Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH CRIME NEWS ONE YOUNG GIRL AND ONE YOUNG MAN END THIER LIFE VERY SMALL REASONS IN SRIKAKULAM NGS VZM

Crime News: ఫోన్ లో ముచ్చట్లు వద్దని వారించిన తల్లిదండ్రులు.. ఆ కూతురు ఏం చేసిందంటే..?

శ్రీకాకుళం విషాదం

శ్రీకాకుళం విషాదం

Crime News: యువత చాలా సెన్సిటివీగా మారుతున్నారు. స్మార్ ఫోన్, సోషల్ మీడియాల ప్రభావం వారిపై ఎక్కువగా ఉంటోంది. చిన్న చిన్న కారణాలకే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ఓ బాలిక తల్లిదండ్రులు మందలించారనే కారణంతో ఊహించని నిర్ణయం తీసుకుంది.

ఇంకా చదవండి ...
    Crime News:  ఇటీవల చిన్న చిన్న కారణాలు యువత అతి పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా మైనర్లు, విద్యార్థులు (Students) సైతం తల్లి దండ్రులకు కన్నీరు మిగిల్చేలా చేస్తున్నారు. తాజాగా  శ్రీకాకుళం జిల్లా (Srikakulam District)లో ఇద్దరు విద్యార్దులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. తల్లిదండ్రులు మందలించారని ఒక విద్యార్ధిని తన ప్రాణాలు తీసుకుంటే.. తల్లిదండ్రులు ప్రతీ రోజూ గొడవలు పడుతున్నారని మనస్తాపానికి గురై మరో విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  ఇంటి స్నేహితుల (Friends)ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి బయలుదేరిన 17 ఏళ్ల  శ్రావణి.. ఆటోలో మడ్డువలస బ్రిడ్జి వద్దకు చేరుకొని కాసేపటి తర్వాత నదిలోకి దూకి ఈ అఘాయిత్యానికి పాల్పడింది. ఇక మరో విద్యార్ధి 24 ఏళ్ల దుర్గాప్రసాద్  తన తల్లిదండ్రులు రోజూ గొడవలు పడుతున్నారని మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య (Suicide)కు పాల్పడ్డాడు. ఇలా ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులు (Parents) మందలించారనో, గొడవలు పడుతున్నారన్న చిన్నచిన్న కారణాల కారణంగా ఆత్మహత్యలకు పాల్పడి తల్లిదండ్రులకు విషాదాన్ని మిగుల్చుతున్నారు.

    శ్రీకాకుళం జిల్లా వంగర మండల పరిధి కొప్పర పంచాయతీ కె.కొత్తవలస గ్రామానికి చెందిన విద్యార్థిని గొట్టిపల్లి శ్రావణి మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టు సమీపంలో వంగర-రాజాం రోడ్డులో ఉన్న వంతెన పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. నిరుపేద కుటుంబమైన.. శ్రావణి తల్లిదండ్రులు గొట్టిపల్లి అప్పలరాజు, చిట్టెమ్మలు కొన్నేళ్ల కిందట విజయవాడకు వలస వెళ్లారు. కొత్తవలస గ్రామానికి చెందిన శ్రావణి తల్లిదండ్రులు బతుకు తెరువు కోసం .. విజయవాడ నగరానికి వలస వెళ్లిపోవడంతో అక్కడే తల్లిదండ్రులతో పాటూ ఉంటూ.. పటమట రోడ్డులో ఉన్న శ్రీనివాస హైస్కూల్‌ లో పదో తరగతి చదువుతోంది. ఇటీవలే సంక్రాంతి కావడంతో సొంతూరు వచ్చిన వీరు.. మరో రెండు రోజుల్లో తిరిగి వెళ్లేందుకు సిద్దమవుతున్నారు.

    ఇటీ చదవండి : వెలుగులోకి వైసీపీ నాయకురాలి హనీ ట్రాప్ వ్యవహారం.. కాల్పుల ఘటనలో సంచలన విషయాలు

    ఆత్మహత్యకు రెండు రోజుల ముందు .. సెల్ ఫోన్ లో ఎక్కువగా మాట్లాడుతున్నావని, 10 వ తరగతి పరీక్షలు దగ్గర పడుతున్నా.. సరిగ్గా చదవడం లేదని తల్లిదండ్రులు శ్రావణిని మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన శ్రావణి శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో.. తన స్నేహితురాలి ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి బయల్ధేరిన శ్రావణి.. వంగర వచ్చి అక్కడి నుండి ఆటోలో మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టు సమీపంలో వంగర-రాజాం రోడ్డులో ఉన్న వంతెన వద్దకు చేరుకుంది. అక్కడే కాసేపు ఉన్న శ్రావణి.. కాసేపటి తర్వాత అందరూ చూస్తుండగానే.. బ్రిడ్జి పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే స్థానిక మత్స్యకారులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. రాజాం అగ్నిమాపక శకటం సిబ్బందికి సమాచారం అందించి మృతదేహాన్ని వెలికి తీశారు.

    ఇటీ చదవండి : ఏపీలో నిలిచిపోనున్న బస్సులు.. సమ్మెకు సై అన్న యూనియన్లు.. ఎప్పటినుంచి అంటే..?

    శ్రీకాకుళం జిల్లాలో మరో విద్యార్ధి కూడా పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రతి రోజూ తల్లిదండ్రులు గొడవలు పడుతుండడంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు వివరాల మేరకు..  రావివలసకు చెందిన సిరిగిడి నారాయణప్పారావు మద్యానికి బానిసగా మారి తరచూ భార్య పద్మావతితో గొడవ పుడుతుంటాడు.  దీంతో మనస్తాపానికి గురైన వారి కుమారుడు దుర్గాప్రసాద్  పురుగుల  మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది గుర్తించిన తండ్రి నారాయణప్పారావు కూడా ఇంటి వద్ద వ్యవసాయం కోసమని తెచ్చిన పురుగుల మందు తాగాడు.  వీరిద్దరిని బంధువులు చికిత్స నిమిత్తం 108 ఆంబులెన్స్ లో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. వీరిలో దుర్గాప్రసాద్‌ పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం 20న విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ  మృతి చెందాడు. కాగా.. నారాయణప్పారావు ఆరోగ్యపరిస్థితి మాత్రం మెరుగుపడింది. ఇతని ఇద్దరు కుమారుల్లో ఆత్మహత్యకు పాల్పడిన దుర్గాప్రసాద్‌ ఒకరు కాగా.. మరో కుమారుడు దివ్యాంగుడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Nagabushan Paina
    First published:

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు