హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Crime News: వీడి తెలివితేటలు మామూలుగా లేవుగా.. రోజూ స్టేషన్ కు సంతకం పెట్టడానికి వెళ్లాలని.. ఏం చేశాడో తెలుసా?

Crime News: వీడి తెలివితేటలు మామూలుగా లేవుగా.. రోజూ స్టేషన్ కు సంతకం పెట్టడానికి వెళ్లాలని.. ఏం చేశాడో తెలుసా?

వీడి తెలివితేటల గురించి తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే

వీడి తెలివితేటల గురించి తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే

Crime News: పోలీసులకు షాక్ ఇచ్చాడు ఓ దొంగతనం కేసులో నిందితుడు.. రోజు పోలీస్ స్టేషన్ కు వచ్చి సంతకం పెట్టడం ఇబ్బందిగా మారిందని.. ఏకం ఏ చేశాడో తెలుసా..? ఆ విషయం తెలియడంతో పోలీసులు సైతం షాక్ కు గురయ్యారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Chittoor, India

Crime News:  మహా నగరాల్లో ట్రాఫిక్ సమస్య గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కార్యాలయాలకు.. ఇతర పనులకు వెళ్లే వ్యక్తులు.. తమ ఇంటి నుంచి గమ్యానికి చేరుకోవాలంటే గంట ముందే ప్రయాణం ప్రారంభించాల్సి ఉంటుంది. చెన్నై(Chennai), హైదరాబాద్ (Hyderabad), బెంగళూరు (Bagnalore) వంటి మెట్రో నగరాల్లో మన ప్రయాణం అనుకున్న టైం కు వెళ్లాలంటే రెండు నుంచి మూడు గంటల ముందే ఇంటి నుంచి బయటకీ రావాల్సి ఉంటుంది. ఒకవేళ తమ ప్రయాణం అటు ఇటు అయితే ఇరకాటంలో పడినట్లే. ప్రజారావాణ అయిన బస్సుల్లో ప్రయాణించే వారికీ ప్రత్యక్ష నరకం కనపడుతుంది. సీట్లు దొరకవు, అలా అని గమ్య స్థానానికి శీఘ్రంగా వెళ్ళలేని పరిస్థితి.
ఈ సమస్యకు చెక్ పెట్టడానికి ఓ వ్యక్తి ఏం చేశాడో తెలుసా..? ఓ హత్యా కేసులో నింధుతుడైన వ్యక్తి రోజు స్టేషన్ కు వెళ్లి సంతకం పెట్టాల్సి ఉంది. రోజు బస్సులో వెళ్లి వెళ్లి విసుగు చెందాడు.. దీనిని అధిగమించాలని ఆ వ్యక్తి ఎం చేసాడో తెలిసి పోలీసులే షాక్ అయ్యారు..


వివరాల్లోకి వెళితే..  చెన్నైకి చెందిన 40 ఏళ్ల దినేష్ అనే వ్యక్తి స్పెన్సర్ ప్లాజా షాపింగ్ మాల్ సమీపంలోని ఓ దుకాణం వద్ద తన మోటార్ బైక్ ను పార్క్ చేసాడు. తాను వస్తువులు కొనుగోలు చేయడానికి ఓ షాప్ దగ్గరకి వెళ్ళాడు. షాపింగ్ ముగించుకొని తిరిగి వచ్చేసరికి దినేష్ మోటార్ బైక్ కనిపించలేదు. చుట్టూ పక్కల ప్రాంతాల చూసాడు. అయినా మోటార్ బైక్ ఆచూకీ లభ్యం కాలేదు. తన బైక్ దొంగిలించారంటూ దినేష్ పోలీసులకు పిర్యాదు చేసారు.
ఇదీ చదవండి : నేటి నుంచి డాక్టర్లకు కొత్త నిబంధనలు.. ఆస్పత్రుల్లో తప్పనిసరి చేసిన ప్రభుత్వం.. ఫ్యామిలీ డాక్టర్ పైనా క్లారిటీ
దీంతో పోలీసులు కేసు నమోదు చేసి.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. బైక్ దొగలించిన వ్యక్తిని సులువుగా గుర్తించారు పోలీసులు. సీసీ టీవిలో నమోదైన చిత్రాలు ఆధారంగా పాత నేరస్థుల షీట్లలో పరిశీలించారు. పోలీసుల నేర చరిత్ర రికార్డ్ ప్రకారం పార్థసారధిగా గుర్తించారు. వెంటనే అతనిని అదుపులోకి తీసుకోని విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి : ఇకపై ఇంటిదగ్గరే వినాయక నిమజ్జనం.. ప్రత్యేక చర్యలు చేపట్టిన అధికారులు.. ఎలా అనుకుంటున్నారా?
పార్థసారధి ప్రస్తుతం హత్యానేరం పై శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ కేసులోనే బెయిల్ పై బయటకు వచ్చాడు. ఇదంతా బాగానే ఉన్న ఎందుకు బైక్ ను దొంగతనం చేసావని పోలీసులు పార్థసారధిని ప్రశ్నిస్తే వారు షాక్ అయ్యారు. దీంతో తాను బెయిల్ పై బయట ఉన్నానని తెలిపాడు పార్థసారధి. ఈ కేసు విషయమై రోజు సంతకం పెట్టేందుకు అన్నాసలై పోలీస్ స్టేషన్ కు వెళ్లి వచ్చేవాడిని అని పోలీసులకు తెలిపాడు.
ఇదీ చదవండి : మెగా వినాయక సంబరాలు.. చిరంజీవి ఇంట్లో పూజ ఎలా జరిగిందో చూడండి..
రోజూ తాను బస్సులోనే వెళ్లి వచ్చేవాడినని.. నెరుకుండ్రం నుంచి అన్నాసలై.. మళ్లీ అన్నాసలై నుంచి నెరుకుండ్రం వెళ్లి వచ్చే వాడినని వివరించారు. ఇలా రోజు బస్సు ప్రయాణం తనకు విసుగు తెప్పించింది అంట.. దీంతో పార్థసారధి బైక్ ను దొంగలించాలని పక్క ప్లాన్ వేసాడు. స్పెన్సర్ ప్లాజా వద్ద అప్పుడే పార్క్ చేసిన మోటార్ బైక్ ను డోగ్గిలించినట్లు పోలీసులకు వివరించాడు.. దీంతో పోలీసు స్టేషన్ లో సంతకం పెట్టడానికి బైక్ దొంగతనం చేశాడని తెలియడంతో అంతా షాక్ కు గురయ్యారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Bike theft, Chittoor, Crime news

ఉత్తమ కథలు