హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Pastor Praveen Chakravarthy: పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి విచారణ.. కీలక ప్రకటన చేసిన డీజీపీ కార్యాలయం

Pastor Praveen Chakravarthy: పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి విచారణ.. కీలక ప్రకటన చేసిన డీజీపీ కార్యాలయం

ప్రవీణ్ చక్రవర్తి(ఫైల్ ఫొటో)

ప్రవీణ్ చక్రవర్తి(ఫైల్ ఫొటో)

ఆంధ్రప్రదేశ్‌లో హిందూ ఆలయాలు, దేవతామూర్తుల విగ్రహాలపై దాడులు పెను దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి పలు కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు

  ఆంధ్రప్రదేశ్‌లో హిందూ ఆలయాలు, దేవతామూర్తుల విగ్రహాలపై దాడులు పెను దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి పలు కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ వీడియోలో హిందూ దేవతా విగ్రహాలను ధ్వంసం చేసినట్టు పేర్కొన్న.. పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తిని ఆంధ్రప్రదేశ్ సీఐడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం కస్టడీలో ఉన్న ప్రవీణ్ చక్రవర్తిని విచారిస్తున్నట్టు సీఐడీ వెల్లడించింది. అయితే ఈ సందర్బంగా ఏపీ డీజీపీ కార్యాలయం కీలక ప్రకటన చేసింది. ప్రవీణ్ పాస్టర్ విచారణకు సంబంధించి అవసరాన్ని బట్టి తగిన సమయంలో వివరాలు వెల్లడిస్తామని ఏపీ డీజీపీ కార్యాలయం ప్రకటించింది. సీఐడీ ప్రకటన ఇస్తే తప్ప టీవీలు, పత్రికలు ఎటువంటి కథనాలు ప్రచురించవద్దని సూచించింది. జనవరి 12న పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు తెలిపింది.

  ప్రవీణ్ చక్రవర్తి కస్టడీ కోసం జనవరి 18న కోర్టుకు విన్నవించగా.. జనవరి 20 నుంచి మూడు రోజుల పాటు ప్రవీణ్ కస్టడీకి కోర్టు అనుమతి లభించిందని తెలిపింది. సీఐడీ విజ్ఞప్తిని కాదని ఎవరైనా కథనాలు ప్రచురించినా, ప్రసారం చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక, తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన ప్రవీణ్ చక్రవర్తి క్రైస్తవ మత బోధకుడిగా పనిచేస్తున్నారు. బెంగళూరు గా-సిప్స్ అనే య్యూట్యూబ్ ఛానల్లో ఇతర మతాలను కించపరిచేలా వీడియోలు పోస్ట్ చేయడమే కాకుండా., తానే విగ్రహాలను ధ్వంసం చేశానని, కొన్నిచోట్ల కాలితో తన్నానంటూ వీడియోలో పేర్కొన్నాడు. ఏడాది క్రితం పోస్టైన వీడియో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లాకు చెందిన సింగం వెంకట శ్రీలక్ష్మినారాయణ అనే వ్యక్తి జనవరి 12న ప్రవీణ్‌పై మంగళగిరిలోని సీఐడీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

  దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడం, ఇతర మతాలపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేయడం వంటి అభియోగాలతో ప్రవీణ్ చక్రవర్తిని అరెస్ట్ చేసినట్లు సీఐడీ అడిషనల్ డీజీ సునీల్ కుమార్ తెలిపారు. తొలుత ప్రవీణ్ చక్రవర్తి ఇంట్లో తనిఖీలు నిర్వహించిన అధికారులు.., ఆ తర్వాత అతడు నిర్వహించే చర్చి, స్కూలు, ఆఫీసుల్లో సోదాలు నిర్వహించారు. సోదాల్లో భాగంగా కంప్యూటర్ హార్డ్ డిస్కులు, ల్యాప్ టాప్ లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Andhra Pradesh, AP Temple Vandalism, Hindu Temples

  ఉత్తమ కథలు