ANDHRA PRADESH CUSTOMS OFFICERS RAIDING IN YSRCP LEADERS HOUSE IN KRISHNA DISTRICT OF ANDHRA PRADESH PRN GNT
Andhra pradesh: వైసీపీ నేత ఇంట్లో కస్టమ్స్ అధికారుల తనిఖీలు.. సర్పంచ్ అభ్యర్థుల్లో టెన్షన్..
ప్రతీకాత్మక చిత్రం
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పంచాయతీ ఎన్నికల (Panchayat Elections) వేళ అధికార వైఎస్ఆర్సీపీ నేత ఇంట్లో కస్టమ్స్ అధికారుల తనిఖీలు కలకలం రేపుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల వేళ అధికార వైఎస్ఆర్సీపీ నేత ఇంట్లో కస్టమ్స్ అధికారుల తనిఖీలు కలకలం రేపుతున్నాయి. కృష్ణాజిల్లాలో బడా వ్యాపారవేత్త ఆయన ఇంట్లో సోదాలు జరుగుతుండటంతో వైసీపీ తరపున పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. వివరాల్లోకి వెళ్తే.., కృష్ణాజిల్లా వీరులపాడు మండలం, జుజ్జూరు గ్రామానికి చెందిన పూల రాంబాబు ఇంట్లో తెల్లవారుజాము నుంచి తెలంగాణ కస్టమ్స్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులుండటంతో పాటు ట్సాక్స్ ఎగవేత ఆరోపణలపై దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పూల రాంబాబుకు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాలో పలు పరిశ్రమలున్నట్లు తెలుస్తోంది. ఆ పరిశ్రమలకు సంబంధిచిన పన్నులు, ఆదాయానికి సంబంధించిన అవకతవకలను గుర్తించినట్లు సమాచారం. తెల్లవారుజాము నుంచి సోదాలు చేస్తున్న అధికారులు ఎవర్నీ లోనికి అనుమతించడం లేదు.
వారం రోజులుగా రెక్కీ
పూల రాంబాబుపై ఎప్పటి నుంచో నిఘా ఉంచిన కస్టమ్స్ అధికారులు.., వారం రోజులుగా జుజ్జూరు గ్రామంలో రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. పక్కా సమాచారంతో అదును చూసుకోని తెల్లవారుజామున దాడులు ప్రారంభించారు. రాంబాబుకు వివిధ రూపాల్లో నెలకు రూ.7కోట్ల వరకు వడ్డీ వస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే కొన్ని కంపెనీల్లో షేర్లతో పాటు సొంతగా మరికొన్ని పరిశ్రమలకు శంకుస్థాపన చేసినట్లు సమాచారం.
స్థానిక నేతల్లో టెన్షన్..
వీరులపాడు మండలంలో పూల రాంబాబు అధికార వైసీపీకి కీలకనేతగా ఉన్నారు. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నందున మండల వ్యాప్తంగా పార్టీ అభ్యర్థుల ఏకగ్రీవాలు, ఎలక్షన్ ఫండ్స్ విషయంలో ఈయనే కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. పూల రాంబాబు ఇంట్లో కోట్ల రూపాయల నగదు ఉన్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. దీంతో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు టెన్షన్ పడుతున్నట్లు సమాచారం.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.