Home /News /andhra-pradesh /

Extramarital Affair: తన సుఖాలకు అడ్డొస్తొందని కూతురి హత్యకు సహకరించిన కన్న తల్లి.. విద్యార్ధి మర్డర్ కేసులో సంచలన నిజాలు

Extramarital Affair: తన సుఖాలకు అడ్డొస్తొందని కూతురి హత్యకు సహకరించిన కన్న తల్లి.. విద్యార్ధి మర్డర్ కేసులో సంచలన నిజాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Live in Relationship: అమ్మంటే దేవత.. బిడ్డలను.. అందులోనూ ఆడపిల్లను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదే.. కానీ ప్రియుడి మోజులో పడ్డ ఓ అమ్మ... తన సుఖాలకు అడ్డుగా నిలుస్తోందని చేతికి అందివచ్చే కన్న కూతుర్ని హత్య చేస్తే ప్రియుడుకి సహకరించింది. చివరికి వారి పాపం పండింది.. విద్యార్థి మర్డర్ మిస్టరీలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి.

ఇంకా చదవండి ...
  Extramarital Affair: వివాహాని (Marriage)కి భారత దేశంలో  ప్రత్యేక గుర్తింపు ఉంది. కానీ ఈ రోజుల్లో వివాహ బంధానికంటే..  అక్రమ సంబంధాలకే ఎక్కుమంది మొగ్గు చూపుతున్నారు. బంగారం లాంటి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వారి జీవితాలను నాశనం చేసుకోవడమే కాదు కన్న బిడ్డలను.. కట్టుకున్న  భర్తను హత్య  (Murder) చేయడానికి వెనుకాడడం లేదు కొందరు మహిళలు. తాత్కాలిక సుఖాలు, ఆకర్షణల మాయలో పడి అందమైన కుటుంబాలను దూరం చేసుకుంటున్నారు. అలా ప్రియుడి మోజులో పడి  పేగుతెంచుకొని పుట్టిన కన్నబిడ్డ హత్యకు సహకరించింది  ఓ అమ్మ.

  వివరాల్లోకి వెళ్తే..  ఆంధ్రప్రదేశ్ లోని  ప్రకాశం (Praksaham) జిల్లాలోని  లింగసముద్రంలో అత్యంత దారుణంగా హత్యకు గురైన విద్యార్థిని 15 ఏళ్ల ప్రశాంతి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని, ఆర్థిక లావాదేవీలను ప్రశ్నిస్తుందనే కారణంతో తల్లితో వివాహేతర సంబంధం (Extramarital Affair)చేస్తున్న శ్రీకాంత్‌ అనే వ్యక్తే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తేల్చారు.

  ఇదీ చదవండి : ముంచుకొస్తున్న మరో ముప్పు.. ఆ నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

  జిల్లా డీఎస్పీ చెప్పిన  వివరాల ప్రకారం వేటపాలేనికి చెందిన ఈసునూరి మాధవి 15 ఏళ్లుగా లింగసముద్రం మండలం తిమ్మారెడ్డిపాలెంలో ఏఎన్‌ఎంగా పనిస్తోంది. విభేదాల కారణంగా భర్తతో పాటు ఇతర కుటుంబ సభ్యులకు దూరంగా కూతురు ప్రశాంతితో కలిసి జీవిస్తోంది. అయితే తన ఇంటి కింద పోర్షన్‌లో నివాసం ఉంటున్న జంగారెడ్డిపాలేనికి చెందిన వివాహితుడైన సుంకర శ్రీకాంత్‌తో పరిచయం ఏర్పడింది. అది కాస్త కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ప్రస్తుతం ఇద్దరూ కలిసి సహజీవనం సాగిస్తున్నారు.

  ఇదీ చదవండి : మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం.. వరదల్లో వైఫల్యంపై న్యాయ విచారణ చేయాలని చంద్రబాబు డిమాండ్

  శ్రీకాంత్‌ కుటుంబ సభ్యుల నుంచి కూడా ఎటువంటి అభ్యంతరం లేకపోవడంతో కలిసే జీవిస్తున్నారు. మాధవికి వచ్చే జీతాన్ని సైతం శ్రీకాంత్‌ తన సొంత ఖర్చులకు వాడుకునే వాడు.  ప్రశాంతి ఇటీవల తల్లిని ప్రశ్నించడం ప్రారంభించింది. 10వ తరగతి పూర్తి చేసిన ప్రశాంతి మంచి మార్కులతో నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో సీటు సాధించింది. అక్కడ 60 వేలు కట్టాల్సి వచ్చింది. మాధవి ఆ డబ్బును శ్రీకాంత్‌ను అడిగింది.  దీంతో ఆవేశానికి గురైన శ్రీకాంత్ ప్రశాంతి అడ్డు తొలగించుకోవాలి అనుకున్నాడు.  కనిపించింది. వెంటనే  ఉంటే మాధవితో తన సంబంధం కొనసాగదని, ఆర్థిక విషయాల్లో తన బాగోతం బయటపడుతుందని భావించిన శ్రీకాంత్‌ ప్రశాంతిని చంపేందుకు నిర్ణయించుకున్నాడు.

  ఇదీ చదవండి : మనిషి కాదు దేవుడు.. జీవితంపై ఆశలు వదులుకున్న నలుగురి ప్రాణాలు కాపాడాడు..

  ఈ నెల 23వ తేదీన ఉదయం 7గంటల సమయంలో ఇంట్లో నిద్రపోతున్న ప్రశాంతిని గొంతునులుమి చంపేశాడు. శవాన్ని ఏం చేయాలో తెలియక ఆ రోజంతా ఇంట్లోనే ఉంచుకున్నారు. అర్ధరాత్రి సమయంలో తన స్నేహితుడైన గురుబ్రహ్నం, మాధవి, శ్రీకాంత్‌ కలిసి అటవీ ప్రాంతానికి శవాన్ని తరలించి పెట్రోల్‌, డీజిల్ పోసి తలగబెట్టారు. మరుసటి రోజు వెళ్లి శవం పూర్తిగా కాలకపోవడంతో మట్టివేసి కప్పి వచ్చారు.  అయితే పోలీసుల విచారణ కన్నతల్లి నేరాన్ని అంగీకరించింది. ప్రశాంతిని హత్య చేయించేందుకు సహకరించాను అంది.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Crime news, Prakasam

  తదుపరి వార్తలు