హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP PRC: ఏపీ ఉద్యోగుల సమ్మె విరమణ.. సీపీఎస్ రద్దుపై ప్రభుత్వం క్లారిటీ

AP PRC: ఏపీ ఉద్యోగుల సమ్మె విరమణ.. సీపీఎస్ రద్దుపై ప్రభుత్వం క్లారిటీ

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

AP Employees Strike Called Off: ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు సమ్మెను విరమించుకున్నారు. ప్రభుత్వం తాజాగా ఇచ్చిన హామీలపై ఉద్యోగ సంఘాలు ఆనందం వ్యక్తం చేశాయి.. ప్రభుత్వం ఒకే చేసిన తాజా ప్రతిపాదనలు ఏంటంటే...?

AP Strike Called off:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఉద్యోగులు సమ్మె ప్రతిపాదనను విరమించుకున్నారు. స్వయంగా ఉద్యోగ సంఘాలే (AP Employees Union) ఈ ప్రకటన చేశాయి. తమ  మెజార్టీ డిమాండ్లకు ప్రభుత్వం ఒకే చెప్పడంతో.. ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతూ.. మంత్రుల సమక్షంలోనే నల్ల బ్యాడ్జీలు తొలిగించారు. ఏపీలో ఆర్థిక పరిస్థితి బాగులేకపోయినా.. ఉద్యోగులను సొంత కుటుంబ సభ్యులుగా భావించి సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) మేలు చేశారని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సమ్మె ప్రతిపాదన విరమించడానికి ప్రధాన కారణాలను ఉద్యోగ సంఘాలు వివరించాయి.. ముఖ్యంగా ఐఆర్ రికవరీ ప్రతిపాదనను ప్రభుత్వం ఉప సంహరించిందని.. అలాగే పీఆర్సీ (PRC) కాలపరిమితిని పదేళ్ల నుంచి ఐదేళ్లకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుందని.. అన్నిటికన్నా ముఖ్యంగా సీపీఎస్ రద్దుకు రోడ్ మ్యాప్  వేయడంతో ఉద్యోగ సంఘాలు సమ్మెను విరమించుకున్నాయి.

తాము కోరిన ప్రధాన డిమాండ్లలో ఒకటి రెండు మినహా అన్నింటికీ ప్రభుత్వం ఓకే చెప్పింది అన్నారు ఉద్యోగ సంఘాల నేతలు.. సచివాలయ ఉద్యోగులకు హెచ్ ఆర్ ఏ పెంచారని.. అలాగే పెన్షన్ బెనిఫిట్లను పెంచారని.. సీసీఏను యదావిధిగా కొనసాగించాలని నిర్ణయించారని.. అలాగే తాము ఎప్పటి నుంచో కోరుతున్నట్టు కమిటీ రిపోర్ట్ ను బయటపెడతామని చెప్పడం సంతోషం కలిగించింది అన్నారు.. తాము ప్రధానంగా చేస్తున్న డిమాండ్లలో ఎక్కువ వాటికి ఆమోదం తెలపడంతోనే సమ్మెను విరమించుకున్నట్టు ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి.

ఇదీ చదవండి : ఏపీలో కొనసాగుతున్న విద్యుత్ కోతలు.. త్వరలోనే కష్టాలు తీరుతాయన్న ఎంపీ

ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ సంఘాలకు ధన్యవాదాలు తెలిపారు. పీఆర్సీ ఆశించినంతగా లేకపోవడంతోనే ఉద్యోగులు అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేశారని ఆయన అన్నారు. ఉద్యోగుల ఆవేదన గురించి మంత్రుల కమిటీ చర్చించిందన్నారు. అన్ని అంశాలపై లోతుగా చర్చించి ఏకాభిప్రాయంకి వచ్చామన్నారు. చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా అంతా ఓ కుటుంబంలా ఉండాలన్నారు. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చెయ్యడంలో ఉద్యోగులది కీలక పాత్ర అని చెప్పారు. ఉద్యోగులు ఎప్పుడూ సంతృప్తిగా ఉండాలని సీఎం జగన్ అనుకుంటారని సజ్జల అన్నారు. కొన్ని డిమాండ్ల వల్ల చర్చలు ఆలస్యం అయ్యాయని ఆయన తెలిపారు. ప్రతి అంశంపైనా లోతుగా చర్చించామని అన్నారు.


ఇదీ చదవండి : సీఎం జగన్ తో బాలకృష్ణ భేటీ..! ఆ తరువాతే రాజీనామాపై నిర్ణయం..

ముఖ్యంగా పీఆర్సీ రిపోర్టు అడిగారని.. జీవో ఇవ్వగానే రిపోర్టు ఇవ్వడం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఫిట్ మెంట్ 23 శాతంలో ఎలాంటి మార్పు లేదన్నారు. 13 జిల్లాల హెడ్ క్వార్టర్స్ లో 16 శాతం HRA ఇవ్వడానికి అంగీకరించామన్నారు. HOD,సచివాలయంలో ఉద్యోగులకు జూన్ 2024 వరకూ 24 శాతం HRA ఇవ్వడానికి అంగీకారం తెలిపారు. పెన్షనర్ల 70 నుండి 74 వారికి 7 శాతం.. 74 నుండి 79 శాతం 12 శాతం. పీఆర్సీ ఐదేళ్ల పాత పద్దతి కొనసాగుతుంది అన్నారు. CCL పాత రేట్లు ప్రకారమే కొనసాగుతుందని హామీ ఇచ్చారు. అలాగే ఆర్టీసీ, యూనివర్సిటీలకు సెపరేట్ పీఆర్సీ జీవో విడుదల అవుతుంది సజ్జల హామీ ఇచ్చారు. ఈ నెల నుంచే గ్రాట్యుటీ అమలు చేస్తామన్నారు. మెడికల్ రియింబర్స్ మెంట్ విడుదల చేస్తామన్నారు. అలాగే ఉద్యోగులకు రావాల్సిన ఎరియర్స్ ను రిటైర్మెంట్ సమయంలో సర్దుబాటు చేస్తామన్నారు..

First published:

Tags: Andhra Pradesh, AP News, Employees

ఉత్తమ కథలు