Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH CRIME NEWS ONLINE APP CHEATING MORE THAN 30 LAKH RUPEES IN VIZIANAGARAM NGS VZM

Online App: 20 వేలు పెడితే.. 40 రోజుల్లోనే 65 వేల రూపాయలు.. ఇలాంటి యాప్ గురించి విన్నారా..?

ఆన్ లైన్ యాప్ చీటింగ్

ఆన్ లైన్ యాప్ చీటింగ్

Online app: మా యాప్ లో పెట్టుబడ్డి పెట్టండి ఊహించని లాభం అంటూ ప్రకటనలు కనిపించాయి. అది కూడా 20 వేలు ఒకసారి పెట్టుబడి పెడితే.. 40 రోజుల్లో 65 వేలు ఇస్తామన్నారు. దీంతో భారీగా అంతా ఆ యాప్ లో జారి అయ్యారు.. కానీ రెండు నెలల తరువాత ఏం జరిగిందో తెలుసా..?

ఇంకా చదవండి ...
  Online App Cheating:  ఇప్పుడు స్మార్ట్ ఫోన్ (Smartg Phone) లు అందరి చేతుల్లో ఉన్నాయి.. దీంతో అందరి అవసరాలకు తగ్గట్టే కొత్త కొత్త యాప్ (New App) లు పుట్టుకొస్తున్నాయి.  ఇదే కోవలో ఇటీవల ఉత్తరాంధ్రలో కొత్త యాప్ కనిపించింది. ఆ యాప్ ఇచ్చిన ఆఫర్ చూస్తే ఎవరైనా నోరు వెల్లబెట్టాల్సిందే.. ఎందుకంటే నెలకు 20 వేల రూాపాయలు పెట్టబడి పెడితే 60 ఇస్తామని ఆ యాప్ నిర్వహకులు బంపర్ ఆఫర్ (Bumper Offer) ప్రకటించారు. అబ్బ ఇంత టెప్టింగ్ ఆఫర్ ఇంకేమి ఉంటుందని చాలా మంది క్షణం ఆలస్యం చేయకుండా యాప్ లో చేరిపోయారు.. పెట్టుబడులు పెట్టారు.. అయితే కొన్ని రోజుల పాటు లాభాలు చూపించాడు.. కానీ తరువాతే అందరికీ షాక్ తగిలింది. విజయనగరం జిల్లా (Vizianagaram District)లో ఈ ఆన్ లైన్ యాప్ మోసం వెలుగులోకి వచ్చింది.   అమాయకులను నమ్మించి 25 లక్షల రూపాయాలు కాజేసిన ఈ యాప్ ను మోసాలకు.. విజయనగరం జిల్లాలోని సాలుగు మండలం మరిపల్లి గ్రామంలో కొందరు బలియ్యారు.

  ఆన్ లైన్ సంస్థ అయిన  కే.ఎన్.సీ చైన్ యాప్ మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మొదట 2 నెలలపాటు కొంతమందికి లాభాలను అందించిన యాప్ నిర్వాహకులు-అధిక మొత్తంలో వసూలయ్యాక  బోర్డు తిప్పేశారు.  అమాయకుల అత్యాశను ఆసరా చేసుకొని కేటుగాళ్లు ఇలా రెచ్చిపోయారు.  ఓ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని పెట్టుబడి పెడితే.. తక్కువ కాలంలో పది రెట్లు అవుతాయని నమ్మి బాధితులు భారీగా మోసపోయారు.  మొదట రెండు నెలలు కొంతమందికి లాభాలు అందించిన ఆన్ లైన్ సంస్థ అందిరిని ఆకర్షించేలా చేసింది. పెద్ద మొత్తంలో పెట్టుబడులు వచ్చాక యాప్‌ను మూసివేశారు నిర్వాహకులు.

  ఇదీ చదవండి : అది వన్ సైడ్ లవ్ కాదు.. టూ సైడ్ లవ్.. ఆ లవ్ స్టోరీకి ఆయనే డైరెక్టర్.. మంత్రి కీలక వ్యాఖ్యలు

  ఈ మోసంతో విజయనగరం జిల్లా వ్యాప్తంగా వందలాది బాధితులున్నారు. ఇలా మోసపోవడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. సాలూరు మండలంలోని మరిపల్లి పంచాయతీ గ్రామంలో కొందరు యువత గతేడాది నవంబరులో కేఎన్‌సీ చైన్‌ అనే యాప్‌‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ యాప్‌లో డబ్బులు జమ అవుతాయని బొబ్బిలిలో చదువుతున్న ఓ విద్యార్థికి ద్వారా తెలుసుకున్నారు. ఈ యాప్ ద్వారా నగదు జమ చేసి, డబ్బులు పెట్టుబడి పెడితే 48 రోజుల్లో 10 రెట్ల సొమ్ము అధికంగా వస్తుందని నమ్మబలికారు.

  ఇదీ చదవండి : సినిమా సమస్యలకు ఎండ్ కార్డ్ పడేనా.. రేపు మంత్రితో వర్మ భేటీ.. చర్చించే అంశాలు ఇవే..?

  గత ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో యాప్ లో పెట్టుబడి పెట్టిన డబ్బులతో లాభాలు రావడం, యాప్ కూడా బాగానే పని చేయడంతో చాలా మంది దీనిపై ఆసక్తి కనబర్చారు. దీంతో సాలూరు చుట్టూపక్కల ఈ యాప్‌ను వందలాది మంది డౌన్‌లోడ్ చేసుకుని పెట్టుబడి పెట్టారు. ఒక్క మరుపల్లి గ్రామంలోనే 25 లక్షల రూపాయల వరకూ పెట్టుబడి పెట్టారు గ్రామస్తులు. మొదట కొంతమందికి డబ్బులు రావడంతో .. తమకు కూడా లాభం వస్తుందని ఒకరి తరువాత ఒకరు పెట్టుబడులు పెట్టారు.

  ఇదీ చదవండి : చెట్టెక్కి కొడుతుండగా బావిలో పడ్డ కొబ్బరి బొండాలు.. వాటి కోసమని దిగితే ఊహించని షాక్..

  గత రెండు నెలల్లో ఇలా అమాయకుల పెట్టుబడుల ద్వారా భారీగా ఆదాయం రావడంతో ఈ నెల జనవరి 1 నుంచి ఈ యాప్ నిర్వాహకులు ప్రత్యేక ఆఫర్లు ఇవ్వడం మొదలుపెట్టారు. దీంతో కొంతమంది అమాయకులు అధిక మొత్తంలో నగదు జమ చేశారు. ఇలా పెద్దమొత్తంలో పెట్టుబడుల ద్వారా లక్షల రూపాయలను జమ చేసుకున్న సంస్ధ.. ఒక్కసారిగా ..ఆ యాప్ నిర్వాహకులు బోర్డు తిప్పేసారు. కంపెనీ నుంచి ఎటువంటి నగదు తమ ఖాతాల్లో జమ కాకపోవడం, యాప్ పని చేయకపోవడంతో తాము మోసపోయామని బాధితులు గుర్తించారు.

  ఇదీ చదవండి : కోనసీమలో ముందే వచ్చిన సంక్రాంతి సందడి.. లంగావోణీల్లో మెరిసిన అమ్మాయిలు..

  ఇలాంటి మోసాలపై జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు.  లాభాలు వస్తాయని చెప్పి.. ఆశ చూపించే యాప్ లలో పెట్టుబడులు పెట్టడం, ఓటీపీ నెంబర్లు ఇవ్వడం, తర్వాత మోసపోవడం లాంటి కేసులు పెద్దఎత్తున జరుగుతున్నాయని.. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Crime news, Online fraud, Vizianagaram

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు