Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH CRIME NEWS ON DEPUTY MRO CAUGHT BY ACB BY DEMANDING 6 LAKSH RUPEES FROME WOMEN NGS VSP

corrupt Officer: ఫ్యామిలీ సర్టిఫికెట్ అడిగిన మహిళ.. హోటల్ కు వస్తే పనైపోతుందన్న తహసీల్దార్.. సహజీవనం చేస్తున్న మహిళ ఫ్లాట్ లోనే వ్యవహరం..?

ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహసీల్దార్

ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహసీల్దార్

Corruption deputy MRO: అతడు ఉన్నత పదవిలో ఉండే అధికారి.. భార్యతో విబేధాల కారణంగా మరో మహిళతో కొత్త ఫ్లాట్ తీసుకుని.. అక్కడే సెటిల్మెంట్లకు తెరలేపాడు.. వ్యవహారం ఏదైనా అక్కడే చెక్కబెట్టేవాడు.. ఓ వివాహ ఫ్యామిలీ సర్టిఫికేట్ కావాలని కోరితే.. ప్రతిఫలంగా ఒక డిమాండ్ పెట్టాడు.. మొదట హోటల్ కు రమ్మన్నాడు.. తరువాత ఫ్లాట్ కు రమ్మన్నాడు.. చివరికి ఏం జరిగిందంటే?

ఇంకా చదవండి ...
  Corruption deputy MRO:  అవినీతి తిమింగాలలు తరచూ ఏసీబీ (ACB) వలకు చిక్కినా వారి తీరు మారడం లేదు. నిత్యం లంచావతారులు కథలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కఠినమైన శిక్షలు లేకపోవడం.. సోధాలు.. సస్పెన్షన్లు అంటూ అధికారులు చేతులు దులుపుకోవడంతో వారి బుద్ధి మారడం లేదు.. రోజూ ఏదో ఒక చోట చేయి చాచే వారిగురించి వినక తప్పడం లేదు. తాజాగా ఓ డిప్యూటీ తహసీల్దార్ (Deputy MRO) వ్యవహారం ఏసీబీ అధికారులకు షాకిచ్చింది. ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ జారీకి ఆ డిప్యూటీ తహసీల్దార్‌ ఆరు లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. చివరకు 4.5 లక్షల రూపాయలకు ఒప్పందం చేసుకున్నాడు.. అదికూడా 60 వేల రూపాయలు అడ్వాన్స్ గా పట్టుకోని ఓ హోటల్ దగ్గరకు రమ్మన్నాడు.. తరువాత ఏమైందో ఏమో.. అతడు సహజీవనం (Living Relation) ఉంటున్న ఫ్లాట్ కు రమ్మని డిమాండ్ చేశాడు. అయితే అప్పటికే అతడిపై నిఘా వేసిన ఏసీబీ అధికారులు.. పక్క ప్లాన్ ప్రకారం.. అతడు అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళతో ఉన్న ఫ్లాట్ కు వెళ్లి సోదాలు నిర్వహించి.. అసలు విషయం తెలిసాక షాక్ అయ్యారు.. దీనికి సంబంధించిన ఏసీబీ ఇన్‌చార్జి డీఎస్పీ కె.లక్ష్మణమూర్తి తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

  విశాఖపట్నం ( Visakhapatnam)లోని జ్ఞానాపురం ప్రాంతానికి చెందిన ఎన్‌.అన్నపూర్ణ తండ్రి నౌకాదళంలో పనిచేసి కొన్నేళ్ల కిందట మృతి చెందారు. పెన్షన్‌ ప్రయోజనాల కోసం అన్నపూర్ణ.. నేవీ అధికారులను సంప్రదించగా ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ (ఎవరైనా వ్యక్తి చనిపోతే అతని డెత్‌ సర్టిఫికెట్‌ ఆధారంగా అతనికి భార్య, పిల్లలు ఉన్నట్టయితే వారి వివరాలను నిర్ధారిస్తూ అధికారికంగా ఇచ్చే ధ్రువీకరణ పత్రం) ఉండాలన్నారు. తప్పని సరి పరిస్థితుల్లో ఆ మహిళ గత నెల 24న మహారాణిపేట తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లి సర్టిఫికెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఒకటి రెండు రోజులు తిరిగినా పని కాకపోవడంతో నేరుగా డిప్యూటీ తహసీల్దార్ రవి కుమార్ ను కలిసింది. దీంతో ఆయన పని ఈజీగా అయిపోతుందని.. తాను చెప్పినట్టు చేస్తే సులువుగా ఫ్యామిలీ సర్టిఫికెట్ వస్తుందని ఆమెకు భరోసా ఇచ్చి కండిషన్లు పెట్టాడు.

  ఇదీ చదవండి : అయ్యప్ప సన్నిధిలో మంత్రి అవంతి.. రేపు దీక్ష విరమణ

  డిప్యూటీ తహసీల్దార్‌ రవికుమార్‌ డిమాండ్‌ మొదట  అన్నపూర్ణ పట్టించుకోలేదు. దీంతో ఈ నెల నాలుగో తేదీన ఆమె దరఖాస్తును తిరస్కరించారు. ఇక చేసేది ఏమీ లేక ఆమె తిరిగి ఈ నెల 11న సర్టిఫికెట్‌కు దరఖాస్తు చేసి, డిప్యూటీ తహసీల్దార్‌ రవికుమార్‌ను కలిశారు. ఆ సర్టిఫికెట్‌ వస్తే అన్నపూర్ణకు నెలకు దాదాపు రూ.1.1 లక్షలు చొప్పున... ఇంతవరకూ 50-70 లక్షలు అందుతుందని. కాబట్టి, తనకు  ఆరు లక్షలు లంచంగా ఇవ్వాలి అని రవి కుమార్ డిమాండ్ చేశాడు. తాను అంత మొత్తం ఇచ్చుకోలేనని ఆమె చెప్పంగా.. మరో కండిషన్ పెట్టాడు.

  ఇదీ చదవండి : ఒక్కరోజు టీ,కాఫీ ఖర్చు అన్ని లక్షలా..? విపక్షాల మండిపాటు

  చివరిగా 4.5 లక్షల రూపాయలు ఇవ్వాలని.. అడ్వాన్సుగా 60 వేల రూపాయలు, సర్టిఫికెట్‌ జారీచేసిన తరువాత మిగిలిన మొత్తాన్ని నగరంలో ఓ ప్రముఖ హోటల్ దగ్గరకు వచ్చి స్వయంగా ఇవ్వాలని షరతు విధించాడు. దీంతో ఆమె అదేరోజు తెలివిగా ఏసీబీ అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. ఏసీబీ అధికారులు పథకం ప్రకారం సోమవారం బాధితురాలితో డీటీ రవికుమార్‌కు ఫోన్‌ చేయించి, అడ్వాన్స్‌ మొత్తాన్ని పట్టుకుని సిద్ధంగా వున్నానని చెప్పించారు. అతను ప్రొటోకాల్‌ డ్యూటీ నిమిత్తం ఎయిర్‌పోర్టుకు వెళుతున్నానని, తాను చెప్పిన హొటల్ దగ్గరకు వచ్చేయాలని సూచించాడు. అన్నపూర్ణ కారులో అక్కడకు వెళ్లి డబ్బులు అందజేయబోగా ఏమైందో ఏమీ కానీ.. ఇక్కడ వద్దని.. తనకు కరాస పోలీస్‌ క్వార్టర్స్‌ సమీపంలో ఓ మంచి ఫ్లాట్ ఉందని.. అక్కడ అయితే ఎలాంటి సమస్య ఉండదనిన చెప్పి.. శ్రీవెంకటేశ్వర అపార్ట్‌మెంట్‌ వద్దకు వెళదామని అక్కడ నుంచి బాధితురాలి కారులోనే అక్కడకు తీసుకెళ్లాడు.

  ఇదీ చదవండి : ఆ జిల్లాలో విజృంభిస్తోన్న అతిసార.. నలుగురు మృతి.. ఆస్పత్రిలో 60 మంది

  ఆ ఫ్లాట్ కూడా.. ఆయనగారు సహజీవం చేస్తున్నదని తెలిసింది. భార్యతో మనస్పర్థలు కారణంగా.. విడిగా ఉంటున్నాడు. కరాసలో ఓ ఫ్లాట్ కొని అక్కడ మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు. దీంతో ఆ ఫ్లాట్ లోనే ఈ వ్యహారం సెటిల్ చేసుకుందామని తీసుకెళ్లాడు. అక్కడ లంచం తీసుకుంటుండగా వారిని అనుసరిస్తున్న ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా రవికుమార్‌ను పట్టుకున్నారు. అతను నివాసం వుంటున్న ఫ్లాట్‌లోకి తీసుకువెళ్లి సోదాలు నిర్వహించగా అనధికారికంగా దాచిన మూడున్నర లక్షల రూపాయలు లభ్యమయ్యాయి. ఫ్లాట్ ఉన్న సౌకర్యాలు.. అతడి వ్యవహారం ఆధారంగా ఆయన భారీగానే అక్రమ ఆస్తులు కూడగట్టాడని భావిస్తున్నారు. దీంతో రవికుమార్‌ ఇంటితోపాటు కార్యాలయంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో ఇన్‌చార్జి ఏసీబీ డీఎస్పీ లక్షణమూర్తితోపాటు సీఐలు పాల్గొన్నారు.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: ACB, Andhra Pradesh, AP News, Visakhapatnam, Vizag

  తదుపరి వార్తలు