Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH CS ADITHYANATH DAS MEET SEC NIMMAGADDA RAMESH KUMAR TO DISCUSS ON LOCAL BODY ELECTIONS HERE ARE THE DETAILS PRN

Andhra Pradesh: ఎస్ఈసీతో సీఎస్ కీలక భేటీ..! స్థానిక సంస్థల ఎన్నికల పంచాయితీ తేలినట్లేనా..?

ఆదిత్యానాథ్ దాస్, నిమ్మగడ్డ రమేష్ కుమార్ (ఫైల్)

ఆదిత్యానాథ్ దాస్, నిమ్మగడ్డ రమేష్ కుమార్ (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (Andhra Pradesh High court) ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాథ్ దాస్ (CS Adithyanath das) ఆధ్వర్యంలో ఏర్పాటైన ఉన్నతాధికారుల బృందం.., ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ (Nimmagadda Ramesh Kumar) తో భేటీ అయింది.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలపై పంచాయతీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు., రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వివాదం ఎటూ తెగడం లేదు. దీంతో ఈ వ్యవహారం హైకోర్టు చుట్టూ తిరుగుతోంది. తాజాగా హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఏర్పాటైన ఉన్నతాధికారుల బృందం.., ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో భేటీ అయింది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు జరపాలని ప్రొసీడింగ్స్ ఇచ్చిన నేపథ్యంలో ఎస్ఈసీ ఇచ్చిన ప్రొసీడింగ్స్ ను నిలిపేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారించిన కోర్టు.. ఈ వివాదాన్ని ప్రభుత్వం, ఎన్నికల సంఘం కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించాలని సూచించింది.

    హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ నేతృత్వంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేదీ, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్.. ఎస్ఈసీతో భేటీ అయ్యారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి ఆర్ధిక సంఘం నిధులు సకాలంలో రావాలంటే ఎన్నికలు నిర్వహించాల్సిందేనని., కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. సీఎస్ ఆదిత్యానాథ్ దాస్ కు సూచించారు. ఐతే రాష్ట్రంలో కరోనా కేసులు, కొత్త వైరస్ వ్యాప్తి, వ్యాక్సినేషన్ ప్రక్రియ తదితర అంశాలతో కూడిన నివేదికను సీఎస్.. ఎస్ఈసీకి సమర్పించారు. ఫిబ్రవరిలో ఎన్నికలకు సన్నద్ధం కాలేమని.. మరికొన్నాళ్లు వాయిదా వేయాలని సీఎస్ ఎన్నికల కమిషనర్ ను కోరారు.

    ఇటీవల కీలక ఉత్తర్వులు
    ఐతే స్థానిక సంస్థల ఎన్నికలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జిల్లా పరిషత్, మండల పరిషత్ లలో ప్రత్యేక అధికారుల పాలనను ఆరు నెలల పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేదీ పేరుతో జారీ అయిన ఉత్తర్వుల్లో జిల్లా పరిషత్ లలో జనవరి 5 నుంచి, మండల పరిషత్ లలో జనవరి 4 నుంచి ప్రత్యేక అధికారుల పాలన పొడిగింపు ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ప్రభుత్వాని మధ్య వివాదం నడుస్తున్న నేపథ్యంలో ప్రత్యేక అధికారుల పాలన పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశమైంది.

    ఎడతెగని వివాదం
    వాస్తవానికి గత ఏడాది స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. ఐతే కరోనా పరిస్థితుల కారణంగా ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించడంతో వివాదం రేగింది. ఈ అంశంపైనే కొన్నాళ్లుగా వైసీపీ ప్రభుత్వానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు మధ్య యుద్ధం నడుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో అటు ప్రభుత్వం-ఇటు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోర్టుల్లో పోరాడుతున్నారు. ఈ ఏడాది మార్చిలో తమను సంప్రదించకుండానే ఎన్నికలు వాయిదా వేయడంపై ప్రభుత్వం మండిపడింది. ఆ తర్వాత ఎస్ఈసీ పదవీకాలాన్ని తగ్గిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావడం., దీనిపై కోర్టులో నిమ్మగడ్డ గెలవడం.., మళ్లీ బాధ్యతలు తీసుకోవడం జరిగిపోయాయి. నిమ్మగడ్డ రీఎంట్రీ తర్వాత స్థానిక ఎన్నికలే కేంద్రంగా మళ్లీ యుద్ధం మొదలైంది. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తానని ఎస్ఈసీ ప్రకటించారు. దీనిపై ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఎన్నికల ప్రొసీడింగ్స్ పై స్టే ఇవ్వాలని హై కోర్టులో పిటిషన్ వేసింది. కోర్టులో విచారణ జరుగుతుండగానే ఎన్నికలు నిర్వహించకూడదంటూ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం కూడా చేసింది. ఆ వెంటనే ప్రభుత్వ ఆర్డినెన్స్ వస్తే ఆమోదించవద్దంటూ ఎస్ఈసీ..గవర్నర్ కు లేఖ రాశారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Adityanath Das, Andhra Pradesh, AP High Court, Ap local body elections, Nimmagadda Ramesh Kumar

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు