హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఏపీ లోక్ సభ ఓట్లను ఎక్కడ లెక్కిస్తారంటే... ఇవిగో ఈసీ వివరాలు...

ఏపీ లోక్ సభ ఓట్లను ఎక్కడ లెక్కిస్తారంటే... ఇవిగో ఈసీ వివరాలు...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

AP Lok Sabha Election 2019 : అన్ని అంశాల్నీ లెక్కలోకి తీసుకున్న ఎన్నికల సంఘం... కొన్ని ప్రధాన కేంద్రాల్ని ఓట్ల లెక్కింపు కోసం ఎంపిక చేసింది.

    ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు అయిపోయాయి. ఈవీఎంలు స్ట్రాంగ్ రూంలలో హాయిగా ఉన్నాయి. ఓ 40 రోజుల తర్వాత వాటి దుమ్ము దులిపి... వాటిలో ప్రజలు భద్రంగా దాచిన తీర్పును బయటపెట్టే బాధ్యత కేంద్ర, రాష్ట్రాల్లోని ఎన్నికల సంఘాలవే. మరి ఆంధ్రప్రదేశ్ ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు ఎక్కడ చేపట్టాలి. ఎక్కడ కౌంటింగ్ చేస్తే... అందరూ సంతోషిస్తారు... ఎక్కడ అనుకూల పరిస్థితులు ఉన్నాయి... ఎక్కడ గొడవలు జరగకుండా ఉంటాయి... ఎక్కడ సదుపాయాలన్నీ ఉన్నాయి... ఇలా రెండ్రోజులపాటూ చాలా అంశాలు ఆలోచించి... కొన్ని ప్రదేశాల్లో లెక్కింపు ఏర్పాట్లు చేసుకోవాలని ఈసీ నిర్ణయించింది. రాష్ట్రంలోని మొత్తం 25 లోక్ సభ స్థానాలకు ఈ నెల 11న, 12 (రాత్రివేళ)న ఎన్నికలు జరగ్గా... వాటి ఫలితాలు... మే 23న (వీవీప్యాట్ స్లిప్పులు కౌంట్ చెయ్యకపోతే) వచ్చే అవకాశాలున్నాయి.


    పార్లమెంట్ స్థానాల లెక్కింపు కేంద్రాలు :

    అరకు పార్లమెంట్ స్థానానికి శ్రీకాకుళం శ్రీ శివాని ఇంజనీరింగ్ కాలేజీతోపాటూ... విజయనగరంలోని ఎంవీజీఆర్ ఇంజనీరింగ్ కాలేజీ, విశాఖపట్నం ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ, తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని ఆదికవి నన్నయ్య యూనివర్శిటీలో లెక్కిస్తారు.


    శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం ఓట్లను శ్రీ శివానీ ఇంజనీరింగ్ కాలేజీలో కౌంట్ చేస్తారు.


    విజయనగరం పార్లమెంట్ స్థానం ఓట్లను శ్రీ శివానీ ఇంజనీరింగ్ కాలేజీ, విజయనగరంలోని జేఎన్‌టీయూకే ఇంజనీరింగ్ కాలేజీ, లెండీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో లెక్కిస్తారు.


    విశాఖపట్నం పార్లమెంట్ స్థానం ఓట్లను ఏయూ, విజయనగరంలోని ఎంవీజీఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో గణిస్తారు.


    అనకాపల్లి పార్లమెంట్ స్థానం ఓట్లను ఆంధ్రా యూనివర్శిటీలో కౌంట్ చేస్తారు.


    కాకినాడ పార్లమెంట్ స్థానం ఓట్లను జేఎన్‌టీయూలో లెక్కిస్తారు.


    అమలాపురం పార్లమెంట్ స్థానం ఓట్లను కాకినాడ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ, జేఎన్‌టీయూ, రంగరాయ మెడికల్ కాలేజీ, జేఎన్‌టీయూ ఇండోర్ స్టేడియంలో లెక్కిస్తారు.


    రాజమండ్రి లోక్‌సభ స్థానం ఓట్లను కాకినాడలోని ఐడీయల్ ఇంజనీరింగ్ కాలేజీ, జేఎన్‌టీయూ, సీఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కాలేజీల్లో లెక్కిస్తారు.


    నరసాపురం పార్లమెంట్ స్థానం ఓట్లను స్థానికంగా ఉన్న విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ డెంటల్ స్కూల్, పాలిటెక్నిక్ కాలేజీలో కౌంట్ చేస్తారు.


    ఏలూరు పార్లమెంట్ స్థానం ఓట్లను రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీ, మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్శిటీలో లెక్కిస్తారు.


    మచిలీపట్నం పార్లమెంట్ స్థానం ఓట్లను కృష్ణా యూనివర్శిటీలో లెక్కిస్తారు.


    విజయవాడ పార్లమెంట్ స్థానం ఓట్లను ధనేకుల ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో లెక్కిస్తారు.


    గుంటూరు పార్లమెంట్ స్థానం ఓట్ల లెక్కింపును ఆచార్య నాగార్జున యూనివర్శిటీ లెక్కించబోతున్నారు.


    నరసరావుపేట పార్లమెంట్ స్థానం ఓట్లను నల్లపాడు లయోలా పబ్లిక్ స్కూల్‌లో నిర్వహించాలని అధికారులు డిసైడయ్యారు.


    బాపట్ల, పర్చూరు, అద్దంకి, చీరాల, ఎస్‌ఎన్ పాడు నియోజకవర్గాల ఓట్లను వల్లూరు మండలంలోని పేస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ భవనంలో, వేమూరు, రేపల్లె, బాపట్ల నియోజకవర్గాల ఓట్లను నాగార్జున యూనివర్శిటీలో లెక్కిస్తారు.


    ఒంగోలు పార్లమెంట్ స్థానం ఓట్లను రైజ్ కృష్ణసాయి గాంధీ గ్రూప్ విద్యాసంస్థల ప్రాంగణంలో కౌంట్ చేస్తారు.


    నంద్యాల పార్లమెంట్ స్థానం ఓట్లను రాయలసీమ యూనివర్శిటీలో గణిస్తారు.


    కర్నూలు పార్లమెంట్ స్థానం ఓట్లను పుల్లయ్య ఇంజనీరింగ్, రవీంద్ర ఇంజనీరింగ్ కళాశాలల్లో లెక్కించాలని డిసైడయ్యారు.


    నెల్లూరు పార్లమెంట్ స్థానం ఓట్లను రైజ్ కృష్ణసాయి పాలిటెక్నిక్, డీకే ప్రభుత్వ కాలేజీలో లెక్కిస్తారు.


    కడప పార్లమెంట్ స్థానం ఓట్లను కేఎల్‌ఎం ఇంజనీరింగ్ కాలేజీలో కౌంట్ చేస్తారు.


    రాజంపేట పార్లమెంట్ స్థానం ఓట్లను కడపలోని కేఎల్‌ఎం ఇంజనీరింగ్, పూతలపట్టులోని శ్రీ వేంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీల్లో లెక్క తేల్చేస్తారు.


    హిందూపురం పార్లమెంట్ స్థానం ఓట్లను శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీ ప్రాంగణంలో లెక్కిస్తారు.


    తిరుపతి పార్లమెంట్ స్థానం ఓట్లను నెల్లూరులోని ప్రియదర్శిని ఇంజనీరింగ్, పూతలపట్టులోని శ్రీ వేంకటేశ్వర ఇంజనీరింగ్, ఆర్‌కేఎం లా కాలేజీల్లో లెక్కిస్తారు.


    చిత్తూరు పార్లమెంట్ స్థానం ఓట్లను శ్రీ శ్రీనివాస ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ భవనంలో తేల్చుతారు.


     


    ఇవి కూడా చదవండి :


    నేడు సీఈసీ ముందుకు టీడీపీ టెక్నికల్ టీం... EVMల ట్యాంపరింగ్ నిరూపిస్తారా...


    జేడీఎస్‌కు మద్దతుగా నేటి నుంచి కర్ణాటకలో చంద్రబాబు ప్రచారం..

    First published:

    Tags: Andhra Pradesh, Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, EVM, Evm tampering, Vvpat

    ఉత్తమ కథలు