Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH CRIME NEWS VIZIANAGARAM ROAD ACCIDENT UPDATE 7 DEAD NGS VZM

Accident: కొత్తకారు కొన్నామన్న ఆనందం.. దైవ దర్శనానికి వెళ్లాలనే ఉత్సాహం.. కానీ ఇంతలోనే..

రోడ్డు ప్రమాదం ఏడుగురు మరణం

రోడ్డు ప్రమాదం ఏడుగురు మరణం

Chitoor Accident update: ఓ ప్రమాదం చిన్నారిని ఒంటరిని చేసింది. కొత్త కారు కొన్నామన్న ఆనందం లేకుండా చేసింది. అప్పటి వరకు తల్లిదండ్రులతో పాటు నానమ్మ, అమ్మమ్మ, తాతయ్య, చెల్లె ఇలా అందరితోనూ సందడిగా కనిపించింది. కానీ అనుకోని ప్రమాదం మూడేళ్ల జషిత నందన్‌ ఒంటిరిగా మిగిల్చింది.

ఇంకా చదవండి ...
  Chitoor Road Accident update: కొత్త కారు కొన్న ఆనందంలో దైవ దర్శనాలకు వెళ్తూ.. ఓ కుటుంబం మొత్తం అనంత లోకాలకు వెళ్లిపోయారు. ఇద్దరు చిన్నారులతో సహా మొత్తం 8 మంది దైవ దర్శనాలకు బయల్దేరితే..‌ ఒకే ఒక్క చిన్నారి ప్రాణాలతో మిగిలింది. చెన్నై (Chennai) లో మెరైన్ ఇంజనీర్ గా చేస్తున్న సురేష్ కుమార్.. తన భార్య, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు, అత్తమామలతో కలిసి తిరుపతి (Tirupati) దైవదర్శనానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు శనివారం ఉదయం మేడమర్తిలో వీరంతా కలిసి కారులో ఆనందంగా తిరుపతి సహా ఇతర పుణ్య క్షేత్రాలలో దైవదర్శనానికి బయలుదేరారు. ఆదివారం మధ్యాహ్నం కాణిపాకం (Kanipakam) ఆలయాన్ని సందర్శించారు. అక్కడ నుంచి తిరుపతి బయలుదేరారు. మరి కొద్దిగంటల్లో తిరుపతి చేరుతామనగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.

  ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతిచెందారు. మృతుల్లో సిక్కోలు వాసులు 5 గురితో పాటు విజయనగరం జిల్లా (Vizianagaram District)కు చెందిన ఇద్దరు ఉన్నారు. మరో చిన్నారి గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం అగరాల వద్ద ఆదివారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, బంధువుల్లో అంతులేని విషాదాన్ని నింపింది.

  ఇదీ చదవండి : అఖండకు ఓ వైపు రికార్డుల మోత.. మరోవైపు అపశృతులు.. థియేటర్‌లో భారీగా మంటలు.. భయంతో ప్రేక్షకుల పరుగులు

  తిరుపతి పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సంతకవిటి మండలం మేడమర్తి గ్రామానికి చెందిన 33 ఏళ్ల కంచరాపు సురేష్‌కుమార్‌, చెన్నైలో మెరైన్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. రెండు నెలల కిందట సెలవులకు స్వగ్రామానికి వచ్చిన సురేష్‌ మరికొద్దిరోజుల్లో చెన్నై బయలుదేరాల్సి ఉంది.  ఇదీ చదవండి : బిగ్ బాస్ ద్వారా ప్రియాంక ఎంత సంపాదించిందంటే? వెళ్తూ వెళ్తూ విన్నర్ ఎవరో చెప్పేసిందికుల పరుగులు

  ఆదివారం మధ్యాహ్నం 2.55 గంటల సమయంలో చిత్తూరు జిల్లా (Chitoor District) చంద్రగిరి మండలం అగరాల వద్దకు వచ్చేసరికి వారు ప్రయాణిస్తున్న కారు ఎదురుగా ఉన్న కల్వర్టును ఢీకొట్టింది. పెట్రోల్‌ ట్యాంకర్‌ పగిలిపోవడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. స్థానికులు పైపులైన్‌ను పగులగొట్టి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. మంటలు ఎగసి పడుతున్నప్పటికీ కారులో బయటకు తీసే ప్రయత్నం చేశారు. పోలీసులు, అగ్నిమాపక, 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. కానీ సకాలంలో అగ్నిమాపక వాహనం చేరలేదు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మంటలను నియంత్రించారు. రక్తపుమడుగులో ఉన్న మృతదేహాలను బయటకు తీశారు.

  ఇదీ చదవండి : అధికార పార్టీలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే.. సీఎం క్లాస్ పీకినా తగ్గేతే లే అంటున్న వైసీపీ నేతలు

  ఈ ఘటనలో సురేష్‌కుమార్‌తో పాటు తండ్రి శ్రీరామ్మూర్తి (70), తల్లి సత్యవతి (62), భార్య మీనా (29), ఆరు నెలల కుమార్తె జోష్మితా సహస్రతో పాటు మామయ్య పైడి గోవిందరావు(విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం పేరాపురం)లు దుర్మరణం పాలయ్యారు. మరో కుమార్తె జషిత నందన్‌, అత్త హైమావతి(పేరాపురం)లు తీవ్ర గాయాలపాలయ్యారు. వీరిని తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.  రాత్రి పది గంటల సమయంలో హైమావతి పరిస్థితి కూడా విషమించి మృతి చెందింది. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్‌ కళాశాలకు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  ఇదీ చదవండి : అధికార పార్టీలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే.. సీఎం క్లాస్ పీకినా తగ్గేతే లే అంటున్న వైసీపీ నేతలు

  అతి వేగమే ప్రమాదానికి కారణమా? లేకుంటే టైరు పంక్చర్‌ అయ్యిందా? లేకపోతే నిద్రమత్తు కారణమా? ఇలా వివిధ కోణాలలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా ప్రదేశానికి ముందు భారీ మలుపు ఉంది. అక్కడ స్కిడ్‌ మార్కులు కనిపించడంతో వాహనం అతి వేగంగా వచ్చినట్టు భావిస్తున్నారు. సర్వీసు రోడ్డు డివైడరుకు కారు రాసుకున్న మార్కులున్నాయి. కాలువలో బోల్తా పడి సర్వీసు రోడ్డుపై ఉన్న కల్వర్టును కారు ఢీకొట్టినట్టు పోలీసులు భావిస్తున్నారు.  ఏఎస్పీ సుప్రజ, డీఎస్పీ నరసప్ప ఘటనాస్థలాన్ని సందర్శించారు.

  ఇదీ చదవండి : నేను ముఖ్యమంత్రి అయితే.. అన్ని ఇళ్లకు ఫ్రీగా ఇళ్ల పట్టాలు.. ఎప్పుడో కట్టిన ఇళ్లకు ఇప్పుడు పట్టా ఏంటి..? చంద్రబాబు ఫైర్

  తల్లిదండ్రులతో పాటు నానమ్మ, అమ్మమ్మ, తాతయ్య, చెల్లెలిని కోల్పోయిన మూడేళ్ల జషిత నందన్‌ ఒంటిరిగా మిగిలింది. చిన్నారి కాలికి గాయాలయ్యాయి. త్వరలోనే పూర్తిగా కోలుకుంటుందని వైద్యులు తెలిపారు. అప్పటివరకు అందరితో ఆనందంగా గడిపిన బాలిక.. జరిగిన ఘటనతో షాక్‌కు గురైంది.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:Nagabushan Paina
  First published:

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు