హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Pushpa Effect: వాహనాలు తనిఖీ చేస్తుండగా కదులుతున్న గోనె సంచులు.. ఓపెన్ చేస్తే షాక్ తిన్న పోలీసులు

Pushpa Effect: వాహనాలు తనిఖీ చేస్తుండగా కదులుతున్న గోనె సంచులు.. ఓపెన్ చేస్తే షాక్ తిన్న పోలీసులు

కొత్త కొత్త ఐడియాలతో షాక్ ఇస్తున్న స్మగ్లర్లు

కొత్త కొత్త ఐడియాలతో షాక్ ఇస్తున్న స్మగ్లర్లు

Pushpa Effect: స్మగ్లర్లు పుష్పా ట్రిక్స్ ను ఇష్టానుసారం వాడేస్తున్నారు. సినిమాలో పుష్పరాజ్ తెలివిగా తప్పించుకున్నట్టు తాము కూడా కొత్త కొత్త ఐడియాలతో పోలీసుల నుంచి తప్పించుకోవచ్చనుని స్కెచ్ లు వేస్తున్నారు. కానీ అది సినిమా.. ఇది రియల్ లైఫ్ కావడంతో.. వారి ఐడియాలను పోలీసులు చిత్తు చేస్తున్నారు.

ఇంకా చదవండి ...

Pushpa Effect: స్మగ్లర్ ఐడియాలను చూసి పుష్పా సినిమా పుట్టుకొచ్చిందో.. లేక పుష్ప సినిమాలోని ఐడియాలన స్మగ్లర్లు వాడుతున్నారో.. కానీ ఇటీవల పోలీసుల కళ్లుగప్పే ఐడియాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో పుష్ప ఎఫెక్ట్ బాగానే కనిపించింది. అందుకే స్మగ్లర్లు గతంలో ఎన్నుడూ లేని విధంగా కొత్త కొత్త ఐడియాలో రెచ్చిపోతున్నారు. సినిమాలో పుష్ప రాజ్ తెలివిగా తప్పించుకున్నట్టు తామూకూడా తప్పించుకోవచ్చని.. వారి బ్రెయిన్ కు పని పెడుతున్నారు. ముందు ప్లాన్ ప్రకారం ఎవరికీ అనుమానం రాకుండా కొత్త కొత్త పద్దతుల్లో వాహనాలను చెక్ పోస్టులు దాటిస్తున్నారు. కుదరకపోతే ఎదురు దాడికి దిగుతున్నారు. ఈ మధ్య కాలంలో ముఖ్యంగా పుష్ప సినిమా విడుదల అయిన తరువాత ఇలాంటి ఘనటలు నిత్యం ఎక్కడో ఒక దగ్గర కనిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇలా స్మగ్లర్లు ఎన్ని రకాలుగా తెలివితేటలు ప్రదర్శించినా.. ఎక్కడో ఒకచోటు పోలీసులకు దొరికిపోతున్నారు.. అయితే స్మగ్లర్ల తెలివితేటలు చూసి పోలీసులు మాత్రం షాక్ కు గురవుతున్నారు.. ఇన్ని కొత్త కొత్త ఐడియాలకు ఎక్కడ నుంచి వస్తున్నాయా అని నోరెళ్లబెడుతున్నారు.

ఇటీవల ఏపీ వ్యాప్తంగా ఎక్కడ చూసినా స్మిగ్లర్ల గురించి ఏదో ఒక వార్త వినాల్సి వస్తోంది. ప్రతి రోజూ ఆంధ్రప్రదేశ్‌లో ఏదో ఒక చోట.. పోలీసులు స్మగర్లను అదుపులోకి తీసుకుంటూనే ఉన్నారు. ఈజీ మనీ కోసం కొందరు కేటుగాళ్లు ఈ మార్గాలను ఎన్నుకుంటున్నారు. అయితే ఇటీవల ఎక్కువగా స్మగ్లింగ్ చేస్తున్న వాటిలో ప్రధానమైనవి ఏంటంటే...? మొదటిది ప్రపంచంలోనే అత్యంత విలువైన కలప ఎర్రచందనం(Red sandalwood).. ఎందుకంటే కోట్లు కుమ్మరిస్తాయి వీటి విలువ. శేషాచలం కొండల్లో మాత్రమే లభించే ఈ ఎర్ర బంగారాన్ని దేశాలు దాటించడానికి అక్రమార్కుల నిత్యం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇక రెండోది గంజాయి.. ఇతర మత్తు పదార్దాలు.. వీటికి కూడా భారీగానే డిమాండ్ ఉన్నా.. వీటిని తరలించడం అంత ఈజీ కాదు.. కఠిన శిక్షలు కూడా ఎదుర్కోవలసి వస్తుంది. అయినా స్మగ్లర్లు కొత్త కొత్త దారుల్లో ప్రయత్నాలు చేసి విఫలమవుతున్నారు. ఇక మూడోది వన్యప్రాణులు.. అంటే ఏనుగు దంతాలు, చర్మం.. జింక చర్మం, పులి గోర్లు.. నక్షత్ర తాబేళ్లు వంటి వాటిని మన దగ్గరి నుంచి స్మగ్లింగ్ చేసేందుకు దుండగులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ స్మగ్లింగ్ ఎప్పటినుంచో ఉన్నా.. ఇటీవల కొత్త కొత్త ఐడియాలతో పోలీసులకు మస్కా కొట్టే ప్రయత్నం చేస్తున్నారు స్మగ్లర్లు.. తాజాగా ఇలాంటి ఘటనే కృష్టా జిల్లాలో వెలుగుచూసింది.


పోలీసులకు అనమానం రాకుండా.. కూరగాయలు, ఇతర సామాగ్రి తీసుకెళ్తున్న ముసుగులో నక్షత్ర తాబేళ్లను గోనె సంచుల్లో ప్యాక్ చేశారు. వారి ఐడియా అయితే బాగానే ఉంది కానీ.. ఆ గోనె సంచుల్లో ఉన్నతాబెళ్లను నియంత్రించడం సాధ్యం కాదు కదా.. అందుకే అవి సరిగ్గా పోలీసులు వచ్చే సమయానికి అటూ ఇటూ కదిలాయి. పోలీసులు వ్యాన్ ఆపగా గోనెసంచులు కదలడం చూసి అనుమానం కలిగింది. దీంతో ఏంటా అని చెక్ చేయగా అసలు బాగోతం వెలుగుచూసింది. కృష్ణాజిల్లా కైకలూరు నుంచి.. తాబేళ్ళను అక్రమంగా తరలిస్తూ అడ్డంగా దొరికిపోయారు. సుమారు 25 సంచుల్లో 500లకు పూగా తాబేళ్లను తరలిస్తుండగా పోలీసులకు చిక్కారు. దీంతో ఆ వ్యాన్ డ్రైవర్ సహా.. మరో ఇద్దర్ని పోలీసులు అదుపులోకి తీసుకుని.. కూపీ లాగుతున్నారు. ఈ ముఠాలో ఇంకా ఎవరెవరు ఉన్నారనే దానిపై విచారణ చేస్తున్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Crime news, Pushpa film, Smuggling

ఉత్తమ కథలు