Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati
Crime News: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో జరిగిన ఓ ఘటన కలకలం రేపింది. ఓ ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థకు ఫోన్ వచ్చింది. అవతల నుంచి ఫోన్ చేసిన వ్యక్తి తనను తాను సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) ని అంటూ పరిచయం చేసుకుంది. సీఎం జగన్ నిజంగానే ఫోన్ చేశారు అనుకొని చెప్పండి సార్ అని గౌరవంగా మాట్లాడారు.. తనకు అర్జెంట్ గా 12 లక్షల రూాపాయలు కావాలని అడగడంతో కాసేపు షాక్ కు గురయ్యారు. ఇలా కేవలం ఆ కంపెనీకి మాత్రమే కాదు.. పలు కంపెనీలకు సీఎం జగన్ అని చెప్పడమో.. లేదా సీఎంకు పీఏ అనో చెబుతూ.. పలువురు యజమానుల దగ్గర మూడు కోట్ల రూపాయాల మేర వసూలు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఎం పేరు లేదా ఆయ పీఏ పేరు చెబుతూ పలువురు బడా వ్యాపారా వేత్తలను మోసం చేసి ఏపీకి చెందిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇలా పలు చోట్ల నేరాలకు పాల్పడిన వ్యక్తిని శ్రీకాకుళం వాసి.. రంజీ మాజీ క్రికెటర్ బుడుమూరు నాగరాజుగా గుర్తించారు. నిందితుడిని మార్చి 14న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
పలు కంపెనీల ఫిర్యాదు మేరకు.. దాదాపు రెండు నెలల తర్వాత నిందితుడు నాగరాజు బుడుమూరుగా గుర్తించారు పోలీసులు. ముంబై సైబర్ సెల్ పోలీసులు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఉన్నారు. నాగరాజు సీఎం వ్యక్తిగత సహాయకుడిగానో, సీఎంగానో పరిచయం చేసుకుంటు 60 కంపెనీల నుంచి దాదాపు 3 కోట్ల రూపాయల మేర మోసం చేసినట్లు అధికారులు గుర్తించారు.
ఇదీ చదవండి : పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి డిక్లరేషన్.. మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం. ప్రముఖ ఎలకాట్రనిక్స్ చైన్ సంస్థ తరఫున ముంబైలో పనిచేస్తున్న ఉద్యోగికి గతేడాది డిసెంబరులో ఒక ఫోన్ కాల్ వచ్చింది. ‘ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సహాయకుడిని మాట్లాడుతున్నాను. మా సీఎం మీ ఎండీతో మాట్లాడాలని అనుకుంటున్నారు. ఆయన ఫోన్ నంబర్ కావాలి అని అడిగారు. ఆ తర్వాత ఆ సంస్థ ఎండీకి ఫోన్ చేసిన ఆ వ్యక్తి.. ‘తాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని మాట్లాడుతున్నాను అని పరిచయం చేసుకున్నారు. ఓ క్రికెటర్‌కు క్రికెట్ టోర్నీలో కిట్ కోసం 12 లక్షలు స్పాన్సర్ షిప్ చేయాలని అడిగారు. ఓ రాష్ట్ర సీఎం ఫోన్ చేసి మరీ అడగడంతో ఆ సంస్థ కాదనలేకపోయింది. సదరు క్రికెటర్‌కు 12 లక్షలు ఇచ్చేసింది. ఆ తర్వాత తాము మోసపోయామన్న సంగతి గుర్తించింది. దీంతో ఆ సంస్థ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి : పొత్తుల కోసం వెంపర్లెందుకు..? దమ్ముంటే 175 సీట్లలో పోటీ చేస్తారా? విపక్షాలకు జగన్ సవాల్
ఎలక్ట్రానిక్స్ విక్రేత తాను మోసపోయానని తెలుసుకున్నప్పుడు, అతను జనవరిలో ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సైబర్ సెల్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించి శ్రీకాకుళంలో నిందితుడి ఆచూకీని గుర్తించారు. సైబర్ క్రైమ్ పోలీసులు తీగ లాగితే డొంక కదిలింది. సీఎం జగన్‌గా నటిస్తూ ఫోన్ చేసింది శ్రీకాకుళం జిల్లావాసి బుడుమూరు నాగరాజు అని తేలడంతో.. ముంబై నుంచి వచ్చి అతన్ని అరెస్టు చేశారు. నిందితుడు ఆంధ్ర క్రికెట్ అసోషియేషన్ నకిలీ పత్రాలు, ఈమెయిల్ ఐడీలను సృష్టించి పంపడంతో.. నిజమేనని నమ్మిన ఆ సంస్థ 12 లక్షలు మంజూరు చేసినట్టు పోలీసులు తెలిపారు. అలాగే ఏపీ, తెలంగాణల్లో ఇదే తరహాలో 60 కంపెనీలను బురిడీ కొట్టించి సుమారు 3 కోట్ల వరకు కాజేసినట్టు గుర్తించామని చెప్పారు. అతని బ్యాంకు ఖాతా నుంచి 7.6 లక్షలు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Crime news, Guntur