ఏపీలో విద్యుత్తు సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. కరోనా నేపథ్యంలో స్పాట్ బిల్లింగ్ను నిలిపివేయనున్నాయి. గత మూడు నెలల సగటు విద్యుత్తు వినియోగాన్ని మార్చి నెల విద్యుత్తు బిల్లుగా పరిగణించాలని విద్యుత్తు శాఖ నిర్ణయించింది. ఈ మొత్తాన్ని వెబ్సైట్లో ఉంచనుంది. ఆన్లైన్ ద్వారా బిల్లు మొత్తాన్ని చెల్లించాలని వినియోగదారులకు సూచించింది. విద్యుత్తు వాస్తవ వినియోగం ప్రకారం బిల్లు మొత్తంలో హెచ్చుతగ్గులు ఉంటే ఆ తర్వాతి నెలలో సర్దుబాటు చేయాలని నిర్ణయించింది. వాస్తవానికి.. మీటర్ రీడింగ్ ఆధారంగా విద్యుత్తు వినియోగ ఛార్జీలను సిబ్బంది ప్రతి నెలా ఇంటింటికి వచ్చి అందిస్తున్నారు. అయితే, కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా స్పాట్ బిల్లింగ్ నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Published by:Shravan Kumar Bommakanti
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.