హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Crime News: క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు.. అంతా 20 ఏళ్ల లోపు వయసువారే

Crime News: క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు.. అంతా 20 ఏళ్ల లోపు వయసువారే

క్షణికావేశంలో పెద్ద నిర్ణయాలు

క్షణికావేశంలో పెద్ద నిర్ణయాలు

crime news: అందమైన జీవితాలు.. బంగారం భవిష్యత్తు.. కానీ క్షణికావేశంలో అర్థాంతరంగా ఆగిపోతున్నాయి... 20 ఏళ్లు దాటకుండానే నిండు నూరేళ్ల జీవితాన్ని ముగించేస్తున్నారు. చిన్నచిన్న కారణాలకే బలవన్మరణాలకు పాల్పడుతున్నారు..

Andhra Pradesh Crime News:  జీవితం ఓ అందమైన ప్రయాణం.. అందులో ఆటుపోట్లు.. కష్ట సుఖాలు అన్నీ ఉంటాయి. ఒక్క క్షణం ఆలోచిస్తే అన్ని సమస్యలకు చక్కని పరిష్కారం దొరుకుతుంది.  కాని క్షణికావేశానికి లోనవుతూ.. తమ జీవితాలను 20 ఏళ్ల లోపే ముగించేసుకుంటున్నారు యువత.  అయినవారికి ఆవేదన మిగుల్చుతున్నారు. ఒక్క విజయనగరం జిల్లాలోనే ఈ మూడేళ్లలో సుమారు 654 మంది ఆత్మహత్యలకు పాల్పడడం అందరినీ ఆలోచనలో పడేలా చేస్తోంది. అందులో 16 ఏళ్ల వారే 33 మంది ఉన్నారు.. జీవితంపై పూర్తి క్లారిటీ లేకుండానే.. అసలు సమస్య ఏంటి అన్నది కూడా తెలియకుండానే జీవితాన్ని ముగించేసుకుంటున్నారు..  తాజాగా

విజయనగరం జిల్లా (Vizianagaram District) గజపతినగరం మండలం పిడిశీల గ్రామానికి చెందిన ఇంటర్‌ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని (Inter 1st Year Student) వారం రోజుల క్రితం ఉరివేసుకుని ఆత్మహత్య (Suicide)కు పాల్పడింది.

బొండపల్లి మండలం శ్యామలవలస గ్రామానికి చెందిన తాడ్డి ఉష (18) తాతగారి గ్రామం అయిన పిడిశీలలో ఉంటూ చదువుకుంటోంది. తాడ్డి ఉష తల్లిదండ్రులైన.. పార్వతి, రమణమూర్తిలు విజయనగరం పట్టణంలో టిఫిన్‌ దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. ఉషను గజపతినగరంలోని ఓ ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలో చదివిస్తున్నారు. చక్కగా చదువుకుని ప్రయోజకురాలు అవుతుందని ఊహించారు.

ఇదీ చదవండి: ఆసక్తి పెంచుతున్న సీఎం జగన్ టూర్.. బిల్లు ఉపసంహరణ తరువాత నేడు తొలిసారి విశాఖకు

కానీ ఇంటర్ లో తీసుకున్న బైపీసీ సబ్జెక్టులను చదవలేకపోయింది. ఆత్మహత్యకు ముందు రెండురోజులు కాలేజీకి వెళ్లడం మానేసిన ఉష.. ఇక మరి చదవలేనన్న బెంగతో మనస్థాపానికి గురై ఈ నెల 6న సూసైడ్ చేసుకుంది. సాయంత్రం అమ్మమ్మ అప్పయ్యమ్మ పొలం పనికి వెళ్లే సమయంలో ఇంటి దూలానికి చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పార్వతి, రమణమూర్తిలకు ఇద్దరు ఆడపిల్లలు. అందులో పెద్దమ్మాయి పావనికి వివాహం కాగా, ఉష ఆత్మహత్యకు పాల్పడడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఇదీ చదవండి:ఒకే వేదికపై విపక్షాలు.. ముగింపు సభతో అమరావతి కథ ఏ టర్న్ తీసుకుంటుంది..? కొత్త కూటమికి వేదికవుతుందా?

మరో కేసులో ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. తమ పెద్దలు తమ ప్రేమకు అంగీకారం తెలపకపోవడంతో శ్రీకాకుళం జిల్లాలోని రేగిడి మండలం తునివాడ గ్రామానికి చెందిన హరీష్‌, దివ్య ప్రేమజంట అక్టోబర్ 29న ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొద్ది రోజుల క్రితం వీరు విశాఖపట్నంలో రహస్యంగా వివాహం చేసుకున్నారు. తరువాత గ్రామానికి వచ్చిన ఇద్దరు ప్రేమికులు పెద్దలను ఒప్పించేందుకు ప్రయత్నించారు. పెద్దలను ఒప్పించడం కుదరనుకున్నారో లేక అయితే ఇంకేమైనా జరిగిందో తెలియదు గానీ ఇద్దరు ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఇదీ చదవండి: సమంతపై మండిపడుతున్న భార్య బాధితుల సంఘం.. పుష్పలో పాట తొలగించాలని డిమాండ్

విజయనగరానికి చెందిన కాకర్లపూడి అనిత అనే మహిళ ఎంవీజీఆర్‌ ఇంజనీరింగ్ కాలేజ్ లో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. భర్త మందలించారన్న కారణంతో గతనెల 20న గంట్యాడ మండలం తాటిపూడి జలాశయంలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పార్వతీపురం పట్టణానికి చెందిన పిచ్చిక ప్రదీప్‌కుమార్‌ అనే యువకుడు మానసిక స్థితి బాగులేక ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జామి ఎస్సీ కాలనీకి చెందిన లక్ష్మి అనే మహిళ  నెలరోజుల కిందట కడుపునొప్పి తాళలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన సాహు అనే వ్యక్తి గంట్యాడ మండలంలోని కరకవలసగ్రామం సమీపంలో ఉన్న తోటలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పార్వతీపురం మండలానికి చెందిన సురేష్‌ అనే యువకుడు ప్రేమ విఫలమైందన్న మనస్థాపంతో పురుగుమందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు.

ఇదీ చదవండి: ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గిన ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు.. పీఆర్సీపై చర్చలు సఫలం.. ఆందోళన విరమణ

ప్రేమ విఫలమైందని కొందరు.. భర్త, అత్తమామలు వేధించారని.. ఒంట్లో బాగోలేదని, ఆరోగ్యం మరి కుదుటపడదని కొందరు.. చదువుకోమని తల్లిదండ్రులు మందలించారని కొందరు.. ఇలా చిన్నచిన్న కారణాలకే చాలామంది క్షణికావేశానికి గురవుతున్నారు. ప్రాణాలు తీసుకుంటున్నారు.

ఇదీ చదవండి: భారత్‌లో ఒమిక్రాన్ కలకలం.. సెంచరీకి చేరువలో కొత్త వేరియంట్ కేసులు

ఒక్క విజయగనరం జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం.. 2019 నుంచి 2021 అక్టోబర్‌ నెలఖారు నాటికి ఒక అంచనా ప్రకారం 654 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారని తేల్చారు. వీరిలో పెద్దవారు 621 మంది కాగా, 16 ఏళ్లలోపు వారు 33 మంది. పెద్దవారిలో మగవారు 458 మంది కాగా మహిళలు 163 మంది ఉన్నారు. 16 ఏళ్లు లోపు వారిలో బాలురు 10 మంది, బాలికలు 23 మంది ఉన్నారు.

ఇదీ చదవండి: ‘సార్సోం కా సాగ్‌’ సురేష్ రైనా వింటర్ డిష్.. దీని స్పెషల్ ఏంటో తెలుసా..?

పెద్దలతో పాటూ చిన్న చిన్న పిల్లలు సైతం ఆత్మహత్యలకు పాల్పడుతూ ప్రాణాలు తీసేసుకుంటున్నారు. కాగా, చిన్న పిల్లల ఆత్మహత్యలను నివారించడం కోసం.. మానసిక వైద్యులు అనేక సూచనలు, జాగ్రత్తలు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి: వన్నె తగ్గని అందాల నటి.. వైల్డ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్న సదా

ముఖ్యంగా పిల్లలతో తల్లిదండ్రులు స్నేహపూర్వకంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇటీవల పిల్లలతో తల్లిదండ్రులు ఎక్కువుగా గడపడం లేదు. ఎవరి బిజీలో వారు ఉంటున్నారు. దీనివల్ల పిల్లలు స్నేహితులతో గడుపుతున్నారు. మంచి స్నేహం అయితే ఫర్వాలేదు. చెడు అలవాట్లు ఉన్నవారితో స్నేహం కుదిరితే చెడుమార్గంలో వెళ్తున్నారని డాక్టర్లు అంటున్నారు. అందువల్ల కొన్ని సార్లు మనోధైర్యం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అందువల్ల వారికి సకాలంలో ఫ్యామిలీ సపోర్టు కావాల్సి ఉంటుందని, పిల్లలతో ఎక్కువసేపు గడపాలని సూచిస్తున్నారు.

ఇదీ చదవండి: చలికాలం దోమలు చంపేస్తున్నాయని కాయిల్స్ వెలిగిస్తున్నారా..? అయితే ఓ షాకింగ్ న్యూస్..

వివాహేతర సంబంధాలు, కుటుంబ తగాదాల వల్ల కూడా ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కౌన్సెలింగ్‌ సెంటర్ల ఆవశ్యకత ప్రస్తుతం ఎంతైనా ఉంది. సకాలంలో కౌన్సిలింగ్‌ ఇచ్చి, మందులు వాడితే ఆత్మహత్యల బారినుంచి కాపాడవచ్చని.. మానసిక వైద్యులు సూచిస్తున్నారు. కో చెప్పి పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలని.. మనసుకు బాధ కల్గినప్పుడు మనోధైర్యాన్ని కోల్పోరాదని, మానవ సంబంధాల గురించి నేటి వారికి తెలియజేయాల్సిన అవసరం ఉందని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

ఉత్తమ కథలు