హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

CS on PRC: కొత్త పీఆర్సీ వల్ల జీతాలు తగ్గవు.. కరోనా టైంలోనూ ఐఆర్ ఇచ్చాం

CS on PRC: కొత్త పీఆర్సీ వల్ల జీతాలు తగ్గవు.. కరోనా టైంలోనూ ఐఆర్ ఇచ్చాం

కొత్త పీఆర్సీ వల్ల జీతాలు తగ్గవు

కొత్త పీఆర్సీ వల్ల జీతాలు తగ్గవు

AP CS Sameer Sharma on RRC: ఆంధ్రప్రదేశ్ లో పీఆర్సీ వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జీవోలపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. మళ్లీ నిరసనలకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో కొత్త జీవోలపై సీఎస్ సమీర్ శర్మ క్లారిటీ ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే..?

ఇంకా చదవండి ...

Andhra Pradesh CS Sameer Sharam on PRC:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పీఆర్సీ పంచాయితీ మళ్లీ ముదురుతోంది.  తాజాగా ఏపీ ప్రభుత్వం (AP Government) విడుదల చేసిన పీఆర్సీ, డీఏ జీవోలపై ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నారు. మీ పీఆర్సీ (PRC) మాకొద్దు అంటూ ఆందోళనలకు దిగాయి. ఈ విషయంపై ఇక సీఎం జగన్ (CM Jagan) తో తాడో పేల్చుకుంటామని.. ఆయన అపాయింట్ మెంట్ ఇవ్వకుంటే భారీ ఉద్యమానికి సిద్ధమని హెచ్చరించారు. జీవోల రద్దు కోసం ఎందాకైనా వెళ్తామన్నారు. అవసరమైతే సమ్మె చేస్తామంటూ హెచ్చరించారు. ఇప్పటికే అన్ని రకాల ఉద్యోగులు వివిధ రూపాల్లో తమ నిరసనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో తాజా వివాదంపై  క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు రాష్ట్ర  సీఎస్ సమీర్ శర్మ (CS Sameer Sharma).. కొత్తగా ఇచ్చిన పీఆర్సీతో ప్రభుత్వం ఉద్యోగుల జీతాలు తగ్గడం లేదన్నారు. పీఆర్సీ ఆలస్యమవుతుంది కాబట్టే ఐఆర్ ప్రకటించామన్నారు. అది కూడా కరోనా కష్టకాలంలో పీఆర్సీ ఇచ్చామనే విషయాన్ని ఉద్యోగులు గుర్తించాలన్నారు.

తాజా పీఆర్సీ వల్ల గ్రాస్ శాలరీ ఏ మాత్రం తగ్గదన్నారు. అలాగే జీతాల్లో కోతలు ఉండవని క్లారిటీ ఇచ్చారు.  రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని ఖర్చులను బ్యాలెన్స్ చేసే అవసరం ఉంటుంది అంన్నారు. కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం పూర్తిగా పడిపోయిందని.. ఇలాంటి సమయంలో కొత్త పీఆర్సీ వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి 17 వేల కోట్ల భారీ పడింది అన్నారు. ఐఆర్ అంటే దాన్ని జీతంలో భాగంగా చూడడం కరెక్టు కాదని సూచించారు..

ఇదీ చదవండి : అక్రమ సంబంధమా..? రియల్ ఎస్టేట్ గొడవలా..? కాల్పులకు కారణం అదేనా..?

27 శాతం  ఐఆర్ గతంలో ఎప్పుడూ ఇవ్వలేదని గుర్తు చేశారు.  హెచ్ఆర్ ఏ తగ్గిందా.. పెరిగిందా అన్నది వేరే విషయమన్నారు. అలాగే ఉద్యోగులకు లాభం చేకూర్చాలనే ఉద్దేశంతోనే రిటైర్మెంట్ వయసను 62  ఏళ్లకు పెంచామని ఆయన అన్నారు.  ఐఏఎస్ లకు ఎక్కువ జీతాలు వస్తున్నాయనడం అవాస్తవం అన్నారు.. కేంద్రం ప్రభత్వం అమలు చేస్తున్న విధానాన్నే తాము ఫాలో అవుతున్నామని మరోసారి స్పష్టం చేశారు.

ఇదీ చదవండి : షార్ లో మరోసారి కరోనా కలకలం.. 200 మందికి నిర్ధారణ

పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు చేస్తున్న ఆరోపణలు అన్నింటికీ సీఎస్ సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నట్టు ఏ ఒక్క ఉద్యోగి గ్రాస్ శాలరీ ప్రభుత్వం తగ్గించ లేదని ఆయన అన్నారు. పదేళ్ల నుండి తనకు పీఆర్సీ గురించి అవగాహన ఉందన్నారు. అప్పటి పరిస్థితి వేరు…ఇప్పటి పరిస్థితి వేరని చెప్పారు. కరోనా, ఒమిక్రాన్ కారణంగా రాష్ట్ర ఆదాయం భారీగా పడిపోయిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగుల సమస్యలు, ప్రజలకిచ్చే సంక్షేమ పథకాలను సమన్వయం చేసుకోవాలసి ఉందన్నారు. ముఖ్యమంత్రి కూడా అన్ని అంశాలపై చర్చించారని చెప్పారని. పీఆర్సీ ఆలస్యం అవుతుందని 17 వేల కోట్ల రూపాలయల మధ్యంతర భృతి ఇచ్చామన్నారు. ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు కూడా ఇదే తరహాలోనే హెచ్ఆర్ఏ ఇస్తున్నాయని సీఎస్ వెల్లడించారు.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

ఉత్తమ కథలు