ANDHRA PRADESH CRIME NEWS RAPE ISSUES CONTINUES SO POLICE ALERT AND TAKE KEY DECISIONS NGS
AP Crime News: ఈ ఆంధ్రప్రదేశ్ కు ఏమైంది? వరుస అత్యాచార ఘటనలతో పోలీసుల అలర్ట్.. కీలక నిర్ణయం
ప్రతీకాత్మక చిత్రం
AP Crime News: ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు రక్షణ కరువైందా..? వరుస అత్యాచారాలు దేనికి సంకేతం..? పటిష్ట నిఘా ఉన్నా.. కఠిన చర్యలు అమలు చేస్తున్నా.. దిశా యాప్ అందుబాటులోకి తెచ్చినా.. కామంధులు ఎందుకు రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.
AP Crime News: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ను వరుస అత్యాచారాలు (Rape) భయపెడుతున్నారు. రోజు ఎక్కడో ఒక దగ్గర ఈ వార్తలు వినాల్సి వస్తోంది. ఆ జిల్లా ఈ జిల్లా అని తేడా లేకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు. ఈ మధ్య కాలంలో వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతుండడం కలకలం రేపుతోంది. అయితే వరుస అత్యాచార ఘటనలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఏపీ పోలీసులు (AP Police) అప్రమత్తమయ్యారు. ఎందుకంటే అత్యాచారాల సంఖ్య పెరగడంతో.. పోలీసులు తీవ్ర ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తోంది. ఏపీ పోలీసులు వైఫల్యమే ఈ ఘటనలకు కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం వారికి తలనొప్పి అవుతోంది. ఎందుకంటే పోలీసుల తీరుపై ఇప్పటికే తీవ్ర విమర్శలు వెల్తువెత్తున్నాయి. అధికార పార్టీ నేతలకు తొత్తులుగా వ్యవహరించడమే తప్పా.. శాంతి భద్రతలను పట్టించుకోవడం లేదని విమర్శుల ఉన్నాయి. దీంతో అలెర్ట్ అయిన పోలీసులు నేరాల నియంత్రణకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా విజయవాడ (Vijayawada) పోలీసులు అత్యాచార ఘటనలకు అడ్డుకట్ట వేయడానికి, మహిళల్లోనూ దిశ యాప్ (Disha App) వినియోగం గురించి అవగాహన పెంపొందించడానికి విస్తృతంగా కార్యక్రమాలను పెంచుతున్నారు.
తాజా ఘటనల నేపథ్యంలో.. దిశ యాప్ ను అందరికీ అందుబాటులోకి తెచ్చి మహిళలకు రక్షణ కల్పించడం కోసం ప్రతి పోలీస్ స్టేషన్ కు ఒక వాహనాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు విజయవాడ సిపి కాంతి రాణా (Vijayawada CP Kanthi Rana) టాటా చెప్పారు. అలాగే ఇప్పటికే కళాశాలలు, పాఠశాలలు, అపార్ట్మెంట్లు, వివిధ కాలనీలకు వెళ్లి మహిళలకు దిశా యాప్ ఇన్స్టలేషన్ తో పాటుగా అత్యవసర సమయాల్లో దాన్ని ఏవిధంగా ఉపయోగించాలి అన్న దానిపై అవగాహన కల్పించడానికి మహిళా పోలీసులతో జిల్లా వ్యాప్తంగా ప్రత్యేకమైన అవగాహన డ్రైవ్ ను నిర్వహిస్తున్నారు.
ముఖ్యంగా ఓ సీజన్ లా.. ఇఫ్పుడు వరుస అత్యాచారాలు భయపెడుతున్నాయి. ఇప్పటికైనా అలర్ట్ అవ్వకపోతే.. భారీ మూల్యం తప్పించుకోక తప్పదు.. అందుకే ప్రతి పోలీస్ స్టేషన్ కు ఒక వాహనాన్ని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. దీనికి తోడు 24 గంటలూ ఆ వాహనం ద్వారా దిశ ప్రత్యేక బృందాలు, పోలీస్ స్టేషన్ సిబ్బంది సహకారంతో నేర ప్రభావిత ప్రాంతాలలో గస్తీ కాసేలా ప్లాన్ చేస్తున్నారు.
నేరాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వాహన తనిఖీలు పెంచాలని, అనుమానిత వ్యక్తుల కౌన్సిలింగ్ నిర్వహించాలని, దిశ యాప్ పై ప్రజలకు అవగాహన పెంచాలని పోలీసు సిబ్బందికి సూచించారు. అలాగే ప్రతి ఒక్కరు దిశ యాప్ ను డౌన్ లోడు చేసుకుని.. రిజిస్టర్ చేసుకునేలా చూడాలని సూచించారు. ఆపద సమయంలో వెంటనే దిశ యాప్ ద్వారా నగర పోలీసుల సహకారాన్ని పొందవచ్చని విజయవాడ సిపి కాంతిరాణా టాటా వెల్లడించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.