Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH CRIME NEWS GUN FIRING CASE UPDATE THEY WANT TRY TO HONEY TRAP IN SRIKAKULAM NGS VZM

Honey Trap: వెలుగులోకి వైసీపీ నాయకురాలి హనీ ట్రాప్ వ్యవహారం.. కాల్పుల ఘటనలో సంచలన విషయాలు

హానీ ట్రాప్ కు యత్నం

హానీ ట్రాప్ కు యత్నం

Honey Trap: ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల ఓ సర్పంచ్ పై జరిగిన కాల్పుల ఘటన విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాల్పుల ఘటనక హనీ ట్రాపే అసలు కారణమని పోలీసులు తేల్చారు. ఇంతకీ ఏం జరిగిందంటే..?

    Honey Trap:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఇటీవల ఓ సర్పంచ్ పై కాల్పుల ఘటన కలకలం రేపింది.  శ్రీకాకుళం జిల్లా (Srikakulam District)లోని గార మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన సర్పంచ్ వెంకటరమణ మూర్తిపై రెండు రోజుల క్రితం  కాల్పులు (Firing) జరిగాయి. అయితే లక్కీగా కొద్దిలో ఆయన తప్పించుకోగలిగారు.  మంగళవారం సాయంత్రం 6.30 సమయంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు నిందితులు పాల్పొన్నట్టుగా .. వారిలో షాలిని అనే వైసీపీ నాయకురాలు (YCP Leaders) ప్రధాన నిందితురాలిగా, ఆమె సోదరుడు, సోదరుడి స్నేహితుడు నిందితులుగా పోలీసులు గుర్తించారు. షాలిని అనే మహిళకు, సర్పంచ్ కు మధ్య ఉన్న ఆర్ధిక లావాదేవీలే ఈ వ్యవహారానికి కారణమని  పోలీసులు తేల్చారు. 

    ఈ నెల 18 మంగళవారం సాయంత్రం.. శ్రీకాకుళం పట్టణంలో చోటు చేసుకున్న కాల్పుల కేసును పోలీసులు చేధించారు. ఈ కేసులో శ్రీకాకుళానికి చెందిన ఆదివారం పేటకు చెందిన షాలిని అనే మహిళ, వైసీపీ నాయకురాలిని ప్రధాన నిందితురాలిగా పోలీసులు గుర్తించారు. కాల్పుల్లో షాలిని అనే మహిళతో పాటే వచ్చిన ఇద్దరని సహ నిందితులుగా పోలీసులు తేల్చారు. ఈ నెల 18న సాయంత్రం శ్రీకాకుళం పట్టణంలోని పాత ఆర్డీవో కార్యాలయం సమీపంలోని మధురానగర్ లో రామచంద్రపురం సర్పంచ్ గోలివి వెంకట రమణమూర్తికి చెందిన కార్యాలయం లోనే అతడిపై తుపాకీతో కాల్పులు జరిపి హత్య చేసేందుకు ప్రయత్నించినట్టుగా పోలీసులు తేల్చారు.  

    శ్రీకాకుళం జిల్లా ఎస్పీ అమిత్ బర్ధార్ చెప్పిన వివరాల ప్రకారం..  ఈ కాల్పుల ఘటనను  హనీ ట్రాప్ కేసుగా తేల్చారు. శ్రీకాకుళం పట్టణానికి చెందిన షాలిని అనే మహిళ ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా గుర్తించామన్నారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన షాలిని, శ్రీకాకుళం పట్టణానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకొని ఇక్కడే సెటిలయింది. భర్త రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉండగా, ఈమె ప్రస్తుతం పట్టణంలోని ఆదివారం పేటలో వైసీపీ ముఖ్య నాయకురాలిగా ఉన్నారు. పొలిటికల్ గా చాలా యాక్టివ్ గా ఉండే షాలిని, పట్టణానికి చెందిన అందరు వైసీపీ నాయకులతో మంచి పరిచయమే ఉంది. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. వైసీపీ నాయకురాలైన షాలిని, ఆమె భర్త ప్రసాద్ కి, గార మండలం రామచంద్రపురం సర్పంచ్ వెంకట రమణ మూర్తికి గత ఐదేళ్లుగా పరిచయం ఉందన్నారు.

    ప్రధాన సూత్రదారి షాలిని కి, సర్పంచ్ వెంకటరమణ కు ఆర్ధిక లావాదేవీలు  ఉన్నాయని, ఆ పరిచయం మేరకు షాలిని , సర్పంచ్ ఆఫీసుకు వచ్చి వెళ్తుంటారన్నారు. ఇద్దరి మధ్య పరిచయం కాస్త.. అనేక అక్రమాలకు కారణంగా మారిందన్నారు. షాలిని, సర్పంచ్ వెంకటరమణ మూర్తికి మధ్య అనేక మంది అమ్మాయిలను ఎర వేయడం, డబ్బులు తీసుకోవడం వంటి లావాదేవీలు జరిగాయన్నారు. మంగళవారం కూడా ఇలాంటి హనీ ట్రాప్ చేసి, సర్పంచ్ నుండి 10 లక్షల రూపాయలు మొత్తాన్ని గుంజాలనుకున్నారని ఎస్పీ వివరించారు. 10 లక్షలు డిమాండ్ చేయగా, రెండు లక్షలు మాత్రమే ఇవ్వడానికి సర్పంచ్ ఒప్పుకున్నాడని ఎస్పీ వివరించారు. 

    మంగళవారం సాయంత్రం ప్రధాన నిందితురాలు షాలిని, ఆమె తమ్ముడు గిరి, మరో వ్యక్తి మోహిత్, మరో వాలంటీర్ తో కలిపి కాల్పులు చోటుచేసుకున్న సర్పంచ్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ సాయంత్రం 6.30 గంటలకు వెళ్లగా, సర్పంచ్ వెంకటరమణ మూర్తి, షాలిని ఇద్దరు బయటకు వెళ్లి, తిరిగి 9 గంటల సమయంలో ఆయన కార్యాలయానికి తిరిగి వెళ్లారు. అనంతరం కాసేపటికి సర్పంచ్ మీద కాల్పులు  జరిగాయి. షాలిని తమ్ముడుతో పాటు వచ్చిన మోహిత్.. తనతో తెచ్చిన 7.65 ఎంఎం గన్ ఉపయోగించి మొదట బెదిరించి, తర్వాత కాల్పులు జరిపారు. 

    ఈ కాల్పుల్లో సర్పంచ్ పొట్టలో బుల్లెట్లు రాసుకుంటూ వెళ్లగా, చిన్న గాయాలతో త్ళటిలో తప్పంచుకొని అక్కడి నుండి పరారయ్యారు.  ఘటనా స్థలంలో పోలీసులకు బుల్లెట్ షెల్స్ లభ్యం కాగా, డీఎస్పీ ఆధ్వర్యంలో క్లూస్ టీమ్ వేలిముద్రలను సేకరించామని, దర్యాప్తు చేసామని ఎస్పీ వివరించారు. షాలిని, అతని తమ్ముడు ఉత్తర ప్రదేశ్ కి చెందినవారు కాగా, మోహిత్ మద్య ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా ఎస్పీ వివరించారు.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Crime news, Srikakulam

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు