Extramarital Affair: ప్రియురాలి మోజులో పడి.. కట్టుకున్న భార్య (Wife)ను కడతేర్చాడు ఓ భర్త (Husband).. అంతేకాదు.. తన భార్య కనిపించడం లేదని.. పోలీసులకు స్వయంగా వెళ్లి ఫిర్యాదు చేశాడు. అతడి నటన చూసి నిజమే అని నమ్మిన పోలీసుల విచారణలో వాస్తవాలు తెలిసి షాక్ కు గురయ్యారు. జోడు నగరాజు అనే వ్యక్తి.. ప్రియురాలి మోజులో పడి, కట్టుకున్న భార్యను హత్య చేసి, పెట్రోల్ పోసి కాల్చి బూడిద చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. విజయనగరం జిల్లా (Vizianagaram District ) లోని కొత్తవలస మండలం, అప్పన్నదొరపాలెం పంచాయతీ శివారు జోడుమేరక గ్రామానికి చెందిన 32 ఏళ్ల జోడు నాగరాజు.. తన భార్య జోడు లక్ష్మిని గత నెల 28వ తేదీన అర్ధరాత్రి హత్య చేశాడు. వీరి వివాహమై 8 సంవత్సరాలు అయింది.
స్థానికులు, పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. నాగరాజు ఎనిమిదేళ్ల క్రితం శ్రీకాకుళం జిల్లా (Srikakulam District), రాజాం ప్రాంతానికి చెందిన లక్ష్మిని ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. వీరికి వివాహమై మూడేళ్ల వరకూ అన్యోన్యంగానే ఉన్నారు. కొన్ని నెలల క్రితం నాగరాజు అదే గ్రామానికి చెందిన అవివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అప్పటి నుంచి తన భార్య లక్ష్మితో రోజు గొడవలు పడుతునే ఉన్నాడు. తనను దూరం పెడుతున్నాడనతన కోపంతో తన భర్తను భార్య రోజూ నిలదీయడంతో గొడవలు ఎక్కువ అయ్యాయి.
ఇదీ చదవండి : ఉద్యోగుల సమ్మె వాయిదా..! మంత్రులు చేసిన ప్రతిపాదనలు ఇవే..?
ఇదే సమయంలో ప్రియురాలితో మరింత దగ్గర కావడంతో, ఆమెను వివాహం చేసుకోవడానికి..తన భార్య లక్ష్మిని అడ్డు తొలగించు కోవాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్న ప్రకారం..ఓ పథకం వేసి లక్ష్మిని హత్య చేశాడు. గత నెల 28వ తేదీన చినమాన్నిపాలెం గ్రామంలో గ్రామ దేవత పండగకు వెళదామని నాగరాజు.. తన భార్య లక్ష్మీని నమ్మించాడు. ఇరుగుపొరుగు వారితో నా భర్త పండుగకు రమ్మన్నాడని, తీసుకు వెళ్తున్నాడని కూడా చెప్పింది.
ఇదీ చదవండి : కేశినేని నానికి ఏమైంది.. మళ్లీ మౌనానికి కారణం ఏంటి..?
పండుగ కోసమని బయల్దేరిన తన భార్య లక్ష్మీని.. విజయనగరం వెళ్లే దారిలో, పెద్దగొప్ప వద్ద గల జీడి మామిడి తోటలోకి తీసుకువెళ్లాడు. అక్కడ ఆమెను చంపి, పెట్రోలత పోసి కాల్చి బూడిద చేశాడు. పోలీసులకు ఆనవాళ్లు లేకుండా పథకం ప్రకారం చేశాడు. ఇక జనవరి 29వ తేదీన ఏమి తెలియనట్లు తన భార్య కనిపించలేదని పోలీసులకు, నాగరాజు ఫిర్యాదు చేసాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేసారు.
ఇదీ చదవండి : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. తిరుమలలో ఆఫ్ లైన్ టోకెన్లు ఎప్పటినుంచి అంటే..?
వారు నివాసం ఉంటున్న ఇంటి వద్ద స్ధానికులను విచారించి అసలు విషయం తెలుసుకున్నారు. భర్త నాగరాజు వ్యవహార శైలిని గమనించిన పోలీసులు, స్ధానికుల ఫిర్యాదులతో అదుపులోకి తీసుకుని విచారించారు. వివిధ కోణాలలో విచారించిన పోలీసులు, భార్య లక్ష్మి ని భర్త నాగరాజు పథకం ప్రకారం హత్య చేసి , కనబడలేదంటూ ఫిర్యాదు ఇచ్చాడని గుర్తించారు.
ఇదీ చదవండి : ప్రజలే రాజీనామా చేయమంటున్నారు.. బాలకృష్ణపై మంత్రి సంచలన వ్యాఖ్యలు
భర్త నాగరాజును విచారించిన పోలీసులు, ఎక్కడ హత్య చేసింది? ఎలా హత్య చేసాడో వివరాలు రాబట్టారు. హత్య చేసిన ఘటనా స్థలంలో విజయనగరం నుంచి క్లూస్ బృందం అణువణువు పరిశీలించారు.. స్థానికులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్ చేసినట్లు సి.ఐ. బాల సూర్యారావు తెలిపారు.
ఇదీ చదవండి : ఉద్యోగుల సమ్మె ప్రభావం ఎంత..? సీఎం జగన్ కీలక నిర్ణయం..!
అమాయకురాలైన భార్య లక్ష్మీని కిరాతకంగా చంపేసిన భర్త నాగరాజుని ఉరి తీయాలని గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. ప్రియురాలి మోజులో పడి, కట్టుకున్న భార్యను కిరాతకంగా హత్య చేసిన నాగరాజుని కఠినంగా శిక్షించి, ఉరి తీయాలని జోడిమెరక గ్రామస్తులు జోడిమెరక గ్రామం నుంచి కొత్తవలస అంబేద్కర్ జంక్షన్ వరకు ర్యాలీ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Crime news, Vizianagaram