Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH CRIME NEWS HUSBAND ASSASSINATED WIFE BRUTALLY IN EAST GODAVARI DISTRICT NGS

AP Crime: చీర కొనుక్కుందని రాక్షసత్వం.. ప్రేమించి పెళ్లాడాడు.. కానీ నరకం చూపించాడు

చీర కొనుక్కుందని హత్య చేసిన భర్త

చీర కొనుక్కుందని హత్య చేసిన భర్త

AP Crime: దారుణం.. రాక్షసత్వం అన్న పదాలు చాలా చిన్నవి అయిపోతాయి ఈ నరరూప రాక్షసుడికి.. ప్రేమించాను అన్నాడు.. కాలు కింద పెట్టకుండా చూసుకుంటాను అన్నాడు.. నమ్మి పెళ్లాడితే నిత్యం నరకం చూపించాడు.. కానీ చీర కొనుక్కుంది అనే కారణంతో ఇటుక రాయితో బాది భార్యను హత్య చేశాడు..

ఇంకా చదవండి ...
  Husband Assassinated Wife Brutally: మనిషా.. రాక్షసుడా అని కొంతమందిని చూస్తే అనుమానం కలుగుతుంది. ఆవేశం.. అనుమానం చాలా మందిలో ఉంటాయి.. కానీ ఆ సాకుతో నర రూప రాక్షసులు అవుతున్నారు కొందరు. మనుషులం అన్న సంగతి మరిచిపోతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో జరిగిన ఓ ఘటన మనుసల్లో క్రూరత్వాన్ని ప్రశ్నించేలా చేస్తోంది. ప్రేమ ప్రేమ (Love) అంటూ వెంటపడ్డాడు. నువ్వు లేకపోతే నేను లేను అంటూ కబుర్లు చెప్పాడు. ఒక్క సారి ఒకే అంటే పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటానని.. కాలు కింద మోపనివ్వనని ప్రమణాలు చేశాడు. అతడి మాయ మాటలు నమ్మిన ఆమె.. ప్రేమ అంటే ఇంత బాగుటుంద అని అతనిని నమ్మి పెళ్లి  (Marraige) చేసుకుంది. కానీ పెళ్లైన తరువాత ఆ ప్రేమ యాయమైంది.. అతడి నిజ రూపం దర్శనమిచ్చింది. పెళ్లైన కొన్ని రోజుల నుంచే ఆ యువతికి నరకం అంటే ఏంటో ప్రత్యక్షంగా రుచి చూపించాడు. అయితే అతడి ఆవేశం చల్లారలేదు. అతడిలోని రాక్షసుడు నిద్ర పట్టనీయకుండా చేశారు. రోజు కొడుతూ మనసుకు ప్రశాంతత దొరకలేదు. దీంతో తీవ్రావేశానికి లోనై చివరకు చిర గురించి గొడవ పెట్టుకుని అతి కర్కశంగా భార్యను హతమార్చాడు.

  పోలీసులు, స్థానికుల చెప్పిన వివరాల ప్రకారం తూర్పు గోదావరి జిల్లా (East Godavari District) నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలేనికి చెందిన కళ్యాణం దుర్గా ప్రసాద్, పెంటపాడు మండలం రామచంద్రాపురానికి చెందిన దానమ్మ పెద్దలను ఎదిరించి ప్రేమపెళ్లి చేసుకున్నారు. దానమ్మ తల్లిదండ్రులు బూరలు, రబ్బర్‌ బ్యాండ్లు, చెంపిన్నులు.. వంటి సామగ్రి విక్రయిస్తూ జీవనం సాగించేవారు. దుర్గాప్రసాద్‌ కూడా అదే వృత్తి చేసేవాడు. అయితే చిన్న వయసు నుంచి బుద్ధు చెప్పే వారు లేకపోవడంతో తాగుడు, జూదానికి బానిసై.. బాధ్యతలు వదిలేశాడు.. వీరికి ఒక కుమార్తె కూడా పుట్టింది.

  ఇదీ చదవండి : చంద్రబాబు క్షమాపణలు చెప్పాలంటూ ట్విట్టర్ లో ట్రెండింగ్.. జూనియర్ ఎన్టీఆర్ తప్పేంటి అని ఫ్యాన్స్ ఫైర్

  భర్త బాధ్యతల నుంచి తప్పుకోవడంతో ఇల్లు గడవని పరిస్థితి ఏర్పడింది. దీంతో దానమ్మ తప్పనిసరి పరిస్థితుల్లో భిక్షాటన చేసి భర్త, అత్త మామలను పోషించేది. అయినా అవేవి పట్టించుకోని దుర్గా ప్రసాద్ మద్యం మత్తులో ఆమె భిక్షాటన చేసి తీసుకొచ్చిన సొమ్ము కూడా లాక్కునేవాడు. చిత్ర హింసలు పెట్టేవాడు. దానమ్మ గర్భిణి అని చూడకుండా తీవ్రంగా కొట్టడంతో 20 రోజుల క్రితం ఆమెకు గర్భస్రావమైంది.

  ఇదీ చదవండి : టీడీపీలో చేరాలి అనుకునేవారికి షాక్.. వలపక్షులకు చోటు లేదన్న చంద్రబాబు

  అయినా తన బాధ ఎవరికీ చెప్పుకోలేక అలాగే.. కష్టాలు అనుభవిస్తూ జీవనం కొనసాగించేది. ఇటీవల భర్తకు తెలియకుండా 200 రూపాయలు పెట్టి చీర కొనుక్కుందని తెలిసి ఆమెతో గొడవ పడ్డాడు. అత్త మరిడమ్మ కూడా అతడికి తోడైంది. ఈ గొడవ పెరిగి పక్కనే ఉన్న ఇటుక రాయితో దానమ్మను తీవ్రంగా కొట్టాడు. బాధ తట్టుకోలేక ఆమె అరిచిన అరుపులకు రాత్రి పది గంటల సమయంలో చుట్టుపక్కలవారు పోగయ్యారు. దెబ్బలకు దానమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. చుట్టుపక్కలవారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దానమ్మను భర్త, అత్త కొట్టి చంపారని మృతురాలి తరఫు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Crime news, East godavari, Husband kill wife

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు