AP Crime News: ఆంధ్రప్రదేశ్ లో నేరల సంఖ్య పెరుుతోంది. చిన్న చిన్న కారణాలకే హత్యలకు కూడా కొందరు వెనుకాడడం లేదు..క్షణికావేశం ప్రాణాలు తీసేలా చేస్తోంది. తాజాగా పార్వతీపురం మన్యం జిల్లా (Parvathi Puram Manyam District) గరుగుబిల్లి మండలం రావివలసలో దారుణం చోటు చేసుకుంది. మాటకుమాట పెరిగి తనతో గొడవ పడిందన్న నెపంతో.. క్షణికావేశంలో అత్తను చంపేసింది ఓ కోడలు. గత రాత్రి ఇంట్లో ఇద్దరూ గొడవపడడం అయితే రాత్రి గొడవ సద్దుమణిగింది అనుకుంటే.. ఉదయం కూడా ఇద్దరి మధ్య మాటకు మాట మొదలైంది. ఇద్దరు మాట మాట అనుకుంటూ.. తోపులాటకు సిద్ధమయ్యారు. ఆ గొడవ ఈ హత్యకు కారణమయ్యాయి. ఇద్దరి మధ్య ఘర్షణ జరగడం, కొట్టుకోవడం, ఆ తోపులాటలో పడపోయిన అత్తను నేలకేసి కొట్టడంతో.. తలకు తీవ్ర గాయమై అత్త అక్కడికక్కడే ప్రాణాలు వదిలేసింది.
70 ఏళ్ల గుంట్రెడ్డి రాముడమ్మ ను క్షణికావేశంలో కోడలు తోసేసింది. ఘర్షణలో అత్త కింద పడ్డప్పడు వదిలేసి ఉంటే ప్రమాదం తప్పేది ఏమో.. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయిన కోడలు.. అత్త తలను నేలకేసి బలంగా కొట్టింది. దీంతో అత్త గుంట్రెడ్డి రాముడమ్మ అక్కడికక్కడే మ్ళతి చెందింది. తలకు తీవ్ర గాయాలు కావడం, రక్తస్రావం కావడంతో ప్రాణాలను అక్కడే వదిలేసింది.
గొడవ పెద్దదై ఇద్దరి మధ్య జరిగిన ఘటనను గమనించిన స్థానికులు గరుగుబిల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్ధలానికి చేరుకున్న గరుగుబిల్లి పోలీసులు నిందితురాలైన కోడలు గౌరమ్మను అదుపులోకి తీసుకున్నారు. జరిగిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీం ను రప్పించి సాక్ష్యాలను సేకరించారు. అత్త వేధింపులు భరించలేక తీవ్ర అసహనంతో ఉన్న కోడలు ఆమెను హతమార్చినట్లుగా పోలీసులు నిర్ధారించారు.
ఇదీ చదవండి : బలవంతం కాదు, ఎఫైర్ లేదు.. సృజన బ్యాగ్ లో గన్నేరు పప్పు ఎక్కడిది..?
నిందితురాలిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. తనను వేధించొద్దని పలు మార్లు కోడలు చెప్పినా.. అత్యా అదే పంథాలో వెళ్లడంతో ఆమె పగ పెంచుకుంది. మొత్తానికి కోడలితో గొడవలు పడిన అత్త కోడలు చేతిలో దారుణ హత్యకు గురికాగా, అత్తను చంపిన కోడలు జైలు పాలయ్యింది. ఫలితంగా ఆ ఇంట్లో పరిస్థితులు ఒక్కసారిగా దారుణంగా మారిపోయాయి. తల్లి చనిపోయి, కట్టుకున్న భార్య నిందితురాలిగా తేలడంతో.. వారి కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఇటీవల కాలంలో ఇలా క్షణికావేశంలో హత్యలు చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. అయినా మనుషుల్లో మార్పు రావడం లేదు. పంతాలకు.. ఆవేశాలకు పోయిన హంతకులుగా మారుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Crime news, Srikakulam