ANDHRA PRADESH CRIME NEWS ONE RI SUICIDE SHOOT HIS OWN GUN AT POLICE QUARTERS IN VIZIANGARAM NGS VZM
Andhra pradesh: అధికారుల వేధింపులా..? వ్యక్తిగత కారణాలా..? పోలీస్ క్వార్టర్ట్స్ లో ఆర్ఐ ఆత్మహత్య..
ఆర్ఐ ఆత్మహత్య
Andhra Pradesh: పోలీస్ శాఖలో మరో విషాదం నెలకొంది. హోమ్ గార్డ్స్ వింగ్ చూసే ఆర్ ఐ ఆత్మహత్య కలకలం రేపింది. సర్వీస్ రివాల్వర్ తో రెండు రౌండ్లు కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతడి ఆత్మహత్యకు ఉన్నతాధికారుల వేధింపులా..? లేక వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయా అన్నది తెలియాల్సి ఉంది.
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పోలీసులు ఆత్మహత్య సంఘటలు పెరగడం ఆందోళన పెంచుతోంది. ఎవరైనా ఆత్మహత్య (Suicide) కు పాల్పడుతున్నారని తెలిస్తే.. వారి ప్రయత్నం విరమించి ధైర్యం చెప్సాల్సిన పోలీసులే ఇలా బలవన్మరణానికి పాల్పడుతుండడంత కలకలం రేపుతోంది. తాజాగా విజయనగరం (Vizianagaram)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. జిల్లా పోలీసు శాఖలో హోమ్గార్డ్స్ (Home guards) విభాగం చూసే ఆర్ఐ ఈశ్వరరావు (RI Eswararao) ఆత్మహత్య చేసుకున్నారు. ఆతడు నివాసం ఉంటున్న పోలీసు క్వార్టర్స్ లో తన సర్వీసు రివాల్వర్ తో రెండు రౌండ్లు కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే ఈశ్వరరావు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారనే దానిపై రకరకాల వాధనలు వినిపిస్తున్నాయి.
అధికారుల వేధింపులే కారణమని కొందరు.. కాదు ఆయనకు వ్యక్తిగత సమస్యలు ఉన్నాయని మరికొందరు చెబుతున్నారు. అయితే పూర్తి స్థాయి విచారణ తరువాతే ఆత్మహత్యకు అసలు కారణాలు తెలిసే అవకాశం ఉంది. ఆయన మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్య విషయం తెలిసినా వెంటనే జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ హుటాహుటిన ఆసుపత్రికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. ఆత్మహత్య కు కారణం ఏమై ఉంటుందా అన్నదానిపై సన్నిహితులతో మాట్లాడారు. అలాగే కుటుంబ సభ్యులకు పోలీస్ డిపార్టు మెంట్ తరపున అన్ని విధాల సాయంగా ఉండాలని సూచించారు.
ఈశ్వరరావు 2009 లో ఆర్ఎస్ఐ గా జాయిన్ అయ్యారు. 2019 లో కాకినాడ నుంచి విజయనగరం లో ఆర్ ఐ గా పోస్టింగ్ వచ్చింది.
ఆర్ఐ ఆత్మహత్యతో ఆయన స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని వెదురుపాక సావరం గ్రామం,
రామాలయం వీధిలో విషాద చాయలు అలముకున్నాయి.
ఇదే జిల్లాల్లో కొన్ని రోజుల క్రితం ఓ మహిళా ఎస్సై ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపింది. శిక్షణ నిమిత్తం వచ్చిన ఆమె బలవన్మరణానికి పాల్పడడం కలకలం రేపింది. శిక్షణ పూర్తయి.. మరుచటి రోజు ఇంటికి బయలుదేరాల్సిన సమయంలో ఆమె ఆత్మహత్కు పాల్పింది. ది. 2018 బ్యాచ్‌కి చెందిన ఎస్సై భవానీకి అంతకుముందే తూర్పు గోదావరి జిల్లాలోని సఖినేటిపల్లిలో అడిషనల్ ఎస్సైగా మొదటి పోస్టింగ్ వచ్చింది. రాజోలు పోలీస్ స్టేషన్లో ట్రైనింగ్ తరువాత.. ఆమెకు ఈ పోస్టింగ్ లభించింది. ఎస్సైగా నియమించబడటంతో.. క్రైమ్ శిక్షణ నిమిత్తం ఆమె ఐదు రోజుల క్రితం విజయనగరంలోని పీటీసీకి వచ్చిన ఆమె.. తిరిగి సఖినేటిపల్లి వెళ్లాల్సి ఉంది. కానీ ఇంతలోనే ఆమె హాస్టల్ గదిలోని ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయారు. ఆ ఘటన పూర్తిగా మరిచిపోకముందే.. ఇప్పుడు ఆర్ ఐ ఆత్మహత్య కలకలం రేపుతోంది.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.