విషయంలో ఆయన మాత్రం పూర్తి భిన్నం. అసలు ఆయన మంత్రి అనే విషయం.. ఆయన దగ్గరకు వెళ్లి చూసినా ఎవరూ గుర్తుపట్టలేరు. ఒకప్పుడు ఆయనను ఎన్నోసార్లు చూసిన వాళ్లు సైతం.. ఇప్పుడు ఆయనను చూసి ఈయన ఆయనేనా అనుకోకుండా ఉండలేరు. ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా ? ఆయనే కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీమంత్రి రఘువీరారెడ్డి.

  అనంతపురం జిల్లా నుంచి అనేక సార్లు ఎమ్మెల్యేగా, పలు పర్యాయాలు మంత్రిగా పని చేసిన రఘువీరారెడ్డి.. కొన్నేళ్లుగా మీడియాలో పెద్దగా కనిపించడం లేదు. కనిపించినా.. ఆయనను ఎవరూ గుర్తుపట్టడం లేదు. తాజాగా ఏపీలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తన స్వగ్రామమైన గంగులవాయిపాళ్యంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు రఘువీరారెడ్డి. ఓ మోటర్ సైకిల్‌గా సాధారణ రైతుగా మాసిపోయిన తెల్లని గడ్డంతో పోలింగ్ సెంటర్‌కు వచ్చారు ఆయన. ఆయనను చూసిన వాళ్లు చాలామంది.. మొదట్లో ఆయనను గుర్తుపట్టలేదు. అయితే కొందరు సిబ్బంది ఆయనను గుర్తించి ఇతరులకు ఆ రఘువీరారెడ్డి అని.. మాజీమంత్రి అని తెలిపారు.

  అయితే పోలింగ్ సెంటర్‌కు వచ్చిన ఓటు వేసిన రఘువీరారెడ్డి.. సాదాసీదాగానే వ్యవహరించారు. ఓటు వేసి మళ్లీ ఎప్పటిలాగే వెళ్లిపోయారు. రఘువీరారెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటున్న తరువాత ఆయన లైఫ్ స్టయిల్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు మెరిసిపోయే తెల్లని బట్టల్లో కనిపించిన రఘువీరా.. ఇప్పుడు తెల్లని గడ్డంతో కనిపిస్తున్నారు. తనను ఎవరూ గుర్తుపట్టలేని విధంగా మారిపోయారు. తాజాగా ఆయన పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓటు వేసి వెళ్లిపోయిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
  Published by:Kishore Akkaladevi
  First published: