Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH CRIME NEWS HUSBAND KILLED HIS WIFE WITH SUPPORT OF PARENTS IN SRIKAKULAM NGS VZM

AP Crime: ఆ పని చేయడానికి చేతులు ఎలా వచ్చాయో..? కన్న పిల్లల ముందే ఇంత దారుణమా?

భార్యను కిరాతకంగా హత్య చేసిన భర్త

భార్యను కిరాతకంగా హత్య చేసిన భర్త

AP Crime News: అసలు వీడు భర్తేనా..? కట్టుకున్న భార్యను కన్న పిల్లల ముందు ఇంత దారుణానికి పాల్పడతాడా..? ఫోన్ కాల్ కే ప్రాణాలు తీయాలా..? అందులోనూ తల్లి దండ్రుల సహకారం తీసుకుని.. నర రూప రాక్షసుడిలా ప్రవర్తిస్తాడా..? ఇంతకీ ఏం జరిగిందంటే..?

ఇంకా చదవండి ...
  AP Crime: కట్టుకున్న భర్తే కాలయముడయ్యాడు. అత్తమామలు సహకరించారు. చివరికి ముగ్గురు కలిసి అనంత లోకాలకు పంపించేసారు. ప్రస్తుతం భర్త (Husband)కు దూరంగా ఉంటున్న తన భార్య (Wife)ను తన తల్లిదండ్రులతో కలిసి వెళ్లి పిల్లల ముందే అతికిరాతకంగా చంపేసాడు (Husband killed wife). భార్య వేరే వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతుందనే అనుమానంతో ఓ సారి దాడిచేయడంతో.. ప్రస్తుతం దూరంగా ఉంటున్న భార్యను పీక మీద కాలితో నొక్కి అతి కిరాతకంగా చంపేసాడు. శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) లో ఈ ఘటన చోటు చేసుకుంది. అది కూడా  కన్నపిల్లల ముందే తల్లిని  కిరాతకంగా కడతేర్చారు. అత్తింటి వాళ్లే ఈ దారుణానికి ఒడిగట్టారు. ఆ ఘోరం జరుగుతుంటే పిల్లలు రోదిస్తూ చూడటం తప్ప ఏమీచేయలేకపోయారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పద్మతుల గ్రామంలో ఈ దారుణం వెలుగు చూసింది.

  పోలీసులు, స్థానికులు చెప్పిన సమాచారం ప్రకారం.  భర్త ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నాడు. అయితే అతడికి అనుమానమనే పెనుభూతంగా మారింది. అంపురం పంచాయతీ పరిధిలోని పద్మతుల గ్రామానికి చెందిన పిట్ట శ్రీనుకు పుష్పతో 11 ఏళ్ల కిందట వివాహమైంది. ప్రస్తుతం పుష్ప వయసు 30 ఏళ్లు. ఈ దంపతులకు ఇద్దరు కుమర్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. శ్రీను ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నాడు. అయితే తన భార్య  వేరే వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతోందని శ్రీను అనుమానం పెంచుకున్నాడు.  ఆ అనుమానం పెరిగి పెరిగి పెను భూతంలా మారింది. ఏడాది కిందటే ఓ ఫోన్ కాల్ విషయంలో ఆమెతో గొడవపడి దాడి చేశాడు. వెంటనే  ఆమె పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ కేసు కంచిలి పోలీస్‌ స్టేషన్‌‌లో పెండింగ్‌లో ఉంది. కాపురంలో కలతలు చోటు చేసుకోవడంతో భార్యాభర్తలు అదే గ్రామంలో వేర్వేరు ఇళ్లల్లో ఉంటున్నారు. కొన్ని రోజుల కిందట శ్రీను సెలవుపై స్వగ్రామానికి వచ్చాడు. అదే సమయంలో పుష్ప.. తన కన్న వారి ఊరైన ఇచ్ఛాపురం గ్రామానికి అమ్మవారి పండుగ కోసం వెళ్లింది.

  ఇదీ చదవండి : ఉడుతదే పాపం అంటున్నారు అధికారులు.. కానీ ఆటోపై ఇనుప మంచం.. చేతికందే ఎత్తులో కరెంటు వైర్లు.. మరి తప్పెవరిది?

  అక్కడ గ్రామదేవత జాతరను చూసి, వారం రోజుల తర్వాత శుక్రవారం  తిరిగి పద్మతుల గ్రామానికి వచ్చారు. పుష్ప తన ఇంటికొచ్చేసరికి భర్త ఆమె ఉంటున్న ఇంటి తాళాలు పగులగొట్టి వేరే తాళాలు వేసి, అతడి తల్లిదండ్రులు నూకయ్య, సాయమ్మ వద్దకు వెళ్లాడు. పుష్ప ఆ తాళాలను విరగ్గొట్టి ఇంటిని శుభ్రం చేసుకుంది. తరువాత సాయంత్రం తన ముగ్గురు పిల్లల్ని ఇంటికి పిలిచేందుకు భర్త ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో మామ నూకయ్య ‘నీకు పిల్లలు కావాలా..?’ అంటూ ఆమెను దుర్భాషలాడినట్లు తెలుస్తోంది. అత్తామామలిద్దరూ కలిసి ఆమెను రోడ్డుపైకి తోసేశారు. కిందపడిపోయిన ఆమెను నూకయ్య, శ్రీను కలిసి పీక మీద కాలు వేసి నులమడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తరువాత ఆమె చనిపోయిందో లేదో అని నోటిలో గుడ్డలు కూడా కుక్కి కిరాతకంగా ప్రవర్తించారు. ః

  ఇదీ చదవండి : పెళ్లి చేసుకుంది.. తల్లిదండ్రులు కష్టాల్లో ఉందని చెప్పి పుట్టింటికి వెళ్లింది.. విషయం తెలిసి షాకైన పెళ్లికొడుకు..

  కోడలిని చంపేయమంటూ సాయమ్మ ప్రోత్సహించినట్టు పోలీసుల విచారణలో తేలింది. పుష్ప పెద్ద కుమార్తె, ఆమె బంధువు దాలమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు.. ముగ్గురు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సోంపేట పోలీసులు తెలిపారు.
  మొత్తానికి అనుమానం భూతం కారణంగా భర్త, అత్తమామలు కిరాతకంగా ప్రవర్తించి ప్రస్తుతం ఊచలు లెక్కబెడుతున్నారు. ఆ పిల్లలు అనాథలయ్యారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Crime news, Srikakulam

  తదుపరి వార్తలు