Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH CRIME NEWS ONE MAN HARASSED A MINOR GIRL IN VIZIANAGARAM DISTRICT NGS VZM

Crime News: కోళ్లు కొనేందుకు వచ్చి.. పాడుపని చేశాడు.. జైలుపాలయ్యాడు

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Crime News: ముందుంది సంక్రాంతి పండుగ.. దీంతో మంచి కోళ్లు కొందామని ఊరు వచ్చాడు.. వచ్చిన పని చూసుకోకుండా.. ఓ మైనర్ బాలికపై మోజు పడ్డాడు ఆ కామాంధుడు.. చివరికి ఏం జరిగిందంటే..?

    Andhra Pradesh Crime news:  ఆంధ్రప్రదేశ్ లో కామాంధుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. కనీసం మైనర్ బాలికలను కూడా వదలడం లేదు.. తాజాగా విజయనగరంలో జరిగిన ఘటన సభ్య సమాజం తలదించుకునేలా చేస్తోంది. శృంగవరపు కోట మండలంలో రాజీపేటలోని ఒంటరిగా ఉన్న మైనర్ బాలికపై కామాంధుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. బాలిక అత్యాచారం నుండి తప్పించుకునేందుకు ఎంత ప్రయత్నించినా .. ఫలితం లేకపోయింది. నాటు కోళ్లు కొనేందుకు వచ్చిన దుండగుడు చివరికి బాలికిపై అఘాయిత్యానికి పాల్పడి, అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటన  ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన బాలిక ఆ విషయాన్ని తల్లిదండ్రులతో..  చెప్పడంతో.. అసలు విషయం బయటకు వచ్చింది. నిందితుడు.. బాలిక కుటుంబానికి దూరపు బంధువు కూడా అవుతాడని తెలుస్తోంది. 

    బాధితురాలి తల్లిదండ్రులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. అసలు ఆ కామాంధుడు వచ్చిన పని చూసుకోకుండా ఈ మైనర్ బాలికపై మోజు పడ్డాడు.. మైనర్ అని కూడా జాలి చూపలేదు.. తన కామవాంఛలన తీర్చుకునేందుకు పశువులా మారాడు. మనిషి అన్న సంగతి మరిచాడు. దూర బంధువు అయినా.. అతడిలోని కామాంధుడు బుసలు కొట్టాడు.


    నాటు కోళ్లు కొనేందుకు వచ్చిన ఓ కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న మైనర్ బాలిక కనబడడంతో.. కామంతో కళ్లు మూసుకుపోయి, అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి కుటుంబం ఎస్.కోట మండలంలోని రాజీపేట గ్రామంలో ఉన్న మామిడి తోటలో కాపు కాస్తూ.. అక్కడే ఉన్న ఇంట్లో నివాసం ఉంటోంది. తోటకు కాపు కాయడంతో పాటు.. తోటలోనే, నాటు కోళ్లు పెంచి అమ్ముతూ.. జీవనం సాగిస్తోంది.

    ఇలా నాటు కోళ్లు కొనేందుకు గ్రామస్తులు, వ్యాపారులు వస్తుంటారు. రెండు రోజుల క్రితం రాజీపేట గ్రామంలో ఉన్న మామిడి తోటకు .. గంట్యాడ మండలం బోనంగి గ్రామానికి చెందిన పొడుగు ఎర్నాయుడు అనే వ్యక్తి అక్కడికి కోళ్లు కొనడం కోసం వెళ్లాడు. ఎర్నాయుడు.. బాధితురాలి కుటుంబానికి దూరపు బంధువు కూడా అవుతాడు.

    ఎర్నాయుడు తోటలోకి వెళ్లే సమయంలో బాధితురాలి ఇంట్లో తల్లిదండ్రులు లేరు. ఉన్న ఒక్క తమ్ముడు కూడా దివ్యాంగుడు కావడంతో.. మంచంపైనే ఉండాల్సిన పరిస్ధితి. తల్లిదండ్రులు బ్యాంక్ పనుల నిమిత్తం ఎస్.కోట రావడం, ఫోన్ చేస్తే రావడానికి ఆలస్యం అవుతుందని చెప్పడంతో.. నిందితుడు ఇదే అవకాశమని భావించాడు. తాగడానికి నీళ్లు కావాలని చెప్పి ఇంటిలోపలికి వెళ్లిన నిందితుడు.. బాలికను మంచంపైకి తోసి అత్యాచారానికి పాల్పడ్డాడు.
    ఆ సమయంలో బాలిక గట్టిగా కేకలు వేసినా.. తోట కావడంతో , ఎవరికీ వినిపించలేదు.

    మైనర్ బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాక.. నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. అన్ని పనులు చేసుకొని.. సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు బాధితురాలు జరిగిన విషయం చెప్పింది. దీంతో తల్లిదండ్రులు బంధువులతో కలిసి.. శృంగవరపు కోట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు.
    దీంతో స్పాట్ కు చేరుకున్న పోలీసులు.. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఎస్.కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక నిందితుడిని సొంత గ్రామమైన బోనంగి లో అదుపులోకి తీసుకొని విచారించారు. కామాంధుడిపై  సెక్షన్ 376, 506 తో పాటు ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Crime news, Vizianagaram

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు