ANDHRA PRADESH EMPLOYEES DOUBT ABOUT FOR JANUARY MONTH SALARIES THEY DEMAND OLD SALARIES FOR THIS MONTH NGS
AP PRC Fight: అమ్మో ఒకటో తారీఖు.. జనవరి జీతాలు వస్తాయా..? రాకపోతే పరిస్థితి ఏంటి..?
ఉద్యోగులకు ఈ నెల జీతాలు లేనట్టేనా..?
AP PRC Fight: ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు, పెన్షనర్లలో టెన్షన్ ప్రారంభమైంది.. అమ్మో ఒకటో తారీఖు అనే భయ పడుతున్నారు. ఎందుకంటే తొలి వారంలోనే అందరూ కట్టాల్సిన బిల్లులను ప్లాన్ చేసుకుంటారు.. లోన్ ఈఎంఐల నుంచి పాల బిల్లు వరకు అన్నీ తొలి వారం లోనే క్లియర్ చేయాలి అనుకుంటారు.. కానీ ప్రస్తుతం ఈ నెల జీతాలు అకౌంట్ లో పడే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో ఉద్యోగ సంఘాల నాయకుల నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు.
AP PRC Fight: ఇక మాట్లాడుకోవడాల్లేవ్ అని.. ఇటు ఉద్యోగ సంఘాలు.. అటు ప్రభుత్వం అంటోంది.. మరి జీతాల మాటేంటి అని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. పాత పద్ధతిలోనే జనవరి నెల జీతాలు వేయండని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. కానీ కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు వేస్తామని ప్రభుత్వం అంటోంది. ఇటు ఉద్యోగ సంఘాలు పట్టు వీడడం లేదు.. ప్రభుత్వం మెట్టు దిగడం లేదు. ఈ నెల జీతాలు ప్రాసెస్ చేయాలని పదే పదే.. ట్రెజరీ ఉద్యోగులు, పే అండ్ అకౌంట్స్ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేస్తోంది ప్రభుత్వం.. ప్రాసెస్ చేయకపోతే కఠిన చర్యలు తప్పవు అంటోంది. ఓ వైపు ప్రభుత్వం హెచ్చరిస్తుంటే.. ట్రెజరీ ఉద్యోగులకు అండగా తామున్నామంటున్నారు పీఆర్సీ సాధన సమితి నేతలు. ఒకవేళ ఉద్యోగులపై చర్యలు తీసుకుంటే న్యాయపోరాటానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. మరోవైపు తాము కూడా ఉద్యమంలో భాగమని.. కొత్త పీఆర్సీతో జీతాలు అంటే.. తాము ఎలా ఒప్పుకుంటామంటున్నారు ట్రెజరీ ఉద్యోగులు.. ఇప్పటికే ట్రెజరీ ఉద్యోగుల అసోసియేషన్ ఉన్నతాధికారులకు లేఖ కూడా ఇచ్చింది. కొత్త పీఆర్సీతో జీతాలు ప్రాసెస్ చేయలేమని స్పష్టం చేసింది. దీంతో జీతాల ప్రాసెస్ ఎక్కడిదక్కడే ఆగిపోయింది. ఇప్పటికే 28 తేదీ వచ్చేసింది. ఇక శని, ఆదివారాలు సెలవు రోజులు.. అంటే జీతాల ప్రాసెస్ చేయడానికి మిగిలింది ఒక్క రోజు మాత్రమే.. దీంతో అసలు ఒకటో తేదీ జీతాలు లేకపోతే పరిస్థితి ఏంటని సామాన్య ఉద్యోగులు ఆందోళన చెంత ఒకటో తారీఖు దగ్గరకు వస్తుంది.. అయినా ఎవరూ దగ్గడం లేదు.. పట్టువీడటం లేదు. దీంతో ఫిబ్రవరి ఒకటో తారీఖున ఉద్యోగులు ఆందదోళన చెందుతున్నారు.
పెండింగ్ డీఏలతో కూడిన పాత జీతాన్నే ఇవ్వాలన్నది ఉద్యోగుల ప్రధాన డిమాండ్. ఇందుకు తగ్గట్టుగా జనవరి నెలకు పాత జీతాలను డీఏలతో కలిపి ఇవ్వాలని ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా డీడీవోలకు వినతిపత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇక జీతాలను ప్రాసెస్ చేసే విషయంలో తమపై అంత ఒత్తిడి తెస్తున్న ప్రభుత్వం.. నిజంగా ఉద్యోగులపై ప్రేమ ఉంటే 1800 కోట్ల రూపాయల సప్లిమెంటరీ బిల్లులు ఎందుకు ప్రాసెస్ చేయడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. అంతేగాకుండా 2 వేల 100 కోట్ల పీఎఫ్ ఇతర బిల్లులు ఎందుకు చెల్లించడం లేదని ఆవేనద వ్యక్తం చేస్తున్నారు. జనవరి నెల జీతాలు ఆపాలని ప్రభుత్వమే కుట్ర చేస్తోందని.. అదే జరిగితే మూల్యం చెల్లించుకోక తప్పదని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
నిన్నటి వరకు బుజ్జగింపుల దోరణిలోనే ఉన్న ప్రభుత్వ కమిటీ.. తాజా పరిస్థితుల్లో ఉద్యోగ సంఘాలపై సీరియస్ అయ్యింది. ఉద్యోగులు చర్చలకు వస్తామని రాకపోవడంతో.. మంత్రుల కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పర్సనల్గా ఫోన్ చేసినా.. రాకపోవడాన్ని తీవ్రంగా పరిగణించారు. తాజాగా.. ప్రభుత్వ సలహాదారు సజ్జల, మంత్రి బోత్స సత్యనారాయణలు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రుల కమిటీగా తాము ప్రతిరోజు వస్తున్నా..ఉద్యోగ సంఘాల నేతలు రావడం లేదన్నారు.
మంత్రుల కమిటీతో సమావేశానికి కొన్ని ఉద్యోగ సంఘాలు రావడంతో.. వారితో చర్చించడం జరిగిందన్నారు సజ్జల. ఉద్యోగులు, పెన్షనర్ల కుటుంబసభ్యుల గురించి ఆలోచించాలని సూచించారు మంత్రి బోత్స. ఇక స్టీరింగ్ కమిటీ పిలిస్తేనే వస్తామని, వారితో చర్చలు చేసేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉందన్నారు. వాళ్లు చర్చలకు రాకుండా ఇలాగే వ్యవహరిస్తే.. ప్రభుత్వం చట్ట ప్రకారం చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు. ఇలా ఎవరూ వెనక్కు తగ్గకపోవడంతో.. జీతాలు పడతాయో లేదో అనే ఆందోళన నెలకొంది.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.