హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Crime News: సూడాన్ టు చిత్తూరు.. మత్తులోకలంలో యువత.. దీని వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?

Crime News: సూడాన్ టు చిత్తూరు.. మత్తులోకలంలో యువత.. దీని వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?

సూడాన్ టు చిత్తూరు డ్రగ్స్ లింక్స్

సూడాన్ టు చిత్తూరు డ్రగ్స్ లింక్స్

Drugs Mafia: చిత్తూరు జిల్లాలో యువత మత్తులో తూగుతోందా..? సూడన్ నుంచి ఇక్కడి వారికి లింకులు ఎలా ఏర్పడ్డాయి.. పటిష్ట నిఘా ఉన్నా మత్తు వ్యాపార సామ్రాజ్యం ఇంతలా ఎలా విస్తరించింది..? ఇప్పుడు పోలీసులకు ఎలా చిక్కారు..

  • News18 Telugu
  • Last Updated :
  • Chittoor, India

GT Hemanth Kumar, Tirupathi, News18

Drugs Mafia In Chittoor:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో చిత్తూరు (Chittoor) లో డ్రగ్ మాఫియా (Drug Mafia) రోజు రోజుకూ వ్యాపారాన్ని విస్తరిస్తోంది. యువతే లక్ష్యంగా భారీగా డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తూ వస్తోంది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లోని యువత డ్రగ్స్ కి బానిసగా మారుతున్నారని వచ్చిన రహస్య సమాచారం మేరకు డ్రగ్స్ అక్రమ రవాణా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి డ్రగ్స్ అమ్మే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచారు పోలీసులు. దీంతో  తాజాగా చిత్తూరు పట్టణ పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున ఎమ్.డి.ఎమ్.ఎ (MMDA) అనే డ్రగ్స్ అమ్ముతున్న ముఠాకు చెందిన సూడాన్ దేశస్తుడితో పాటుగా మరో ఐదు మంది వ్యక్తులను అరెస్టు చేసి.. విచారిస్తూ సంచలన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం వారిద్దరి నుంచే సుమారు రెండు‌ లక్షల రూపాయల విలువ గల 34 గ్రాముల డ్రగ్స్ ను స్వాధీనం  చేసుకున్నారు.. 

చిత్తూరు ఎస్పి రిశాంత్ రెడ్డి వెల్లడించిన వివరాల మేరకు.. చిత్తూరు టౌన్ పరిధిలోని ఇరువారం జంక్షన్ సమీపంలోని బాల త్రిపుర సుందరి దేవస్థానం దగ్గర కొందరు వ్యక్తులు డ్రగ్స్ అమ్ముతున్నారని  రహస్య సమాచారం మేరకు  ప్రత్యేక సిబ్బంది, తాహిల్దార్ తో పాటుగా ఘటనా స్థలానికి చేరుకుని డ్రగ్స్ అమ్మేందుకు సిద్దం చేసుకుంటున్న ఎనిమిది మంది వ్యక్తులను పట్టుకునేందుకు ప్రయత్నించగా, అందులో ఇద్దరు వ్యక్తులు పరార్ కావడంతో మొత్తం ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

అసలు డ్రగ్స్ బిజినెస్ ఎలా ప్రారంభించారంటే..? 

చిత్తూరు జిల్లా, తవణంపల్లి మండలం ,అరగొండకు చెందిన సిరాజ్ అనే వ్యక్తి ఉద్యోగ రిత్యా బెంగళూరులో పని చేస్తూ, బెంగళూరు సిటీలోని బిటిఎం లేవుట్ ప్రాంతంలో సూడాన్ దేశానికి చెందిన అహమద్ ఒమర్ అహమద్ సయీద్ @ షాలూఫా అనే వ్యక్తితో పరిచయం ఏర్పరుచుకున్నాడు. అతడి ద్వారా డ్రగ్స్ వ్యాపారంను మొదలు పెట్టి బెంగుళూరులోని పలు ప్రాంతాల్లో అక్రమంగా డ్రగ్స్ అమ్ముతూ అక్రమంగా డబ్బులు సంపాదించేవాడు. చిత్తూరులోని కొందరు తెలిసిన వ్యక్తులతో కలిసి డ్రగ్స్ బిజినెజ్ విస్తరించాడు.

ఇదీ చదవండి : అలీ మనసు మారిందా..? పవన్ ను అంత మాట అనడానికి ఆ పదవే కారణమా..?

చిత్తూరు నగరానికి చెందిన సురేష్, ప్రతాప్, తేజ కుమార్, వెంకటేష్, జయశంకర్, మోహన్, మురళీలతో పరిచయాలు ఉన్న సిరాజ్ వారి ద్వారా పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో డ్రగ్స్ బిజినెస్ సంబంధించి పక్కా ప్లాన్ వేశాడు.. వీరి ద్వారా సిరాజ్ డ్రగ్స్ వ్యాపారం గురించి చెబుతూ, ప్రస్తుతం యువకులు ఎక్కువగా డ్రగ్స్ కు బానిసలు అవుతున్నారని, డ్రగ్స్ వాడడం వలన శరీరం యాక్టీవ్ గా ఉంటుందని, ఎదో తెలియని ఎనర్జీ వస్తుందనీ, శరీర బరువు కూడా తగ్గే అవకాశం ఉందని నమ్మించి యువతను ట్రాప్ లో దించడం టార్గెట్ గా పెట్టుకున్నారు.

ఇదీ చదవండి: జేసీ ప్రభాకర్ రెడ్డి ఉగ్రరూపం.. ఏకంగా కలెక్టర్‌పైనే ఫైర్.. ఎందుకంటే..?

చాలా మంది సెలబ్రిటీలు కూడా డ్రగ్స్ వాడుతున్నారని, ఈ డ్రగ్స్ ని నోటి ద్వారా, ముక్కు ద్వారా లాక్కోవడం, స్టెరిల్ వాటర్ నందు ఈ డ్రగ్స్ ని కలిపి ఇంజక్షన్ వేసుకోవడం చేయాలని వారికి మాయ మాటలు చెప్పి డ్రగ్స్ బిజినెస్ ను పెంచుకున్నాడు.  ఆ తరువాత సిరాజ్ ఎవరికీ అనుమానం రాకుండా అహమద్ ఒమర్ అహమద్ సయీద్ ద్వారా డ్రగ్స్ తెప్పించుకొని చిత్తూరులో ముందస్తుగా మాడ్లాడి ఉంచిన కొందరు వ్యక్తులకు పంచి పెట్టి చిత్తూరు పట్టణంలోని వేరు వేరు ప్రాంతాలలో వారి ద్వారా డ్రగ్స్ అమ్మించి అక్రమంగా డబ్బులు సంపాదిస్తూ ఉండేవాడు.

ఇదీ చదవండి: పవన్ ఇమేజ్ ను జగన్ పెంచుతున్నారా..? చంద్రబాబును పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?

తాజాగా చిత్తూరుకు చేందిన కొందరు వ్యక్తులతో డ్రగ్స్ తీసుకొనేందుకు చిత్తూరుకి రమ్మని చెప్పడంతో, సదరు అహమద్ ఒమర్ అహమద్ సయీద్  చిత్తూరు టౌన్, ఇరువారం జంక్షన్ వద్ద గల బాల త్రిపుర సుందరి దేవస్థానం వద్ద కలసి డ్రగ్స్ అమ్మడానికి పంచుకుంటూ మాట్లాడుకుంటూ ఉండగా, వారిలో 06 మందిని పోలీసులు అరెస్ట్..  చేస్తే ఇద్దరు పరారీ అయ్యారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Chittoor, Crime news, Drugs case

ఉత్తమ కథలు