హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Crime News: బ్యాంక్ పెట్టుకోవచ్చు అంటూ లక్షల్లో చీటింగ్.. పోలీసులకు సవాల్ విసురుతున్న మోసాలు

Crime News: బ్యాంక్ పెట్టుకోవచ్చు అంటూ లక్షల్లో చీటింగ్.. పోలీసులకు సవాల్ విసురుతున్న మోసాలు

బ్యాంక్ పెట్టొచ్చు అంటూ భారీ మోసం

బ్యాంక్ పెట్టొచ్చు అంటూ భారీ మోసం

New online cheating: రోజు రోజుకూ ఆన్ లైన్ మోసాలు పెరుగుతున్నాయి. కొత్త కొత్త దారుల్లో ఆన్ లైన్ మాఫియా పోలీసులకు సవాల్ విసురుతున్నారు. తాజాగా బ్యాంక్ పెట్టొచ్చనే ఆశ చూపించి లక్షలు మాయం చేసిన కేసును పోలీసులు చేధించారు..

Andhra Pradesh Crime News:  ఆన్ లైన్  మోసం (Online Cheating) చేయడానికి కొత్త కొత్త దారులు వెతుకుతున్నారు. లోన్లు ఇస్తాం.. క్రెడిట్ కార్డు ఇస్తాం, ఉద్యోగాలిస్తాం, అధిక వడ్డీ ఇస్తాం అంటూ పలు మోసాలకు పాల్పడుతున్న వార్తలు నిత్యం చూస్తూ ఉంటాం..  కానీ ఇప్పుడు ఏకంగా పాన్ షాప్ పెట్టుకున్నంత ఈజీగా బ్యాంక్ పెట్టుకోవచ్చంటూ అమాయకులను బురిడీ కొట్టించి, ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతున్న బ్యాచ్ మోసాలు వెలుగులోకి వచ్చింది.  ఈ బ్యాచ్ చేస్తున్న ఆన్ లైన్ మోసాలను చూసి పోలీసులే షాక్ అవుతున్నారు. విజయనగరం (Vizianagaram) పోలీసులు ఈ ఆన్ లైన్ బ్యాచ్ మోసాలు బయటపెట్టింది. గుర్ల మండలం, ఇంటిపేట గ్రామానికి చెందిన కొల్లి సత్యారావుకు కొన్నాళ్లు క్రితం డిజిటల్ ఇండియా బ్యాంక్మ,  స్టేట్ బ్యాంక్  ఆఫ్ ఇండియా ఆధార్ కస్టమర్ సర్వీస్ పాయింట్లు ఇప్పిస్తామని కాల్ వచ్చింది.

అలా వచ్చిన కాల్ నమ్మిన  సత్యారావుకు ఎస్బీఐ సర్వీస్ పాయింట్ పెట్టుకుందామని భావించి కాల్ మాట్లాడాడు. తర్వాత సత్యారావు పలు దఫాలుగా మాట్లాడుతూ.. వాట్సప్ ద్వారా ఫేక్ డాక్యుమెంట్లు, ఫేక్ ట్రాకింగ్ ఐడిలు పంపించారు. తమకు డబ్బులు పంపమని చెప్పి, మోసం చేసి నిందితులు సుమారు 8 లక్షల రూపాయిలు తమ బ్యాంక్ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేయించుకొన్నారు. కొన్ని రోజులకు తాను మోసం పోయానని భావించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఆ కేసును విజయనగరం సైబర్ సెల్, విజయనగరం రూరల్ సర్కిల్ పోలీసులు చేధించారు. నిందితులను అరెస్టు చేసి వారి దగ్గర నుండి 30 సెల్ ఫోన్లను  8 లక్షల నగదు స్వాధీనం చేసుకొన్నారు.

ఇదీ చదవండి : ఏపీని వెంటాడుతున్న ముప్పు.. దూసుకొస్తున్న జవాద్‌.. 3 నుంచి 5 వరకు భారీ వర్షాలు

గుర్ల మండలం, ఇంటి పేట గ్రామానికి చెందిన కొల్లి సత్యారావు పాల వ్యాపారికి తొలిసారి ఈ ఏడాది జూన్ 22న ఒక అపరిచిత వ్యక్తుల నుండి కాల్ వచ్చింది. తాము డిటిజల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి కాల్ చేస్తున్నామని, ఎస్బీఐ తరపున కూడా పనిచేస్తున్నామని చెప్పారు. తాము మీ జిల్లాకు ఒక బ్యాంక్ సర్వీస్ పాయింట్ ఇస్తున్నామని, మీకు ఇంట్రస్ట్ ఉందా మీరు బ్యాంక్ పెట్టాలనుకుంటున్నారా ? సైబర్ నేరగాళ్లు నమ్మబలికారు.

ఇదీ చదవండి : ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోముకు చెక్ పెడుతున్నారా..? వైసీపీతో ఫ్రెండ్ షిప్పే కారణమా..

మీకు బ్యాంక్ పెట్టాలనుకుంటే ఒక ఏటీఎం, కస్టమర్ పాయింట్ ఇస్తామని, బ్యాంక్ ట్రాన్సాక్షన్ లు అన్నీ అందులో చేయవచ్చిని నమ్మించారు. అడ్రస్, ఇతర వివరాలు కనుక్కొని, దగ్గరలో ఉన్న గరివిడిలో .. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధార్ కస్టమర్ సర్వీసు పాయింట్ ద్వారా లావాదేవీలను చేయాల్సి వస్తుందని నమ్మించారు.

ఇదీ చదవండి : ఏపీ దిశ బిల్లుపై కొర్రీలు పెడుతోందా..? కేంద్ర మంత్రి ఏమన్నారంటే..?

వాట్సాప్ ద్వారా ఫేక్ డాక్యుమెంట్లు, ఫేక్ ట్రాకింగ్ ఐడిలు పంపి తమకు డబ్బులు పంపించమని చెప్పారు. దీంతో అంతా నిజమేనని నమ్మేసిన సత్యారావు.. బ్యాంక్ పెట్టేద్దామని భావించాడు. వారి మాటలు నమ్మి ఏటీఎం మెషీన్ సహా బ్యాంక్ ఎక్విప్మెంట్ కోసం దఫదఫాలుగా  7,79,773/-లు మొబైల్ బ్యాంకింగ్ ద్వారా, ఫోన్ పే ద్వారా పంపించారు. ఏటీఎం సహా ఎక్విప్మెంట్ వస్తుందని చాన్నాళ్లు ఎదురు చూసాడు. కొన్నాళ్లకు సత్యారావు తనను సదరు సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్నారని, తనకు మాయామాటలు చెప్పి డబ్బులు వేయించుకున్నారని తెలుసుకున్నాడు.

ఇదీ చదవండి : ఆ జిల్లాలో టీడీపీ దూకుడు.. అధికార పార్టీకి వరుస షాక్ లు

సైబర్ నేరగాళ్ల ఫోన్లు స్విఛాప్ రావడంతో..  వెంటనే గుర్ల పోలీసు స్టేషనులో రిపోర్టు చేసాడు. తనకు జరిగిందంతా వివరించాడు. దీంతో గుర్ల పోలీసులు సెప్టెంబర్ 6న కేసు నమోదు చేసి, దర్యాప్తు నిమిత్తం విజయనగరం సైబర్ సెల్ కు పంపించారు. కేసు పెద్దది కావడంతో.. విజయనగరం జిల్లా ఎస్పీ ఆదేశాలతో, విజయనగరం డిఎస్పీ అనిల్ కుమార్ పులిపాటి ఆధ్వర్యంలో సైబర్ సెల్, విజయనరగం రూరల్ సర్కిల్ సిబ్బందితో ఓ టీం ను ఏర్పాటు చేసారు. రంగంలోకి దిగిన సైబర్ సెల్ టీమ్..  సంబంధిత సెల్ ఫోన్ కంపెనీలకు, బ్యాంకులకు, వాలెట్ ప్రొవైడర్లకు సిడిఆర్, సిఎఎఫ్ల నుండి వచ్చిన వివరాలు ఆధారంగా నిందితుల వివరాలు తెలునుకున్నారు.

ఇదీ చదవండి : నేనే ప్రత్యక్ష సాక్షిని.. ఆ రోజు అసెంబ్లీలో ఏం జరిగిందంటే..? క్లారిటీ ఇచ్చిన స్పీకర్

నిందితులు ఎక్కడి నుండి కాల్ చేస్తూ, మోసాలకు పాల్పడ్డారో వివరాలు సేకరించి బీహార్ గ్యాంగ్ గా గుర్తించారు. సిఐ టి.ఎస్ మంగవేణి ఆధ్వర్యంలో నిందితులు ఉన్న బీహార్ స్టేట్, పాట్నా సిటీ, ధానాపూర్‌కు వెళ్లి అక్కడి పోలీసుల సహకారంతో నిందితులు నిర్వహిస్తున్న ఓ పెద్ద కాల్ సెంటర్ పై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఇదీ చదవండి : మొన్నటి వరకు ఢీ అంటే ఢీ అన్నారు.. తిట్టుకున్నారు.. తొడలుకొట్టుకున్నారు.. ఇప్పుడు చేయి చేయి కలిపారు

సత్యారావులా అమాయకులను మోసం చేసి తమ దందా పక్కాగా జరిగేందుకు కంప్యూటర్లు, పలు రాష్ట్రాలకు చెందిన యువకులతో ఉద్యోగులను పెట్టి ఓ పెద్ద కాల్ సెంటర్ నే నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. చాకచక్యంగా కాల్ సెంటర్ నిర్వాహకులైన రాహుల్, చందన్ లను అనే నిందితులను అరెస్టు చేశారు.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Andhra Pradesh, AP News

ఉత్తమ కథలు