Breaking News: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణికి అస్వస్ధత.. అసలు ఏం జరిగింది..?

ఏపీ డిప్యూటీ సీఎం పుష్పవాణికి అస్వస్థత

AP Deputy CM: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి అస్వస్తతకు గురయ్యారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స చేశారు.. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది.. అసలు ఏం జరిగింది..?

 • Share this:
  Pushpa SriVani: నిత్యం యాక్టివ్ గా కనిపించే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి  (Deputy CM Pamula Pushpa Srivani)స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. విజయవాడ (Vijayawada) నుంచి విశాఖపట్నం (Visakhapatnam) వస్తుండగా పుష్ప శ్రీవాణి అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా చికిత్స కోసం మంత్రిని మార్గ మధ్యలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో స్కానింగ్, వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమె కాస్త కోలుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఎప్పుడూ యాక్టివ్ గా కనిపించే ఆమె అస్వస్థతకు గురవ్వడంతో ఆమె అభిమానులు షాక్ కు గురయ్యారు. ఓ వైపు నియోజకవర్గంలో పనులతో బిజీగా ఉన్నా.. ఆమె అభిమానులు కార్యకర్తలకు నిత్యం టచ్ లోనే ఉంటారు. అలాగే సోషల్ మీడియా (Social Media)లోనూ అంతే యాక్టివ్ గా ఉంటారు. దీంతో ఆమెకు భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమెకు అస్వస్థతకు గురయ్యారనే విషయం తెలిసిన వెంటనే సోషల్ మీడియాలో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. అయితే ఆమె ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని.. స్వల్ప అస్వస్థత మాత్రేమే అని ఆమె కుటుంభ సభ్యులు చెబుతున్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇస్తున్నారు..

  వైసీపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్న పుష్పశ్రీవాణి.. ఆంధ్రా యూనివర్శిటీ నుంచి బీఎడ్ పూర్తి చేశారు. టీచర్ గానూ సేవలు అందించారు. విజ‌య‌న‌గ‌రం జిల్లా కురుపాం అసెంబ్లీ స్థానం నుంచి వ‌రుస‌గా రెండో సారి గెలిచారు. ఉపాధ్యాయ వృత్తిని వీడి భ‌ర్త పరీక్షిత్ రాజు ప్రోత్సాహంతో రాజ‌కీయ ఆరంగేట్రం చేసిన పుష్పశ్రీవాణి, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు చెందింది. ఎస్టీ మ‌హిళా కోటాలో ఆమె మంత్రి పదవి దక్కించుకున్నారు.

  ఇదీ చదవండి: గుడ్ న్యూస్.. తగ్గుతున్న వంట నూనెల ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ధర ఎంతంటే..?

  2014 ఎన్నిక‌ల్లో 27 ఏళ్ల వ‌య‌సులో శ్రీవాణి ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. వైసీపీ త‌రుపున బ‌రిలో దిగి 19,083 ఓట్ల తేడాతో గెలిచారు. 2019 ఎన్నిక‌ల్లోనూ వ‌రుస‌గా రెండోసారి విజ‌య‌కేతనం ఎగుర‌వేశారు. ఈసారి 26,602 ఓట్ల ఆధిక్య‌త‌ను సాధించారు. జగన్ ఈమెకు గిరిజన సంక్షేమ శాఖను కేటాయించారు. వైసీపీ ఆవిర్భవించినప్పటి నుంచి ఆమె కుటుంబం ఆ పార్టీలో సాగుతోంది.

  ఇదీ చదవండి: లాభాలు కురిపిస్తున్నలిప్‌స్టిక్ తయారీ గింజలు.. మరెన్నో ప్రయోజనాలు

  మరోవైపు ప్రస్తుతం ఆమె మంత్రి పదవిపై తీవ్రంగ చర్చ జరుగుతోంది. ఈ సారి భారీగా కేబినెట్ ప్రక్షాళన చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయా మంత్రుల పనితీరుపై సీఎం జగన్.. ప్రత్యేక సర్వే చేయించినట్టు తెలుస్తోంది. రాబోయే ఎన్నికలను ఫోకస్ చేస్తూ ఈ సారి మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. దాదాపు 90 శాతానికి పైగా మంత్రులపై వేటు పడుతుందని.. కొత్తవారికి అవకాశం ఇస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే పుష్పశ్రీవాణి విషయంలో మాత్రం జగన్ సానుకూలంగానే ఉంటారని ఆమె అభిమానులు భావిస్తున్నారు..
  Published by:Nagesh Paina
  First published: