ANDHRA PRADESH CRIME NEWS ONE MAN TRING TO KILLING ONE WOMAN FOR SHE SAID NO TIFFEN NGS VZM
AP Crime: టిఫిన్ అడిగితే ఆ మహిళ లేదని చెప్పింది.. ఆ వ్యక్తి ఏం చేశాడంటే..?
టిఫిన్ లేదన్నందుకు కత్తిదాడి
AP Crmine News: సాధారణంగా టైం కాని సమయంలో వెళ్తే ఏ హోటల్ లో అయినా టిఫిన్ అయిపోయింది అనే సమాధానం వస్తుంది. అయితే ఏం చేయగలం.. బ్యాడ్ లక్ అనుకొని వెనక్కు వచ్చేస్తాం.. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఓ వ్యక్తి ఏం చేశాడో తెలుసా..?
AP Crime News: సాధారణంగా ఎక్కడైనా హోటల్ (Hotel) లో టిఫిన్ లేదని చెబితే ఏం చేస్తాం.. మరో షాపుకు వెళ్తాం.. అక్కడ కూడా లేదంటే.. ప్రత్యామ్నయంగా ఏది దొరికితే అది తింటాం.. కానీ ఓ వ్యక్తి చేసిన పని తెలిస్తే షాక్ తింటారు.. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..శ్రీకాకుళం జిల్లా (Srikakulam District)లోని తూముకొండ ప్రధాన రహదారిపై బురిడి సుందరమ్మ టిఫిన్ సెంటర్ (Tiffen Center) నడుపుతోంది. ఉదయం పది గంటల సమయంలో టిఫిన్ కోసం, దిమ్మిడిజోల గ్రామానికి చెందిన సరియాపల్లి అప్పారావు అనే వ్యక్తి వచ్చాడు. అప్పటికే పది గంటలు కావడం, అప్పారావు తాగిన మైకంలో ఉండడాన్ని గమనించిన సుందరమ్మ.. టిఫిన్ అయిపోయిందని చెప్పి తన పని తాను చేసుకుంటోంది. షాపులోని సామన్లు సర్దుకోవడం, డబ్బులు లెక్కపెట్టుకోవడం లాంటి పనులు చేసుకుంటోంది.
టిఫిన్ ఉండి కూడా సుందరమ్మ లేదని చెబుతోందని.. కోపంతో రగిలిపోయాడు. టిఫిన్ లేదని చెబుతావా అంటూ రెచ్చిపోయాడు. అప్పటికే పీకల దాకా మద్యం తాగిన అతడి పూర్తి మత్తులో ఉన్నాడు. ఆమె టిఫిన్ లేదని చెప్పడానికి జీర్ణించుకోలేకపోయాడు. తీవ్ర ఆవేశానికి లోనై.. మద్యం మత్తులో కత్తితో దాడి చేసి హత్య చేసేందుకు ప్రయత్నించాడు నందిగాం మండలం దిమ్మిడిజోల గ్రామానికి చెందిన సరియాపల్లి అప్పారావు.
ఈ ఘటన మెళియాపుట్టి మండలం పరశురాంపురం పంచాయతీ తూముకొండ రామచంద్రాపురం గ్రామంలో చోటు చేసుకుంది. తాగిన మత్తులో ఉన్నాడని.. తిన్ని తరువాత డబ్బులు ఇస్తాడో ఇవ్వడో అనే భయంతో ఆమె అతడికి టిఫిన్ పెట్టడానికి తిరస్కరించింది. కానీ అతడు ఇలా రాక్షసిలా ప్రవర్తిస్తాడని ఊహించలేకపోయింది. తాగిన మైకంలో అప్పరావు కత్తితో విచక్షణా రహితంగా దాడి చేస్తుంటే ఆమె తప్పించుకునే ప్రయత్నం చేసింది. కానీ అప్పటికే ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం సుందరమ్మ తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
కత్తితో మొహం మీద, శరీరం మీద దాడి చేయడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే సొమ్మసిల్లిపోయింది. ఇంతలో అపస్మాకర స్ధితిలో రక్తపుమడుగులో ఉన్న సుందరమ్మ చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు, 108కు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు .. 108 సిబ్బంది, సుందరమ్మను టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అందించిన వైద్యులు.. తీవ్రగాయాలు కావడంతో, మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.
టెక్కలి సీఐ ఎం.వినోద్‌బాబు, ఎస్ఐ సందీప్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని జరిగిన ఘటనపై ఆరా తీశారు. క్లూస్ టీం చేరుకుని నిందితుడు అప్పారావు దాడి చేసిన కత్తిని స్వాధీనం చేకున్నారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే నిందితుడుని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.