Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH CS ADITHYANATH DAS AND DGP GOWTHAM SAWANG MET SEC NIMMAGADDA RAMESH KUMAR AHEAD OF PHASE 2 PANCHAYAT ELECTIONS PRN

AP Panchayat Elections: నిమ్మగడ్డతో ఏపీ సీఎస్, డీజీపీ భేటీలో నవ్వులు.. ఇంతలోనే ఎంత మార్పు

ఎస్ఈసీ నిమ్మగడ్డతో భేటీ అయిన సీఎస్, డీజీపీ

ఎస్ఈసీ నిమ్మగడ్డతో భేటీ అయిన సీఎస్, డీజీపీ

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పంచాయతీ ఎన్నికల (AP panchayat Elections) సందర్భంగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ (AP SEC Nimmagadda Ramesh Kumar) కు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే.

    ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో సీఎస్ ఆదిత్యానాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా భాగం కావాల్సి వచ్చింది. అటు ప్రభుత్వ ఉత్తర్వులను పాటిస్తూ.. ఇటు ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తూ కాస్త ఇబ్బంది పడిన సంగతి తెలిసిందే. ఐతే మరోసారి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో సీఎస్ ఆదిత్యానాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్ భేటీ అయ్యారు. ఉన్నతాధికారులిద్దరూ విజయవాడలోని ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వెళ్లి నిమ్మగడ్డతో భేటీ అయ్యారు. ఈ భేటీ గతంలో మాదిరిగా సీరియస్ గా జరగలేదు. ఫస్ట్ ఫేజ్ పంచాయతీ ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించిన సీఎస్, డీజీపీలను ఎస్ఈసీ అభినందించారు.

    తొలి దశ ఎన్నికలు విజయవంతం కావడం, ప్రశాంత వాతావరణంలో జరగడం పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ఆదిత్యానాథ్ దాస్, గౌతమ్ సవాంగ్ ను అభినందించారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు మెరుగైన చర్యలు తీసుకున్నారని ప్రశంసించారు. అంతేకాదు, మిగిలిన మూడు విడతల పంచాయతీ ఎన్నికల నిర్వహణపైనా ఎస్ఈసీ చర్చించారు. అనసరించాల్సిన విధివిధానాలపై రాష్ట్ర ఉన్నతాధికారుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. వచ్చే మూడు దశల ఎన్నికలను కూడా సమర్ధవంతంగా నిర్వహించాలని.. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీ ఆదేశించినట్లు తెలుస్తోంది.

    కాగా, ఈ సమావేశంలో నిమ్మగడ్డ రమేశ్ కుమార్, సీఎస్ ఆదిత్యనాథ్, డీజీపీ గౌతమ్ సవాంగ్ మధ్య పలు సందర్భాల్లో నవ్వులు విరబూశాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ట్రాన్స్ ఫర్ చేయడం, ఉద్యోగులపై చర్యలు తీసుకోవడంతో ఇటు ఎస్ఈసీ, అటు సీఎస్, డీజీపీ మధ్య వాతావరణం వేడెక్కింది. ఈ నేపథ్యంలో సీఎస్ ను ఉన్నతాధికారులిద్దరూ కలడం ఆసక్తిని రేపింది. ఐతే గతంలో కంటే భిన్నంగా అధికారులంతా నవ్వుతూ మాట్లాడుకున్నారు. వారి మధ్య సరదా సంభాషణలు కూడా జరిగినట్లు తెలుస్తోంది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Adityanath Das, Andhra Pradesh, Andhra pradesh news, AP DGP, Ap local body elections, AP News, Damodar Goutam Sawang, Gram Panchayat Elections, Nimmagadda Ramesh Kumar, Telugu news, Vijayawada

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు