Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH EMPLOYEES GAVE NOTICE TO GOVERNMENT THEY WANT TO GO STRIKE FORME FEBUARY 7TH NGS

AP Employees Strike: ఫిబ్రవరి 7 నుంచి నిరవధిక సమ్మె.. నిలిచిపోనున్న సేవలు ఇవే..

ఫైల్ ఫోటో

ఫైల్ ఫోటో

AP Employees Strike: ఆంధ్రప్రదేశ్ లో సమ్మె సైరన్ మోగింది. ఫిబ్రవరి ఆరో తేదీ అర్థ రాత్రి నుంచి.. నిరవధిక సమ్మెకు వెళ్తున్నట్టు నోటీసులు ఇచ్చారు. దీనిక సబంధించి మూడు పేజీల నోటీసు అందజేశారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నిర్ణయాలతో పలు సేవలు నిలిచిపోనున్నాయి.

ఇంకా చదవండి ...
  Andhra Pradesh Employees Strike:   ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం ఉద్యోగ సంఘాలు (Employees Union) తగ్గేదే లేదని తేల్చేశాయి.  ముందునుంచి చెబుతున్నట్టే సమ్మె నోటీసులను ప్రభుత్వానికి అంద జేశారు.. తాము ఎందుకు సమ్మె చేయాల్సి వస్తోంది. సమ్మె విరమించుకోవాలి అంటే తమ డిమాండ్లు ఏంటి వివరిస్తూ మూడు పేజీలతో కూడిన నోటీసులు ప్రభుత్వానికి అందజేశారు. మొత్తం 12 ఉద్యోగ సంఘాల నేతలు తమ సంతకాలు చేసి.. ఆ నోటీసు అందజేశారు. అయితే సీఎస్ సమీర్ శర్మ (CS Sameer Sharma) అందుబాటులో లేకపోవడంతో జీఏడీ కార్యదర్శి శశిభూషన్ కు తమ నోటీసులు  అందించారు.. ఫిబ్రవరి ఆరోతేదీ అర్థ రాత్రి నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తున్నామంటూ నోటీసులు ఇచ్చారు. దీంతో పాటు తమ ఉద్యమ కార్యచరణను కూడా ఈ నోటీసుల్లో పేర్కొన్నారు.

  మరోవైపు విచారణకు హాజరుకావాలని ఏపీ హైకోర్టు (AP High court) నోటీసులు ఇవ్వడంపైనా సుదీర్ఘంగా చర్చించిన నేతలు.. తాము హైకోర్టులో పిటిషన్ వేయలేదని.. వ్యక్తిగత పిటిషన్ కు తాము హాజరవ్వాల్సిన అవసరం లేదని నిర్ణయానికి వచ్చారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పీఆర్సీ (PRC) నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే నిరవధిక సమ్మె నుంచి వెనక్కు తగ్గేదే లే అని ఉద్యోగ సంఘాలు తేల్చి చెప్పేశాయి.

  ఇదీ చదవండి : : ఆ వివాదానికి నా స్నేహితులే కారణం.. క్యాసినో వ్యవహారంపై వల్లభనేని సంచలన వ్యాఖ్యలు

  అంతకుముందు ఉద్యోగ సంఘాలతో చర్చల కోసం ప్రభుత్వ కమిటీ చాలాసేపు ఎదురు చూసింది. ఉద్యోగుల ప్రతినిధులు వస్తే తమ వైపు నుంచి చర్చలు జరిపేందుకు సిద్ధంగ ఉన్నామని సంప్రదింపుల కమిటీ సభ్యులు సజ్జల రామకృష్ణ రెడ్డి, బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా వారిద్దరూ మాట్లాడుతూ.. పీఆర్సీ జీవోలను అభయన్స్‌లో పెట్టాలని ఉద్యోగ సంఘాలు కోరాయని.. కమిటీని అధికారికంగా ప్రకటించే వరకు వచ్చేది లేదన్నారని వారు వెల్లడించారు. అయితే తాము మంగళవారం మళ్లీ వారితో చర్చల కోసం వస్తామని మంత్రులు పేర్కొన్నారు. అయినా జీఏడీ సెక్రటరీ ఫోన్ చేసి చెప్పిన తర్వాత అధికారిక కమిటీ కాదని ఎలా చెబుతారని బొత్స, సజ్జల ప్రశ్నించారు. ఉద్యోగస్తులు కూడా మా ప్రభుత్వంలో భాగమేనని వారన్నారు

  ఇదీ చదవండి : నెల్లూరు అడవుల్లో ‘పుష్ప’ సీన్‌ .. చివరికి ఏం జరిగింది అంటే..?.

  ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో ఏం చేసిందో ప్రజలకు వివరించటం తప్పేలా అవుతుందన్నారు. సమ్మె నోటీస్ ఇచ్చినా ఉద్యోగ సంఘాలతో చర్చిస్తామని బొత్స, సజ్జల తెలిపారు. ఈ కమిటీ ఉద్యోగులను బుజ్జగించడంతో పాటు నిజమైన సమస్యలుంటే పరిష్కారానికి కృషి చేస్తుందని వారు అన్నారు. ట్రెజరీ ఉద్యోగులు మెడ మీద కత్తి పెట్టడం వల్ల నోటీస్ పీరియడ్‌కు అర్థం ఉండదని వారు వ్యాఖ్యానించారు. అలా చేస్తే ఉద్యోగులను ప్రభుత్వం క్రమశిక్షణలో పెట్టే ప్రక్రియను ప్రారంభించాల్సి ఉంటుందని మంత్రులు హెచ్చరించారు.

  ఇదీ చదవండి : ఆ రెండు జిల్లాల్లో వ్యాప్తికి కారణం అదే.. ఇకపై కఠిన ఆంక్షలు అమలు

  ప్రభుత్వం ఉద్యోగుల సమ్మె ఎఫెక్ట్ సామాన్య జనంపైనా పడనుంది. ఇప్పటికే అన్నిరకాల ఉద్యోగస్తులు సమ్మెలో భాగం అవుతుండడంతో అన్ని కార్యాలయాల్లో సేవలు ఎక్కడికక్కడ నిలిచిపోనున్నాయి.  దీనికి తోడు  ఆర్టీసీలో ప్రధాన సంఘాలు కూడా సమ్మెకు సై అనడంతో ఫిబ్రవరి ఏడు నుంచి బస్సులు డిపోకే పరిమితం కానున్నాయి. ఇటు వైద్యశాఖ లో ఉద్యోగులు కూడా సమ్మెకు సై అంటున్నట్టు సమాచారం. అదే జరిగితే కరోనా సమయంలో తీవ్ర ఇబ్బందులు తప్పకపోవచ్చు.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Employees

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు