Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH CRIME NEWS ONE MAN KILLED HIS WIFE AND SISTER AFTER HE COMMITED END HIS LIFE NGS VZM

AP Crime News: ఏపీలో దారుణం.. భార్య, అత్త హత్య.. ఆత్మహత్య చేసుకున్న ఉన్మాది

మద్యం మత్తులో దారుణం

మద్యం మత్తులో దారుణం

Andhra Pradesh Crime News: నిత్యం మద్యం తాగి గొడవలు పడొద్దని చెప్పడమే వారి పాపం అయ్యింది. ఆవేశంతో రగిలిపోయిన ఓ మందుబాబు ఉన్మాదిలా మారాడు. తనకు బుద్ధి చెప్పేందుకు ప్రయత్నించి,, భార్, సోదరని అతి కిరాతకంగా హత్య చేశారు. తరువాత అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఇంకా చదవండి ...
    Man killed his wife and sister:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో దారుణం చోటు చేసుకుంది. నిత్యం మద్యం తాగి గొడవలు పడొద్దని వారించడమే వారి తప్పైంది.. తనను నిలదీయడంతో ఆవేశానికి గురైన ఓ మందుబాబు ఉన్మాదిలా మారాడు.. మద్యం మత్తులో అన్ని మరచి దారుణానికి ఒడిగట్టాడు. శ్రీకాకుళం జిల్లా (Srikakulam) ఎచ్చెర్ల మండలం ముద్దాడపేటలో ఈ దారుణం చోటు చేసుకుంది.  తాగిన మైకంలో కుటుంబ సభ్యులందరిపై కత్తితో దాడి చేసి హతమార్చేందుకు ప్రయత్నం చేశాడు అప్పన్న అనే మందుబాబు.  దాడి చేసిన తరువాత.. అదే కత్తితో తనను తాను పొడుచుకున్నాడు. ఈ దాడిలో  అప్పన్న భార్య, అత్తమ్మ  అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబ సభ్యులు మరో ముగ్గురికి తీవ్ర గాయలు అయ్యాయి..

    అప్పటికే వారి కేకలు విని అక్కడి చేరుకున్న స్థానికులు హుటాహుటిన వారిని  దగ్గర్లో ఉన్న ఎచ్చెర్ల ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాల కారణంగా ఓ తాగుబోతు తన కుటుంబం మొత్తాన్ని కిరాతకంగా హతమార్చడానికి (Family murder) ప్రయత్నించాడని పోలీసులు నిర్ధారించారు.  ఎప్పటిలాగే తాగొచ్చిన అప్పన్నను ఎందుకు తాగొచ్చావని అడగడమే వారి పాపమైంది.

    ఇదీ చదవండి : కొత్త జిల్లాలతో గిరిజన యువకులకు అందలం.. కొత్త నేతలు పుట్టుకొస్తారా..?

    అప్పటికే తాగిన మైకంలో ఉన్న అప్పన్న.. తనను నిలదీసేసరికి తట్టుకోలేక పోయాడు.. ఇంట్లో ఉన్న కత్తి తీసి..  భార్య, అత్త, సోదరి సహా మరో ఇద్దరిపైనా విచక్షణా రహితంగా దాడి చేసాడు. కత్తితో గొంతులు కోసి హత్యచేసేందుకు ప్రయత్నించి, తను కూడా కత్తితో దాడి చేసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.

    ఇదీ చదవండి : టిఫిన్ అడిగితే ఆ మహిళ లేదని చెప్పింది.. ఆ వ్యక్తి ఏం చేశాడంటే..?

    తాగిన మత్తులో క్షణికావేశానికి గురై విచక్షణ కోల్పోవడంతో  అతడి భార్య, అత్త అక్కడికక్కడే  మరణించారు.  సోదరి సహా మరో ఇద్దరు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తరువాత పోలీసులకు పట్టుబడితే తన పరిస్థితి ఏంటి అనుకున్నాడు.. తాగి మత్తు వదిలిందో.. కారణం ఏదైనా కుటుంబ సభ్యులపై దాడి చేసిన కత్తితోనే.. తనను తాను పొడుచుకుని..  ఆత్మహత్యాయత్నానికి (Suicide) పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

    ఇదీ చదవండి : ట్రాక్టర్ డ్రైవర్ గా మారిన ఎమ్మెల్యే రోజా.. ఎలా నడిపారో చూడండిఎందుకో తెలుసా..?

    స్థానికుల సాయంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. స్ధానికుల సహాయంతో 108 ఆంబులెన్స్ లో గాయాలపాలై పరిస్థితి విషమంగా ఉన్న ముగ్గురిని ఎచ్చెర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్య, అత్తల మ్ళతదేహాలను ఈ ఉదయం పోస్ట్ మార్టమ్ నిమిత్తం తరలించారు. దాడి చేసిన కత్తిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆధారాల సేకరణలో పడ్డారు.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Crime news, Srikakulam

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు