Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH CRIME NEWS ONE MARRIED WOMAN LIVING RELATION WITH ANOTHER PERSON THEN SON KNOW THAT ISSUE NGS GNT

Extramarital Affair: కొడుకు కళ్ల ముందే ఇష్టం లేని వ్యవహారం.. చివరికి ఏం జరిగిదంటే..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Extramarital Affair: వయసుకొచ్చిన కొడుకు ఇంట్లోనే ఉన్నాడు.. హ్యాపీగా కొడకును చూసుకుంటూ జీవించాల్సిన ఆ తల్లి.. తనకు ఓ తోడు కావాలి అనుకుంది. తనయుడు అడ్డు పడినా తన వ్యవహారం కొనసాగిచింది.. దీంతో ఆ కొడుకు ఏం చేశాడంటే..?

  Anna Raghu, Guntur, News18.

  Extramarital Affair:   కోరికలను అదుపు చేసుకోలేక చేసిన చిన్న తప్పులు.. జీవితాలను బలి తీసుకుంటున్నాయి. ముఖ్యంగా  ఈ రోజుల్లో సహజీవనం చాలా కామన్ గా మారిపోయింది. పెళ్లి అయ్యి.. కాపురం చేసుకుంటున్న వాళ్లు కూడా.. భర్త లేదా భార్యకు తెలియకుండా పరాయి వ్యామోహంలో పడుతున్నారు.. ఇక పెళ్లి కాని వారు.. పెళ్లూ భార్యో, భర్త చనిపోయిన వారు.. లేదంటే విడాకులు ఇచ్చిన వారు.. ఒంటరిగా ఉండకుండా వారికి ఒక తోడు కావాలి అనుకుంటున్నారు. సహజీవనాన్ని కోరుకుంటున్నారు. ఇందులో చాలా వరకు సమస్యలే తప్ప.. సంతోషం తక్కువగా కనిపిస్తోంది. క్షణకాలం సుఖం కోసం అంతా ఈ సహజీవనాలకు అలవాటు పడుతున్నట్టు ఉన్నారు. కొన్ని సంఘటనలు అయితే జీవితాలనే బలి తీసుకుంటున్నాయి. తాజాగా విజయవాడలో  దారుణం చోటు చేసుకుంది. భర్త చనిపోవటం తో మరొక వ్యక్తి తో సహజీవనం చేస్తోంది ఇందిర అనే మహిళ..

  ఆ విషయం నచ్చని కొడుకు రోజు తల్లితో గొడవ పడేవాడు.  తన కళ్ల ముందే జరుగుతున్న తల్లి వ్యవహారం ఆ కొడుక్కి నచ్చలేదు. దీంతో నిత్యం గొడవలు జరుగుతుండేవి. తల్లికి నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా ఆమె మారలేదు.  మరోవైపు ఆమెతో సహజీవనం చేస్తున్నా రాజాపై కోపం పెంచుకున్నాడు కొడుకు వంశీ..  ఆ కోపం కసిగా మారింది. చివరి ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయిన వంశీ.. రాజాను కిరాతకంగా హతమార్చాడు..

  ఇదీ చదవండి: ఏపీలో పెరుగుతున్న కంటెయిన్​మెంట్ జోన్లు.. ఆ జిల్లాల్లో ఒమిక్రాన్ కలకలం.. కొత్తగా ఎన్నికేసులంటే..?

  పోలీసులు, స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. వియవాడకు చెందిన ఎలీసాల ఇందిరాకు పెళ్లి అయి ఒక కుమారుడు వంశి ఉన్నారు. కొంత కాలానికి భర్త చనిపోవటం తో తాడేపల్లికి మకాం మార్చింది.. అక్కడ ఇందిరా తనకు ఒక తోడు కోరుకుంది దాని కోసం విజయవాడ చుట్టుగుంట్ల కు చెందిన కట్టా రాజా తో సహజీవనం చేయడం ప్రారంభించింది.

  ఇదీ చదవండి: సినిమా టికెట్ల వివాదంలో ట్విస్ట్.. వర్మకు మంత్రి పేర్ని నాని అపాయింట్‌మెంట్

  రాజాకు అంతకు ముందే పెళ్లి అయ్యింది.  ఐతే వీరి సహజీవనం గత ఆరునెలల నుండి కొనసాగుతుంది.. ఈ వ్యవహారమంతా తనకు తెలిసే జరుగుతుండడంతో కొడుకు తీవ్ర ఆవేదన చెందేవాడు.  అప్పుడప్పుడు ఇందిరా కొడుకు వంశి తో రాజా కు ఘర్షణలు జరుగుతుండేవి. గత నెల 26 వ తేదీ  రాత్రి సమయంలో ఇంట్లో మద్యం సేవిస్తున్న రాజా తో వంశి ఘర్షణ కు దిగాడు. ఈ ఘర్షణ లో ఇద్దరు ఇంట్లో ని వస్తువులు ఒకరి పై ఒకరు విసురుకున్నారు దింతో కోపోద్రిక్తుడైన వంశి కత్తి తో దాడి చేయగా తీవ్ర గాయాలైన రాజా ను విజయవాడ లోని ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు .చికిత్స పొందుతూ రాజా మరణించాడు.

  ఇదీ చదవండి:మరిదిపై మనసు పడ్డ వదిన.. రోజూ అర్థరాత్రి వరకు అదేపని.. భర్తకు తెలియడంతో ఏం చేసిందంటే?

  రాజా మృత దేహాన్ని భార్యకు అందచేయకుండా  తనకు  కావాలని పట్టుబట్టింది ఇందిర.. ఆ మృత దేహాన్ని  తాడేపల్లి  తీసుకెళ్లి..  తన కొడుకు తో అంత్యక్రియలు నిర్వహించింది ఇందిర..  తన కుమారుడిని కాపాడేందుకు  రాజా బందువులకు ప్రమాద వశాత్తు మృతి చెందాడని నమ్మించింది. కానీ పోలీసుల విచారణలో పొంతనలేని సమాధానాలు చెప్పడంతో..  అసలు విషయం వెలుగులోకి వచ్చింది.  దీంతోతల్లీ కొడుకులను అరెస్ట్ చేశారు.. 
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Crime news, Vijayawada

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు