Raja Raja Chora: దొంగతనం కూడా ఒక కళ అన్నది సామెత.. అయితే దొంగతనం చేయడం కూడా అంత ఈజీ కాదు.. పొరపాటున ప్రయత్నం విఫలం అయితే.. జనాలతో దేహశుద్ధి తప్పదు.. అంతే కాదు దొంగతనం చేసే వారు ఎంత తెలివిగా వ్యవహరించిన లక్ కూడా ఫేవర్ చేయాలి.. లేదంటే సీన్ రివర్స్ అయ్యి.. దెబ్బలు తినాల్సి వస్తుంది. ఓ దొంగ పరిస్థితి అలానే తయారైంది. చాలా చక్కగా దొంగతనానికి ప్లాన్ చేశాడు. దానికోసం భారీగా రెక్కీ కూడా నిర్వహించాబు. అంతా అనుకున్న ప్లాన్ ప్రకారం.. ఒక ఆలయంలో దొంగతనం చేశాడు కూడా. అతడికి ఊహించని షాక్ తగిలింది. చివరికి జనాలకు చిక్కి.. వారితో బాగా తన్నులు తిన్నాడు.. అతడు వచ్చింది దొంగతానినికే అయినా.. ఆ వ్యవహారం అందరిలో నవ్వులు పూయించింది. పాపం దొంగ అనుకునేలా చేసింది. ఎందుకో తెలుసా..?
శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఓ గుడిలో దొంగతనానికి వచ్చిన ఓ దొంగ గుడి కన్నంలో ఇరుక్కుపోయి గ్రామస్తులకు చిక్కాడు. అమ్మవారి వల్లనో లేక, ఆ దొంగ టైమ్ బాగోలేదో తెలియదు గానీ గుడి కన్నంలో నుండి నడుము వరకూ బాగానే వచ్చి.. ఆ తరువాత బయటకు రాలేక ఇరుక్కుపోయాడు. అక్కడ నుంచి కిటికీ కన్నంలోంచి వెనక్కి వెళ్లలేక, ముందుకు రాలేక నానా తంటాలు పడ్డాడు. అలా సేపు అతడు చేసిన ప్రయత్నాలన్ని విఫలమయ్యాయి. చివరికి జనం చేతికి చిక్కాడు.
శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం జాడుపూడి గ్రామంలో జామి ఎల్లమ్మ ఆలయంలో సోమవారం రాత్రి ఓ వ్యక్తి దొంగతనానికి వెళ్లాడు. పక్క గ్రామానికి చెందిన ఇరుసు పాపారావు అనే వ్యక్తి ఆలయంలో చోరీకి ప్రయత్నించాడు. గ్రామానికి చాలా దూరంగా ఉండే ఆలయం కావడంతో.. అదే అదునుగా భావించిన పాపారావు.. మొదట గోడకు ఓ వైపున చిన్న రంధ్రం పెట్టి గుడిలోకి ప్రవేశించాడు. అయితే గుడి లోపలకు బాగానే వెళ్లిన దొంగ.. హుండీలో కానుకలు, అమ్మవారి నగలు దొంగతనం చేసి బయటకు వచ్చే సమయంలో మాత్రం రాలేకపోయాడు. తిరిగి వస్తూ అతడు ఆ చిన్న రంధ్రంలోనే ఇరుక్కుపోయాడు.
కన్నంలో నుండి గుడి బయటకు వచ్చేందుకు ముందుకు రాలేక, వెనక్కు వెళ్లలేక మధ్యలోనే ఉండిపోయాడు. ఇంతలో తెల్లవారడం, అటు వస్తున్న గ్రామస్తులకు కిటికీలోంచి వేలబడుతున్న అప్పారావు గ్రామస్తుల కంటపడ్డాడు. గుడిలో బంగారు, వెండి వస్తువులను తీసుకుని తిరిగి బయటపడే క్రమంలో దొంగ ఇరుక్కుపోయినట్లు గ్రామస్తులు గుర్తించారు.
ఇదీ చదవండి : ప్రధాని సహా, కేంద్రమంత్రులతో సీఎం జగన్ వరుస భేటీలు.. ఆయన ఏం చెప్పారంటే..?
అయితే తననను బయటకు తీయాలంటూ ఆ దొంగ గ్రామస్తులను వేడుకున్నాడు. అయితే అప్పటికే అతడి చేతిలో ఉన్న అమ్మవారి ఆభరాలు కింద పడి ఉండడంతో గ్రామస్తులు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ .. చాలా సేపటి వరకూ పట్టించుకోలేదు. ప్రాణ సంకటంగా మారిన పాపారావు పరిస్థితి వీడియో తీసిన తర్వాత.. దొంగను కిటికీలో నుంచి బయటకు తీశారు. దీంతో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తరువాత కంచిలి పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.