Andhra Pradesh: ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ పదవీ కాలం పొడిగింపు..? ఎప్పటి వరకు అంటే..

ఏపీ సీఎస్ పదవీ కాలం పొడిగింపు

ఏపీ సీఎం జగన్ కు ఒకరిపై నమ్మకం కలిగితే వారిని తన టీంలో కొనసాగించాలని భావిస్తుంటారు. వారికి ఉన్నత పదవులు ఇచ్చి తనతో పాటే ఉంచుకుంటారు. ఇందులో భాగంగా మరోసారి సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ పదవీ కాలాన్ని మూడు నెలల పాటు పొడిగించేలా చేశారు.

  • Share this:
    ఏపీ ప్రభుత్వం వినతి మేరకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ పదవీకాలాన్ని మరో మూడు నెలలపాటు పొడిగించింది. 2021 సెప్టెంబరు 30 వరకు ఆయన సర్వీసును కేంద్ర ప్రభుత్వం పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 30వ తేదీతో ఆదిత్యనాథ్‌ దాస్‌ పదవీ కాలం ముగియాల్సి ఉంది. అయితే ఆయన సర్వీసును పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విజ్ఞప్తి మేరకు సీఎస్‌ పదవీకాలాన్ని మరో మూడు నెలలు పొడిగిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ 1987 బ్యాచ్‌ ఐఏఎస్ అధికారి. ఆయన పలు శాఖల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు.

    గత సీఎస్ నీలం సాహ్ని పదవి కాలం కూడా అలాగే పొడిగించారు. గతేడాది జూన్ 30న ఆమె రిటైర్ కావాల్సి ఉండగా.. జగన్ విజ్ఞప్తి మేరకు కేంద్రం ఆమె పదవీకాలాన్ని డిసెంబర్ 31 వరకు పొడిగించింది. తరువాత ఇక పొడిగించే అవకాశం లేకపోవడంతో ఆమెకు కీలకమైన ఎస్ఈసీ బాధ్యతలు అప్పగించారు తారువాత ఆమె స్థానంలో చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్‌ దాస్‌ బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆయన జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.

    సీఎస్ ఆదిత్యనాథ్‌ దాస్‌ సొంత రాష్ట్రం బీహార్‌. తల్లిదండ్రులు డాక్టర్‌ గౌరీ కాంత్‌ దాస్‌, కుసుం కుమారి. 1987వ బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. బెనారస్‌ హిందూ యూనివర్సిటీలో బీఎస్సీ హానర్స్‌ (1980-84), ఢిల్లీలోని జేఎన్‌యూలో ఇంటర్నేషనల్‌ స్టడీస్‌(1984-86) చేశారు. విజయనగరం, విజయవాడ అసిస్టెంట్‌ కలెక్టర్‌గా, కృష్ణా జిల్లా జేసీగా, వరంగల్‌ కలెక్టర్‌గా, మురికివాడల అభివృద్ధి పథకం పీడీ, అదనపు కమిషనర్‌, మునిసిపల్‌ పరిపాలన కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌, నీటి పారుదల శాఖ సెక్రటరీ, ప్రిన్సిపల్‌ సెక్రటరీగా కూడా ఆయన సేవలందించారు.
    Published by:Nagesh Paina
    First published: