ANDHRA PRADESH CRIME NEWS ONE POKIRI ATTACKED WITH KNIFE ON B PHARMACY STUDENT AT VIZIANGARAM NGS VZM
AP Crimenews: రెచ్చిపోతున్న పోకిరీలు.. బీ ఫార్మసీ విద్యార్థిపై కత్తితో దాడి
విద్యార్థిపై కత్తితో దాడి
AP Crime News: ఆంధ్రప్రదేశ్ లో పోకిరీల ఆగడాలు పెరిగిపోతున్నాయి.. తోటి విద్యార్థిని ఎందుకు ఏడిపిస్తున్నావ్ అని అడిగిన పాపానికి ఓ భి ఫార్మసీ విద్యార్థిని కత్తితో పోడిచాడు పోకిరి.. దీంతో ప్రస్తుతం ఆ కాలేజీకి వెళ్లాలి అంటేనే విద్యార్థులు భయపడుతున్నారు.
Knife attack on Student: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో పోకిరీల బెడద రోజు రోజుకూ పెరుగుతోంది. తాజాగా విద్యార్ధినులను ఎందుకు ఏడిపిస్తున్నావని అడిగిన పాపానికి ఏకంగా ఓ విద్యార్ధిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు ఓ దుండగుడు. కాలేజీ విద్యార్ధినుల (College Students)ను ఎందుకు ఏడిపిస్తున్నావని అడిగారన్న కోపంతో.. విద్యార్ధులు, ఉపాధ్యాయులు ఆపుతున్నా .. స్నేహితుడితో కలసి తాగిన మైకంలో గొడవపడి ఏకంగా కత్తితో దాడికి పాల్పడి అక్కడినుండి బైక్ పై పరారయ్యాడు ఓ పోకిరీ. గాయపడిన విద్యార్ధి ప్రస్తుతం విజయనగరం జిల్లా (Vizianagaram District) కేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పిరిడి గ్రామంలో ఉన్న గోకుల్ ఇంజనీరింగ్ కాలేజి విద్యార్థిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు ముత్తాయవలసకి చెందిన యువకుడు.
సోమవారం సాయంత్రం గోకుల్ ఇంజనీరింగ్ కాలేజీలోని బీ.ఫార్మసీ (B Pharmcy) విభాగానికి చెందిన విద్యార్ధులు క్లాసులు అయిపోయాక బయటకు వచ్చారు. ఇద్దరు విద్యార్ధినులు కాలేజీ అయిపోయాక , ఇంటికి వెళ్లేందుకు కాలేజీ పక్కనే ఉన్న బస్టాప్ వద్దకు నడుచుకుంటూ వెళ్లారు. ఇంతలో కాలేజీ పక్కనే ఉన్న ముత్తాయవలస గ్రామానికి చెందిన రాజేష్ అనే యువకుడు తన స్నేహితుడితో కలిసి .. అదే రోడ్డుపై వెళ్తూ విద్యార్ధినులను ఏడిపించడం మొదలుపెట్టాడు. అసభ్యకరమైన కామెంట్లు చేస్తూ.. టీజ్ చేయడం మొదలుపెట్టాడు.
ఆ పోకిరీపై కాలేజీ ప్రిన్సిపల్ కు, ఉపాధ్యాయులకు, విద్యార్ధులకు ఆ విద్యార్థినిలు ఫిర్యాదుచేసారు. దీంతో అక్కడికి చేరుకున్న విద్యార్ధులు, ఉపాధ్యాయులు.. రాజేష్ ను, అతని స్నేహితుడిని అమ్మాయిలను ఎందుకు ఎడిపిస్తున్నారు అని నిలదీసారు. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్ధులతో గొడవకు దిగాడు రాజేష్. ఏం చేసుకుంటారో చేసుకోండంటూ.. తిరగబడ్డాడు. దీంతో విద్యార్ధులు రాజేష్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిలదీయడంతో.. తన వద్ద ఉన్న కత్తితో దాడి చేశాడు.
ముత్తాయవలసకి చెందిన రాజేష్.. ఇలా ఏడిపించడం తొలిసారి కాదని.. ఎన్నిసార్లు హెచ్చరించినా వినడం లేదని.. అందకే ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని చెబుతున్నారు విద్యార్థినులు. ఇలాంటి పోకిరీల వల్ల కాలేజీకి రావాలంటేనే భయమెస్తోందని ఆందోళన చెందుతున్నారు. రాజేష్ లాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
గాయాలైన విద్యార్థిని మొదట బొబ్బిలిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు తోటి విద్యార్ధులు. ప్రస్తుతం ఎలాంటి ప్రాణాపాయం లేదని, కత్తిపోట్లు లోతుగా ఉన్నందున మెరుగైన వైద్యం కొరకు విజయనగరం రిఫర్ చేసినట్టు వైద్యులు తెలిపారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజేష్ గురించి ఆరా తీశారు. ఆ యువకుడు రోజూ పలు చోట్ల విద్యార్థులను ఏడిపిస్తున్నట్టు గుర్తించారు. ఇప్పుడు అడ్డుకున్న విద్యార్థిపై పై దాడికి కూడా ప్రయత్నించాడని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేస్ నమోదు దర్యాప్తు చేస్తున్నామన్నారు పోలీసులు..
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.