ANDHRA PRADESH CRIME NEWS ONE YOUNG MAN SELFIE SUICIDE IN EAST GODAVARI DISTRICT BECAUSE OF LOVE FAILURE NGS VSP
Selfie Suicide: ప్రేమ అంటే అన్నీ ఇచ్చా కానీ.. మనస్థాపంతో యువకుడు సెల్ఫీ సూసైడ్
ప్రియురాలు మోసం చేసింది అంటూ సెల్ఫీ సూసైడ్ (ప్రతీకాత్మక చిత్రం)
Selfie Suicide: ప్రేమ.. కొటేషన్ల వరకు బాగానే ఉంటోంది.. కానీ నిజజీవితానికి వచ్చేసిరికి ఎందరో ప్రాణాలను తీసుకుంటోంది. ప్రేమ పేరుతో మోసపోయామని కొందరు ఉన్మాదులుగా మారుతున్నారు.. ప్రేమ తిరస్కరించిందనే కారణంతో ప్రాణాలు సైతం తీస్తున్నారు.. మరికొందరు ప్రేమ పేరుతో మోసపోయాం అంటూ.. ప్రాణాలు తీసుకుంటున్నారు.
P Anand Mohan, Visakhapatnam, News18. selfie suicide in Andhra Pradesh: ప్రేమ.. ఇది ఎంతో అద్భుతమైన ఫీలింగ్.. ప్రేమ (love)లో ఉన్నప్పుడు ఎవరికీ ఏదీ గుర్తు ఉండదు.. ఆ ఆనందాన్ని సైతం మాటల్లో వర్ణించలేరు.. ముఖ్యంగా యువత ప్రేమ కోసం ఏదైనా అనే స్థాయిలో ఉంటారు. అమ్మాయి-అబ్బాయి ఇద్దరు ప్రేమలో ఉన్నంత వరకు.. వారి మధ్య మనస్పర్ధలు రానంత వరకు వారి అనందానికి హద్దులే ఉండవు.. కానీ ఒక్కసారి అమ్మాయి తిరస్కరించినా.. అబ్బాయి దూరం పెట్టినా.. ఇద్దరి మధ్య చిన్న మనస్పర్థలు వచ్చినా.. అంతే ప్రేమకు అర్థాన్నే మార్చేస్తున్నారు కొందరు.. చిన్న చిన్న కారణాలతో అంటే.. అమ్మాయి ప్రేమను తిరస్కరించింది (Love Failure) అని కొందరు.. ప్రేమ పెళ్లి (Love marriage)కి ఇంట్లో వాళ్లు ఒప్పుకోవడం లేదని కొందరు.. ప్రేమ పేరుతో మోసం వేరే వాళ్లతో ఉంటోందని మరికొందరు.. ఇలా చిన్న చిన్న కారణాలతో తమ ప్రేమ విఫలమైందని ఉన్మాదులుగా మారుతు హత్యలు చేస్తున్నారు. మరికొందరు అయితే ప్రేమ పేరుతో మోసపోయాను అంటూ ఆతహత్య (Suicide)లకు పాల్పడుతున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా (East Godavari District) మాగంకొప్పిశెట్టివారి పాలెంలో విషాదం ఘటన జరిగింది. అమ్మాయి మోసం చేసిందంటూ ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తాను ప్రేమ పేరుతో ఓ అమ్మాయి చేతిలో మోసపోయాను అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె తనతో సన్నిహితంగా ఉన్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి.. తన ఆవేదన అందరికీ తెలియచేయాలని అనుకుంటున్నా అంటూ సెల్ఫీ వీడియో పెట్టాడు. ప్రేమ పేరుతో అమ్మాయికి భారీగా డబ్బులు, బంగారం ఇచ్చానని.. కానీ ఆ అమ్మాయి తనన పూర్తిగా వాడుకుని.. ఇప్పుడు మోసం చేసిందని.. తన అవసరం తీరిపోయాక... మరో పెళ్లి చేసుకుంటుందంటూ ఆ యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీడియోలో ఉన్న అమ్మాయి.. నన్ను చాలా విధాలుగా మోసం చేసింది. అందుకే తాను చచ్చిపోతున్నా.. అంటూ వీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ యువకుడు గత కొంతకాలంగా ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు. ఆమెకూడా చనువుగానే ఉండడంతో ఆమెకు చాలా గిఫ్ట్స్ ఇచ్చాడు. బ్బు ఇచ్చాడు. బంగారం, దుస్తులు అన్నీ కొనిపెట్టాడు. తనకు కాబోయే భార్యే కదా అని ఇవన్నీ చేశాను అన్నాడు. కానీ ఆ యువతి మాత్రం హ్యాండ్ ఇచ్చిందని.. ఇద్దరికీ సెట్ అవ్వదని.. గుడ్ బై చేప్పేసిందని.. తనను కలిసేందుకు కూడా ఇష్టపడడం లేదని తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. తనతో మాట మాత్రం చెుప్ప్కుండా మరొకరితో పెళ్లి ఫిక్సయ్యిందని.. డిస్టబ్ చేయొద్దంటూ సైడయిపోయిందంటూ తన సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. తన బాధను ఎవరితో పంచుకోవాలో తెలియడం లేదని.. ఇక చావే శరణ్యమనుకున్నా అంటూ ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి.. అందులో ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు షేర్ చేశాడు. అమ్మాయి మోసం చేసినందుకే చనిపోతున్నా అంటూ సెల్ఫ్ వీడియోలో తీసి.. ఉరి వేసుకున్నాడు. కాగా గతంలోనే ఈ యువకుడికి పెళ్ళైనట్టు, భార్యతో విడిపోయినట్టు స్థానికులు చెబుతున్నారు.
ఇదీ చదవండి : టీడీపీ చీర్ బాయ్స్ అమెరికా అధ్యక్షుడికి ఫిర్యాదు చేస్తారా..? ఆ ఇద్దరికీ భారత రత్న ఇవ్వాలన్న మంత్రి
ఇటీవల ఇలాంగటి ఘటనలు పెరుగుతూ వస్తున్నాయి. ప్రేమో, ఆకర్షణో వారికి తెలియడం లేదు. ఇష్టపడ్డవారు దక్కలేదన్న మనస్తాపంతో యువత నిండు జీవితాలను బలి చేసుకుంటోంది. బంగారం లాంటి భవిష్యత్ ను పతికేళ్లైనా నిండకుముందే ముగించేసుకుంటోంది. తల్లిదండ్రుల ప్రేమ కన్నా ఏ ప్రేమ గొప్పది కాదన్న సత్యాన్ని యువత గ్రహించలేకపోతోంది. ఇప్పటివరకు తనపైనా ప్రాణాలు పెట్టుకుని పెంచుకున్న తల్లిదండ్రులు.. నిత్యం అన్ని విషయాల్లో వెంట నిలిచిన స్నేహితుల ప్రేమ వారికి గుర్తు రావడం లేదు. అందరికీ కన్నీళ్లే మిగులుస్తున్నారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.