Breaking News: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ను వరుస ప్రమాదాలు భయపెడుతున్నాయి. తాజాగా కాకినాడ (kakinada) లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఏకంగా నలుగురు మృతి (Fout People Dead) చెందారు. కాకినాడ జిల్లా (Kakinada District) గండేపల్లి మండలం మల్లేపల్లి దగ్గర తెల్లవారుజామున ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాలీని టాటా మ్యాజిక్ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. మరో తొమ్మిది మందికి గాయాలు అయ్యాయి. ఇక ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షత గాత్రులను ఆస్పత్రికి తరలించారు స్థానికులు. తాడేపల్లిగూడెం నుంచి విశాఖ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు.
ప్రమాదం సమయంలో.. టాటా మ్యాజిక్‌లో మొత్తం 13 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదానికి అతి వేగమే ప్రధాన కరణమణ అంచా వస్తున్నారు. ప్రమాదం జరిగింది అని తెలియగానే.. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. స్థానికుల సహకారంతో క్షతగాత్రులను హుటాహుటిన రాజమండ్రిలోని ఆస్పత్రికి తరలించారు. మొత్తం 9 మందికి చికిత్స అందుతుండగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది అంటున్నారు.
మరోవైపు ఈ మృతులు ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణ పురానికి చెందిన వారిగా గుర్తించారు. మృతులు డ్రైవర్ కొండ (నల్లజర్ల), ప్రసాద్ (నారాయణపురం), మహేష్ (ఉండ్రాజవరం), మంగ (నల్లజర్ల) అని తెలియజేశారు. ఏలూరు జిల్లా నారాయణపురం నుంచి అనకాపల్లి జిల్లా కాశింకోటలో జరగుతున్న ఉత్సవంలో ప్రదర్శన ఇచ్చేందుకు జానపద కళాకారులు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇదీ చదవండి : టీడీపీ నియోజకవర్గాలపై సీఎం ఫోకస్.. 175 గెలవొచ్చు.. ఈసారి గెలిస్తే మరో 30 ఏళ్లు మనమే అన్న జగన్
అమ్మవారి జాతరలో భాగంగా.. ఉత్సవాల్లో ప్రత్యేక ప్రదర్శనల కోసం ఈ కళాకారులు అంతా అనకాలపల్లికి బయలు దేరారు.. తమ కళలతో అందరిని అలరించాలని మొదలైన వారి ప్రయాణం.. మధ్యలోనే ముగిసిపోయింది. దీంతో పెను విషాదం నెలకొంది.
అయితే కాకినాడ పరిధిలో 24 గంటల్లోనే వేర్వేరు ప్రమాదాల ద్వారా ఏడుగురు చనిపోవడం ఆందోళన పెంచుతోంది. మంగళవారం ఓ కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు కారణంగా.. ముగ్గురు కార్మికులు మరణించారు. ఆ ఘటన మరువకముందే.. ఇలా ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు మృత్యువాత పడడం కలకలం రేపుతోంది. ముఖ్యంగా ఏపీలో ఇటీవల పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై ఆందోళన చెందుతున్నారు స్థానికులు.. నిత్యం ఎక్కడో ఓ చోటు రాహదారులు రక్తమోడుతూనే ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Road accident, Srikakulam