Mistory Student Murder in Nellore: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రోజు రోజుకు జరుగుతున్న దారుణలు భయపడేలా చేస్తున్నాయి. కొందరు దుండగులు నర రూప రాక్షసుల్లా మారుతున్నారు. అతి కిరాతకంగా హత్య (Murder) చేస్తున్నారు. అయినా కసి తీరడం లేదో.. లేక దొరికిపోతమనో భయమో హత్య చేసిన తరువాత.. కాల్చేస్తున్నారు కూడా.. అలాంటి భయంకర ఘటన తాజాగా నెల్లూరు జిల్లా (Nellore district) కావలిలో చోటు చేసుకుంది. ఓ బీటెక్ విద్యార్థి (Btech Students) దారుణ హత్యకు గురయ్యాడు. బీటెక్ విద్యార్థిని దుండగులు అతి దారుణంగా హత్య చేసి చెట్ల మధ్యలో కాల్చేశారు. మృతుడ్ని వింజమూరుకు చెందిన రాజేందర్ గా పోలీసులు గుర్తించారు. కావలి విట్స్ ఇంజినీరింగ్ కాలేజీలో రాజేందర్ బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నట్టు తెలుసుకున్నారు. అక్కడున్న నేషనల్ హైవే అధికారులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమచారం ఇచ్చారు. దీంతో డీఎస్పీ ప్రసాద్ రావు, మరికొందరు పోలీసు సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతుడు రాజేందర్ గా గుర్తించారు. అక్కడ కాలిపోయిన సెల్ ఫోన్ ఉండటంతో దానిలో సిమ్ ను తీసుకుని దానిని బట్టి అతను వింజమూరుకు చెందిన రాజేందర్ గా గుర్తించి.. తల్లిదండ్రులకు సమాచారం అందించారు..
రాజేందర్ ప్రతి రోజు.. కాలేజ్ కోసం వింజమూరు నుంచి కావలికి బస్సులో వస్తాడు. రోజూ లానే.. నిన్న కాలేజీకి వచ్చాడు. కాలేజీకి వచ్చిన అతడుు తిరిగి ఇంటికి ఎప్పటికీ రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు.. ఏం జరిగిందో అని భయపడ్డారు. వెంటనే అతడి స్నేహితులకు పోన్ చేసి ఆరా తీశారు. అయినా ఆచూకీ దొరకలేదు. విద్యార్థులు మాత్రం కాలేజీ వదిలిన తరువాత ఇంటికి వెళ్తున్నాని చెప్పి వెళ్లిపోయాడని చెప్పారు. దీంతో తల్లి దండ్రుల్లో ఆందోళన పెరిగింది. ఏమై ఉంటుందని భయపడ్డారు. అతడి ఆచూకీ కోసం ఆరా తీస్తున్న సమయంలో అతడి మృతదేహాన్ని నేషనల్ హైవే సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
ఇదీ చదవండి : ఏపీకి పొంచి ఉన్న మరో ఉపద్రవం.. రాయలసీమకు ఏమైంది అంటూ జనంలో భయం భయం
ఆ విద్యార్థి ఒంటిపై కాలిన గుర్తులు ఉన్నాయి.. కానీ ఒంటిపై పెద్దగా గాయాలు కనిపించలేదు. హత్య చేసినట్టు గాయాలు ఎక్కడా కనిపించకపోవడంతో పోలీసులకు అనుమానాలు పెరుగుతున్నాయి. ఇది హత్య లేదా ఏదైనా జరిగిందా అన్న కోణంలో విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి :చీర కొనుక్కుందని రాక్షసత్వం.. ప్రేమించి పెళ్లాడాడు.. కానీ నరకం చూపించాడు
రాజేందర్ ను ఎవరు హత్య చేశారు? ఎందుకు హత్య చేశారు? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. కాలేజీలో అతడితో పాటు చదువుకున్న విద్యార్థులు, ఇంటి దగ్గర స్నేహితులను అడిగి ఆరా తీస్తున్నారు. అతడికి ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా..? ప్రేమ వ్యవహారాలు లాంటి ఉన్నాయా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు కాలేజీకి వెళ్లిన కొడుకు ఇలా శవమై తిరిగి రావడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. కావలిలో విషాదచాయలు అలముకున్నాయి.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, College student, Crime news, Nellore