Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH CRIME NEWS PISTOL ATTACK IN SRIKAKULAM DISTRTICT VILLAGE PRESIDENT NGS VZM

Gun Fire: మహిళతో మాట్లాడుతుండగా.. సర్పంచ్ పై కాల్పులు.. అనుమానాలన్నీ ఆమె పైనే

సర్పంచ్ పై కాల్పుల కలకలం

సర్పంచ్ పై కాల్పుల కలకలం

Gun Fire: ఆంధ్రప్రదేశ్ లో కాల్పుల కలకలం రేగింది. ఓ మహిళతో మాట్లాడుతున్న సర్పంచ్ పై దుండగులు అకస్మాత్తుగా కాల్పులు జరిపారు. దీంతో ఆ కాల్పుల ఘటనకు ఆ మహిళే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

    Gun Fire: శ్రీకాకుళం జిల్లా (Srikakulam District)లో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. అదికూడా ఓ మహిళతో మాట్లాడుతున్న సమయంలో దుండగులు అకస్మాత్తుగా దాడికి దిగారు.. మంగళవారం అర్ధరాత్రి గార మండలం రామచంద్రాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రామచంద్రాపురం సర్పంచ్ వెంకటరమణ మూర్తిని హత్య (Murder) చేసేందుకు గుర్తుతెలియని వ్యక్తులు ప్రయత్నించారు. ఈ దాడికి కారణాలు పూర్తిగా తెలియకపోయినా.. పాత గొడవలే కారణమని భావిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం రాత్రి మరురానగర్‌లోని సర్పంచ్ కార్యాలయానికి ఆదివారం పేటకు చెందిన ఓ మహిళ వెళ్లింది. తనతో పాటు మరో ఇద్దరు వ్యక్తులను కూడా సదరు మహిళ సర్పంచ్ దగ్గరకు తీసుకెళ్లింది. సర్పంచ్‌తో మహిళ మాట్లాడుతున్న సమయంలో… ఆమెతో వచ్చిన వ్యక్తులు తుపాకీతో సర్పంచ్‌పై కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారని భావిస్తున్నారు.

    ఈ ఘటనలో వెంకటరమణకు తీవ్రగాయాలు కావడంతో ఆయన్ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఘటనా స్థలంలో పోలీసులకు రెండు బుల్లెట్లు లభ్యమయ్యాయి. దీంతో డీఎస్పీ ఆధ్వర్యంలో క్లూస్ టీమ్ వేలిముద్రలను (Finger prints) సేకరించారు.

    ఇదీ చదవండి : ఆ నియోజకవర్గంలో ఢీ అండే ఢీ.. ఆస్తుల లెక్కలపై ఇరు పార్టీ నేతల సవాళ్లు..

    స్వల్ప గాయాలతో తప్పించుకున్న సర్పంచ్ వెంకటరమణ ను .. స్థానికులు ఆస్పత్రికి తరలించారు. రిమ్స్ లో చికిత్స అనంతరం ఈ తెల్లవారుజామున డిశ్చార్జ్ అయ్యారు. కాల్పుల ఘటన సమాచారం అందుకున్న శ్రీకాకుళం వన్ టౌన్ పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకొని దర్యాప్తు మొదలు పెట్టారు. ఈ దాడికి కారణాలు పూర్తిగా తెలియకపోయినా.. సర్పంచ్ కు, ఘటనా స్ధలంలో ఉన్న మహిళకు మధ్య ఉన్న అక్రమ సంబంధం (Extra Marital Affair ), రియల్ ఎస్టేట్ వ్యాపారం (Real Estate Business) లో పాత గొడవలే కారణమని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఘటనా స్థలంలో పోలీసులకు రెండు బుల్లెట్లు లభ్యమయ్యాయి. డీఎస్పీ ఆధ్వర్యంలో క్లూస్ టీమ్ వేలిముద్రలను సేకరించారు. కేసుకు సంబంధించి ఇంకా దర్యాప్తు తరువాత పూర్తి వివరాలు తెలుస్తాయి అంటున్నారు పోలీసులు..

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Crime news, Srikakulam

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు