హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Raw Liquor: వామ్మో నాటు సారా చెరువు.. పోలీసులకు సవాల్ విసురుతున్న గ్యాంగ్

Raw Liquor: వామ్మో నాటు సారా చెరువు.. పోలీసులకు సవాల్ విసురుతున్న గ్యాంగ్

నాటు సారా చెరువు

నాటు సారా చెరువు

Raw liquor: ఎక్కడైనా నాటుసారా ఊట ఎంత దొరుకుతుంది..? వంద లీటర్లో.. వెయ్యి లీటర్లో అంతేగా..? కానీ.. ఈస్ట్ గోదావరిలో మాత్రం యాభై వేల లీటర్ల పైనే నాటు సారా.. ఊటని స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో పోలీసులు పట్టుకున్నారు. అది కూడా నాలుగు నెలల వ్యవధిలోనే. ఆ సారాను పారబొస్తే.. ఏకంగా ఓ చెరువులా మారింది.

ఇంకా చదవండి ...

P. Anand Mohan, Visakhapatnam, News18                           Natu Sara Gang Arrested:  ఆంధ్రప్రదేశ్  (Andhra Pradesh)లో నాటు సారా గ్యాంగ్ పోలీసులకు సవాల్ విసురుతున్నారు.. ఎప్పటికప్పుడు నిఘా పటిష్టంగా ఉండడంతో కొత్త కొత్త మార్గాల్లో నాటు సారాను గుట్టు చప్పుడు కాకుండా విక్రయిస్తున్నారు. అయితే ఎన్నిసార్లు నాటు సార ఊటలను ధ్వంసం చేసినా.. మళ్లీ కొత్తవి ఎలా పుట్టుకొస్తున్నాయో పోలీసులకు అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. తాజాగా  నాటు సారా (Raw Liquor) చెరువును తలపించే రీతిలో డంప్ దొరకడం తూర్పు గోదావరి  (East Godavari) పోలీసుల్ని.. అక్కడి స్థానికుల్ని కూడా ఈ విషయం నోరెళ్ల బెట్టేలా చేసింది. మొత్తం యాభై వేల లీటర్ల వరకూ సారాను ఓ చోట పారబోశారు ఎస్ఈబీ పోలీసులు (SEB Police). అదంతా ఒక చోట పోసేసరికి చెరువులా మారిపోయింది.

తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ఎక్కువగా ఉన్న ప్రాంతం. గోదావరి, కోనసీమ (Konaseema) తో పాటు అటు చింతూరు, రంపచోడవరం మొత్తం దట్టమైన అడవులు ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతాన్ని మన్యం అని కూడా పిలుస్తారు. ఇక ఇక్కడ ఏజెన్సీలో సారాకాయడం అనేది కామన్. గిరిజనులు సారా తాగడం.. ఆ తయారీకి వారిలో కొందరు సహకరించడం కూడా సహజం.  ఏజెన్సీ ప్రాంతాల్లోనే సారా కాస్తారు. దీనికి ప్రత్యేకించి బెల్లం ఊటలు.. ఇతరత్రా సామాగ్రిని వాడతారు.

ఇదీ చదవండి : ఈ ఇడ్లీ టేస్ట్ ఒక్కసారి చూస్తే చాలు.. మళ్లీ మళ్లీ తింటారు.. టేస్టే కాదు హెల్తీ కూడా

మారుమూల గిరిజన ప్రాంతాల్లో వీటిని పెద్ద పెద్ద కుండల్లో కాస్తుంటారు. దీన్ని పట్టుకోవడానికి పోలీసులకి కత్తి మీద సామే. చాలా రోజులు శ్రమిస్తే తప్ప.. ఒక్క బెల్లం ఊట ఉన్న ప్రాంతం గురించి సమాచారం అందదు. ఇక ఇవి దొరికిన తర్వాత వాటిని స్వాధీనం చేసుకుని ఉన్న చోటే వాటిని నాశనం చేస్తారు. అక్కడే పారబోసేసి సారా కాసిన వారు దొరికితే కేసులు నమోదు  చేస్తారు.

ఇదీ చదవండి : నేను ముఖ్యమంత్రి అయితే.. అన్ని ఇళ్లకు ఫ్రీగా ఇళ్ల పట్టాలు.. ఎప్పుడో కట్టిన ఇళ్లకు ఇప్పుడు పట్టా ఏంటి..? చంద్రబాబు ఫైర్

ఈమధ్య కాలంలో గంజాయి రవాణా పై దృష్టి పెట్టిన ప్రభుత్వం ఈ సారా వ్యవహారం పై కూడా గట్టిగానే పట్టుబట్టింది. దీంతో ఎస్ఈబీ.. స్థానిక పోలీసులు ఎప్పటికప్పుడు సారా కాసే స్థావరాలు.. సారా కేంద్రాలుగా ఉంటున్న గ్రామాలపై దాడులు చేస్తున్నారు. ఈ దాడులతోనే అధిక మొత్తంలో సారా దొరుకుతోంది. ఇప్పుడా దొరికిన సారానే ఇలా పారబోశారు. అది చెరువైంది. పోలీస్, ఎస్ఇబి అధికారుల ఆధ్వర్యంలో 46 వేల లీటర్ల సారాయి ధ్వంసం చేశారు.

ఇదీ చదవండి : లోకేష్ ను చంద్రబాబే ఓడించారా..? ఆ పదవికి అడ్డుపడతారని భావించారా..? మంత్రి సంచలన వ్యాఖ్యలు

తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా 4 నెలల నుండి వివిద ప్రాంతాల్లో చేసిన దాడుల్లో సారాయి పట్టివేత జరిగింది. జిల్లా వ్యాప్తంగా సుమారు 3వేల కేసులు నమోదు చేస్తే అందులో చాలావరకూ సారా మాత్రమే దొరికింది. సారా కాసే వ్యక్తులు మాత్రం పరారయ్యారని పోలీసులు చెబుతున్నారు. ఇక ధ్వంసం చేసిన సారాయి విలువ సుమారు కోటి రూపాయలు ఉంటుందని పోలీసు అధికారులు తెలిపారు.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Andhra Pradesh, AP News, Crime news, East Godavari Dist, Liquor

ఉత్తమ కథలు